సత్తెనపల్లిలో టీడీపీకి షాక్

గుంటూరు జిల్లా సత్తెనపల్లి ఎమ్మెల్యే కోడెల శివ ప్రసాదరావు. గెలిచాక స్పీకర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. వెయ్యి లోపు మెజార్టీతోనే ఆయన గెలిచాడు. ప్రత్యర్థి వైకాపా నేత అంబటి రాంబాబు. కోడెల గెలుపుకు కీలక కారణం సత్తెనపల్లిలో ఉన్న వైశ్య సామాజిక వర్గం అండగా ఉండటం. ఇప్పుడు ఆ సామాజిక వర్గం టీడీపీకి దూరమవుతోంది. సత్తెనపల్లి నియోజకవర్గానికి చెందిన టీడీపీ సీనియర్ నేత నిమ్మకాయల రాజనారాయణ, ఆతుకూరి నాగేశ్వరరావు జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. 2014 ఎన్నికలలో రాజనారాయణకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని భావించారు. కానీ ఊహించని విధంగా ప్రస్తుత శాసనసభ స్పీకర్ గా వ్యవహరిస్తున్న కోడెల శివప్రసాదరావుకు సత్తెనపల్లి టికెట్ కేటాయించడంతో నిమ్మకాయల వర్గం తీవ్ర అసంతృప్తికి లోనైంది. 
తనకు కనీసం ఎమ్మెల్సీ లేక మరో పదవి ఇస్తారని భావించాడు నారాయణ. కానీ అదేం జరగలేదు. కోడెల వర్గం ఆయనకు సరైన ప్రయార్టీ ఇవ్వలేదు. ఫలితంగా ఇక టీడీపీలో ఉండటం మంచిది కాదనే అభిప్రాయానికి వచ్చాడు. అంతే పార్టీ మారాడు. వైకాపా తీర్థం పుచ్చుకున్నాడు. అంతే కాదు.. సత్తెనపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్, బులియన్ మర్చంట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఆతుకూరి నాగేశ్వరరావు కూడా పార్టీ మారడం బాబును కలవరానికి గురి చేస్తోంది. కోడెల కుటుంబానికి సత్తెనపల్లిలో మంచి పేరు లేదు. కోడెల కుమారుడు వల్ల తండ్రికి చెడ్డ పేరు వస్తుందంటున్నారు. ప్రతి పనికి పర్సంటేజ్ లు తీసుకుంటున్నారనే ఆరోపణలు వచ్చాయి. అంతే కాదు.. రైతుల భూములను ఆక్రమించి కోట్ల రూపాయలను దండుకున్నారనే వాదన లేకపోలేదు. 
ఫలితంగా కోడెల గుడ్ విల్ దెబ్బతింటోంది. ఇలాంటి సమయంలో టీడీపీ సీనియర్ నేతలు.. నియోజకవర్గంలో మంచి పలుకుబడి ఉన్న వారు పార్టీ మారడం కోడెలకు ఇబ్బంది తెచ్చి పెట్టే అంశమే. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.