వారిని వణికిస్తున్న పాదయాత్ర ఫొటోలు?

వైఎస్ఆర్ సీపీ అధినేత జగన్ చేపడుతున్న పాదయాత్రకు అనూహ్యమైన స్పందన వస్తున్న విషయం విదితమే! పైగా ఈ కార్యక్రమం సందర్బంగా జగన్ ను చూసేందుకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివస్తున్నారు. దీనిని గమనించి తెలుగు తమ్ముళ్లు జగన్ ఫోబియాలో నుంచి బయటకు రాలేకపోతున్నారనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. దీంతో తమకున్న మీడియా అండతో జగన్ పాదయాత్రను ఎంత తక్కువ చేసి చూపించాలని ప్రయత్నించినా సాధ్యం కావటం లేదని వారు వాపోతున్నారట!. జగన్ ఇమేజ్ కు ఇబ్బంది కలిగించేలా ఎన్ని కుయుక్తులు పన్నినా ఫలితం లేకపోతోందని తెలుస్తోంది. దీనికితోడు జగన్ కు అంతకంతకు ప్రజాభిమానం మాత్రం చెక్కు చెదరడంలేదని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఇది తెలుగు తమ్ముళ్లకు కంటగింపుగా ఉందని విశ్లేషకులు అంటున్నారు. 
దీంతో వారు జగన్ పాదయాత్ర ఫోటోలు ప్రచురించేటప్పుడు జన సందోహం పెద్దగా లేని రీతిలో ఫోటోలు వేయాలని కనిపించిన మీడియా సోదరులకు చెబుతున్నారని భోగట్టా! దీనికితోడు తమ అంతర్గత సంభాషణల్లో కూడా జగన్ పాదయాత్ర మైలేజీ గురించే మాట్లాడుకుంటున్నారట!. జగన్ ఖ్యాతిని ఎంతగా డ్యామేజ్ చేయాలనుకుంటే, అంతకు రెట్టింపుగా ఆయన ఇమేజ్ పెరుగుతోందనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ మధ్య కాపుల రిజర్వేషన్ల మీద జగన్ ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడారు, ఆ తరువాత దానిపై వివరణ ఇచ్చి బయటపడిన విషయం విదితమే! దీనికితోడు కాపులు ఎక్కువగా ఉండే గోదావరి జిల్లాల్లో జగన్ పాదయాత్రకు జనసందోహం పోటెత్తడం కూడా వారు జీర్ణించుకోలేకపోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.  గోదావరి జిల్లాల్లో పర్యటిస్తూ కాపుల రిజర్వేషన్ల మీద జగన్ చేసిన వ్యాఖ్యలు సాహసోపేతమైనవని విశ్లేషకులు అంటున్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండేలా వ్యవహరించే విపక్ష నేత తీరు టీడీపీ నేతలను ఆలోచనలో పడేస్తోందని భోగట్టా! 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.