టీడీపీ ఎమ్మెల్యే అందుకే పార్టీ మారుతున్నారట…

నాలుగేళ్లుగా ఒకటే చర్చ. బిసి సంఘం నేత, తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య త్వరలోనే తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పనున్నారనేది సారాంశం. అలా పుకార్లు రావడం. ఆ తర్వాత మర్చి పోవడం మాములు వ్వవహారమైంది. ఇదిగో పులి.. అదిగో పులిలా మారింది ఆయన వ్యవహారం. అంతర్గత చర్చల్లో ఆర్. కృష్ణయ్య మాటలను బట్టే అలాంటి ప్రచారం జరుగుతూ వచ్చింది. ఈసారి నిజం కానుందంటున్నారు. తెలంగాణలో మిగిలిందే ఇద్దరు ఎమ్మెల్యేలు. వారిలో ఒకరు సండ్ర వెంకట వీరయ్య. మరొకరు కృష్ణయ్య. ఇద్దరిలో తనకు శాసనసభ పక్ష పదవి ఇవ్వాలని కోరారు కృష్ణయ్య. ఇందుకు పార్టీ అధినేత, ఏపీ సిఎం చంద్రబాబు నుంచి సానుకూల స్పందన రాలేదు. మొదటి నుంచి ఆయన అసంతృప్తిగానే ఉన్నారు. పార్టీ కంటే తానే ముఖ్యమనే రీతిలో బీసీ నేత వ్యవహరిస్తున్నారు. పలు సంఘాల సమావేశాల్లోను తాను టీడీపీ అనే కంటే బీసీ సంఘం నేతగానే ఉండేందుకు ఇష్ట పడతారు. టీడీపీ కండువాను పక్కన పెట్టి బీసీ కండువాను వేసుకుంటున్నారు. ఇవన్నీ చంద్రబాబుకు నచ్చలేదు. అనేక సార్లు చెప్పి చూసినా ప్రయోజనం లేదు. అందుకే అతన్ని లైట్ తీసుకున్నారంటున్నారు. 
అడపాదడపా అతను తన అసంతృప్తిని వెళ్లగక్కుతూనే ఉన్నాడు. ఈ సారి కచ్చితంగా పార్టీ మారతారనే వాదన వచ్చింది. ఆర్ కృష్ణయ్య గౌరవాధ్యక్షుడిగా ఉన్న ఓ ఉద్యోగ సంఘానికి ఏపీలో అధికారిక గుర్తింపు ఇవ్వలేదు. అలా ఇచ్చేందుకు ప్రభుత్వం నిరాకరించడంతోపాటు.. కృష్మయ్యను ఆ పదవి నుంచి తొలగిస్తేనే గుర్తింపు ఇస్తామని మెలిక పెట్టింది. ఈ సంగతి తెలిసి కృష్ణయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తనను మరింతగా వేధించడం బాగోలేదని కస్సుమంటున్నాడు. బీసీల విషయంలో టీడీపీ అన్యాయం చేస్తుందనేది ఆయన వాదన. వాస్తవంగా చెప్పాలంటే టీడీపీ బీసీలకు పెద్ద పీట వేస్తోంది. టీటీడీ ఛైర్మన్ దగ్గర నుంచి చాలా పోస్టులను బీసీలకు ఇచ్చింది. కానీ అలా చేయడం లేదనేది కృష్ణయ్య వాదన. 
బిసి లాయర్లు జడ్జిలు కాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారనే ఆరోపణలు వచ్చాయి. దానిపై బీసీ నేతలు మండిపడుతున్నారు. మొత్తంగా చంద్రబాబును ఇరుకున పెట్టేందుకు కృష్ణయ్య వేసిన ప్లాన్ రివర్స్ అయిందని.. అందుకే భవిష్యత్ కార్యాచరణ దిశగా కదులుతున్నారని తెలుస్తోంది. పార్టీకి విధేయుడుగా ఉంటే పదవులు అవే వస్తాయి. అలా కాకుండా స్వతంత్రంగా ఉంటే.. ఉన్న పదవి పోతుంది. ఆ సంగతిని ఎమ్మెల్యే గ్రహించాలంటున్నారు వైరి వర్గీయులు. 
 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.