చంద్ర‌బాబుకు త‌ల‌నొప్పిగా సీమ గోల‌!

బీజేపీ పొత్తుతో టీడీపీ ఎంత లాభ‌ప‌డింద‌నేది ప‌క్క‌న‌బెడితే..  విప‌క్షాల విసుర్ల‌కు అవ‌కాశం ఇచ్చిన‌ట్ట‌యింది. ఓ వైపు.. అధికార పార్టీపై పెరుగుతున్న అస‌హ‌నం.. కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌జాప్ర‌తినిధుల వ్య‌వ‌హార‌శైలితో.. ప్ర‌భుత్వంపై ప్ర‌జావ్య‌తిరేక‌త చాప‌కింద‌నీరులా చేటు తెచ్చే ప్ర‌మాదం పొంచివుంది. ఇది తెలిసిన బాబు.. పోల‌వ‌రం, కాపుల రిజ‌ర్వేష‌న్ రెండింటినీ కొలిక్కితెస్తే.. ఎన్నిక‌ల్లో కాస్త చీకాకులు త‌గ్గుతాయ‌ని పెద్దాయ‌న భావిస్తుంటే.. ప‌దేళ్ల‌త‌రువాత వ‌చ్చిన అధికారాన్ని ఎంజాయ్ చేయ‌ట‌మే ల‌క్ష్యంగా కొన్ని చోట్ల వ్వ‌వ‌హారం.. మ‌రోసారి విప‌క్షంలోకి నెట్టేస్తుంద‌నే ఆందోళ‌న‌ను క‌లిగిస్తుంది.

 

కోస్తాలో కాస్తం.. నేత‌లు ఆచితూచి అడుగులేస్తున్నారు. రాయ‌ల‌సీమ‌లో మాత్రం…  అస‌లు నేత‌లు.. వ‌ల‌స నేత‌ల మ‌ధ్య వివాదాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. భ‌రించ‌లేని ప‌రిస్థితుల్లో కొంద‌రు మాజీ నేత‌లు బ‌య‌ట‌ప‌డి మ‌రీ.. బాబును ఏకిపారేస్తున్నారు. కొంద‌రు.. బాబును ప‌రోక్షంగా వ్య‌తిరేకిస్తున్న‌ట్లుగా సంకేతాలు పంపుతున్నాయి. మొన్న‌.. ఆదినారాయ‌ణ‌రెడ్డితో రామ‌సుబ్బారెడ్డి  వ‌ర్గాల విబేధాలు ఎట్ట‌కేల‌కు కుదుట‌ప‌డ్డాయి. మాజీ ఎమ్మెల్యే వ‌ర‌ద‌రాజుల‌రెడ్డి వ‌ర్సెస్ ఎంపీ సీఎంర‌మేష్ మ‌ధ్య త‌గాదాల‌తో పార్టీ ప‌రువు బ‌జార్ను ప‌డేంత వ‌రకూ చేరింది. ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ స‌ద్దుమ‌ణిగిందంటే. ఇప్పుడు.. క‌ర్నూలులో మంత్రి అఖిల‌ప్రియ‌పై  బ‌న‌గాన‌ప‌లె్ల టీడీపీ ఎమ్మెల్యే జ‌నార్ద‌న్‌రెడ్డి ఏకంగా బాబుకే ఫిర్యాదు చేసేంత వ‌ర‌కూ చేరింది. త‌న‌ను కాద‌ని.. వైసీపీ నేత కాట‌సాని రామిరెడ్డిపై  ప్రేమ కురిపిస్తూ.. వారికి.. అనుకూల వ‌ర్గానికి కాంట్రాక్టులు, సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పిస్తుందంటూ ఏక‌ర‌వు పెట్టార‌ట జ‌నార్ద‌న్‌రెడ్డి. వాస్త‌వానికి గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌పున కాట‌సాని రామిరెడ్డి టీడీపీ త‌ర‌పున జ‌నార్ద‌న్ రెడ్డి పోటీప‌డ్డారు. ఇక్క‌డ వైసీపీ ఓటమితో కాట‌సాని.. జ‌నార్ద‌న్‌రెడ్డికి మ‌ధ్య వైరం మ‌రింత పెరిగింది. రాబోయే ఎన్నిక‌ల్లో ఎలాగైనా తాను పైచేయి సాధించాల‌నే ఉద్దేశంతో అఖిల పంచ‌న చేరిన‌ట్లు ప్ర‌చారం. అందుకే మంత్రి హోదాలో.. టీడీపీ వారిని ప‌క్క‌న‌బెట్టి.  వైసీపీ నేత‌ల‌కే ప్రాధాన్య‌త‌నిస్తున్న‌ట్లు ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి.

దీనిపై ఇద్ద‌ర్నీ కూర్చోబెట్టి.. మాట్టాడిన చంద్ర‌బాబు.. స‌ర్దుకుపోమ‌ని సూచించార‌ట‌. పైగా.. ప‌ది నెల‌ల వ్య‌వ‌ధిలో ముంచుకురాబోతున్న ఎన్నిక‌ల వేళ ఇటువంటి స్ప‌ర్ధ‌ల పార్టీకు చెడ్డ‌పేరు తెస్తాయ‌ని హెచ్చ‌రించార‌ట‌.మ‌రి.. అధినేత మాట అస‌లు నేత‌లు..కొస‌రు నేత‌లు ఎంత వ‌ర‌కూ ప‌ట్టించుకుంటారో మ‌రీ.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.