టీడీపీ ఎమ్మెల్యే బూతు పురాణం పై రచ్చ

         విజయనగరం జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశంలో గజపతినగరం ఎమ్మెల్యే కేఏ నాయుడు బూతుపురాణం అందుకున్న సంగతి తెలిసిందే. దీని పై సహజంగానే విపక్ష పార్టీలు, మీడియాలో వ్యతిరేక ప్రచారం బాగానే చేశాయి. చేస్తున్నాయి. పార్వతీపురం పంచాయతీ రాజ్‌ ఏఈ సత్యనారాయణమూర్తిని బండ బూతులు తిట్టారు ఎమ్మెల్యే. పంచాయతీరాజ్‌ క్వాలిటీ కంట్రోల్‌ బిల్లులు చెల్లించడం లేదనేది ఆరోపణ. అందుకే గజపతినగరం ఎమ్మెల్యే కేఏ నాయుడు బయటికి రా నీ సంగతి తేలుస్తానంటూ వార్నింగ్‌ ఇచ్చారు. పార్వతీపురం పంచాయతీ రాజ్‌ ఏఈ సత్యనారాయణమూర్తిని బెదిరించడం కలకలం రేపుతోంది. మిగతా వారికి మనం ఆదర్శంగా ఉండాలని ఒక పక్క సిఎం చంద్రబాబునాయుడు చెబుతుంటే..టీడీపీ ఎమ్మెల్యే ఇందుకు విరుద్దంగా వ్యవహరించడం హాట్ టాపికైంది. 
         తాట తీస్తానంటూ ఎమ్మెల్యే అందరి ముందు ఆగ్రహం వ్యక్తంచేయడం వివాదస్పదమైంది. గతంలో చింతమనేని ప్రభాకర్ పై ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. అయినా ఆయనకు విప్ పదవి ఇచ్చి చంద్రబాబు గౌరవించారనే విమర్శలున్నాయి. తెలంగాణలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇలానే బూతు పురాణం అందుకోగా…ఎమ్మెల్యే, నటుడు బాబు మోహన్ అదే పని చేశారు.  
          విజయనగరంలో మంత్రి సుజయకృష్ణరంగారావు, కలెక్టర్‌ వివేక్‌ యాదవ్‌ ముందే ఎమ్మెల్యే ఇలా మాట్లాడినా వారు ఊరుకోవడం మరింత ఆశ్చర్యంగా ఉంది. ప్రజాప్రతినిధి అయిన ఎమ్మెల్యే అందరి ముందు ఇలా మాట్లాడటం ఒక తప్పు అయితే..అది చూస్తున్నా ఏమి అనక పోవడం మరింత చర్చకు దారి తీసింది. ఆ అదికారి తప్పు ఉంటే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేయవచ్చు. లేకపోతే మంత్రికి ఫిర్యాదు చేయవచ్చు. కానీ ఇలా అందరి ముందు పట్టుకుని తిట్టడం ఎమ్మెల్యే సంస్కారాన్ని చెబుతుందంటున్నారు జనాలు. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.