ఏపీ హోదాపై.. టీడీపీ నెక్ట్స్ స్టెప్‌!

భార‌త‌దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టుకు ఏపీ హోదా ఇవ్వ‌లేమ‌ని కేంద్రం చెప్ప‌టంపై టీడీపీ ఎటూ తేల్చుకోలేక‌పోతుంది. పైగా ఏపీ విభ‌జ‌న అనంత‌రం తామ ఇచ్చిన హామీ మేర‌కు నిధులు కేటాయించామంటూ లెక్క‌లు చూపి మ‌రీ కోర్టుకు విన్న‌వించింది. అయితే.. ఇదంతా బోగ‌స్ త‌ప్పుడు నివేదిక‌లంటూ మీడియా ముందు చెబుతున్న టీడీపీ శ్రేణులు.. ఇవిగో లెక్క‌లు.. అంటూ చూప‌లేక‌పోతుంది. పైగా కేంద్రం సుప్రీం ఎదుట ఉంచిన గ‌ణాంకాలు త‌ప్పు అయితే.. రాష్ట్ర ప్ర‌భుత్వం త‌న వ‌ద్ద‌వున్న ఆధారాల‌తో మ‌రోసారీ సుప్రీంలో పిటీష‌న్ వేయ‌వ‌చ్చు. పైగా త‌మ‌ను మోసం చేయ‌టం సంగ‌తి ప‌క్క‌న‌బెట్టి.. అత్యున్న‌త న్యాయ‌స్థానాన్ని కూడా త‌ప్పుదారి ప‌ట్టించార‌నే ఫిర్యాదు చేయ‌వ‌చ్చు. మ‌రి ఈ విష‌యంలో అధినేత చంద్ర‌బాబునాయుడు ఎందుకింత సైలెంట్ అయ్యారు. వాస్త‌వం ఫ‌లానా అంటున్న నేత‌లు.. న్యాయ‌పోరాటం చేయ‌వ‌చ్చుగా అనేది బీజేపీ నేత‌ల వాద‌న‌.

వాస్త‌వానికి.. ఈ రెండూ సున్నిత‌మైన అంశాలే. పైగా 2019లో ఎవ‌రు అధికారంలోకి వ‌స్తార‌నేది చెప్ప‌ట క‌ష్ట‌మే. పైగా ప్ర‌స్తుతం బీజేపీకు వ్య‌తిరేక గాలి వీస్తున్నా.. ప్ర‌త్య‌ర్థి బ‌ల‌మైన వాడు లేక‌పోవ‌టంతో.. మ‌రోసారి ఎన్‌డీఏకే అవ‌కాశాలు ఉన్నాయ‌నేది కూడా మ‌రో సంకేతం. దీంతో ఇప్పుడే కేంద్రంతో తంపీలు పెట్టుకుంటే ఎలా అనే ముందుచూపు కూడా రాష్ట్ర నేత‌ల యోచన కావ‌చ్చు. కానీ.. ఏపీ ప్ర‌జ‌ల‌కు బీజేపీ చెబుతున్న మాట‌లు..కోర్టు ఎదుట ఉంచిన అంశాలు ఇవీ అని చెప్ప‌టం ద్వారా టీడీపీ ఏపీలో సానుభూతి పొంద‌వ‌చ్చు. ఓటు బ్యాంకుగానూ మార్చుకోనూ వ‌చ్చు. అదే చేయ‌క‌పోతే. బీటిజేపీ మాట‌లే నిజ‌మ‌నే భావ‌న పెర‌గ‌వ‌చ్చు. ఈ రెండింటిలో ఏదిజ‌రిగినా.. క‌మ‌లం, సైకిల్ ఇరుకున ప‌డే అవ‌కాశ‌మూ లేక‌పోలేదు. దీన్నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు.. ఎన్నిక‌ల అస్త్రంగా వాడుకునేందుకు టీడీపీ సిద్ధ‌మైన‌ట్లు తెలుస్తోంది. సుప్రీంలో న్యాయ‌పోరాటం చేసేందుకు బీజేపీను దోషిగా నిలిపేందుకు ఉన్న న్యాయ‌మార్గాల‌ను ప‌రిశీలిస్తున్నారు. అదే జ‌రిగితే.. టీడీపీ రేటింగ్ పైపైకి ఎగ‌బాకిన‌ట్లే. పైగా.. జాతీయ రాజ‌కీయాల్లో మ‌రోసారి చంద్ర‌బాబుపేరు మారుమోగుతుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.