ఏపీలో ప‌సుపు నేతల‌కు ఏమైందీ!

నిండుస‌భ‌లో ద్రౌప‌ది ఏ విధంగా దుర్యోధ‌నుడిని అవమానించిందో తెలియ‌దు కానీ.. అంత‌కు మించిన విమ‌ర్శ‌ల‌తో టీడీపీ ఎంపీ జేసీ దివాక‌ర్‌రెడ్డి టీడీపీపై విమ‌ర్శ‌ల జోరు పెంచారు. తాను కూడా టీడీపీలోనే ఉన్నాన‌నే స్పృహమర‌చిమ‌రీ.. ఇంత‌గా నోటికి ప‌నిచెప్ప‌టం.. పార్టీ శ్రేణుల‌కే కాదు.. అధినేత చంద్ర‌బాబునాయుడును కూడా ఇరుకున పెడుతుంది. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ బ‌లం పుంజుకుంటుంద‌నే ఉద్దేశంతో జేసీ బ్ర‌ద‌ర్స్‌కు ప‌సుపు కండువాలు క‌ప్పారు. కానీ.. పార్టీలోకి చేరి గెలిచిన నాటి నుంచి ఏదో ఒక అంశంలో జేసీ దివాక‌ర్‌రెడ్డి నోరు జారుతూనే ఉన్నాడు. పైగా చంద్ర‌బాబు నాయ‌క‌త్వాన్ని కించ‌ప‌రిచేలా స్పందిస్తున్నాడు. ఈ మ‌ధ్య‌నే ఎన్‌డీఏ స‌ర్కారుపై అవిశ్వాసం పెడ‌తామంటూ టీడీపీ ఆదేశిస్తే.. నేను ఢిల్లీ రానంటూ మంకుప‌ట్టుప‌ట్టాడు. చివ‌ర‌కు నియోజ‌క‌వ‌ర్గానికి నిధులు ఓకే చేస్తూ ప్ర‌భుత్వం జీవో జారీచేస్తే గానీ.. ఢిల్లీ వెళ్ల‌లేదు. బీజేపీ ఉన్నంత‌కాలం ఏపీకు హోదా రాద‌ని.. ఎన్ని ఉద్య‌మాలు చేసినా వేస్ట్ అంటూ ఆనాడే సెల‌విచ్చారు. ఇప్పుడు.. టీడీపీ ప్ర‌తిష్ఠాత్మ‌కంగా క‌ర్నూలులో త‌ల‌పెట్టిన ధ‌ర్మపోరాట దీక్ష స‌భలో చంద్ర‌బాబు చేప‌ట్టిన పోరాటాలు వృధా అంటూ కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. దున్న‌పోతుమీద వాన‌ప‌డ్డ‌ట్టుగా ఎన్నిదీక్ష‌లు చేసినా కేంద్రం స్పందించ‌ద‌న్నారు.
చంద్ర‌బాబు త‌న‌కు ప‌ద‌వులు ఇచ్చినా.. ఇవ్వ‌క‌పోయినా.. ఇదే త‌న అభిప్రాయ‌మంటూ తెగేసిన‌ట్లు  వివ‌రించారు. త‌మ్ముళ్ల వ‌రుస‌.. ఒక‌ర్ని మించి ఒక‌రు చేస్తున్న కామంట్స్ పార్టీను ఇబ్బంది పెడ‌తాయంటూ.. అధినేత చెబుతున్నానేత‌ల చెవికి ఎక్కించుకోవ‌ట్లేదు. పైగా.. చంద్ర‌బాబు మాట‌ల‌తో త‌మ‌కు ప‌నిలేద‌న్నంత‌గా బ‌రితెగిస్తున్నారా! అనే అనుమానం కూడా పార్టీ శ్రేణుల్లో మొద‌లైంది. ఇదంతా వైసీపీ వ్యూహంలో చిక్కి నేత‌లు మాట్లాడుతున్నారంటూ స్వ‌యంగా చంద్ర‌బాబు ఆందోళ‌న వెలిబుచ్చారు. మ‌రి.. ఇప్ప‌టికైనా.. త‌ప్పులు స‌రిదిద్దుకోలేక‌పోతే.. జ‌ర‌గ‌బోయే అన‌ర్ధాల‌కు పార్టీ ఇబ్బందులు ప‌డాల్సి వ‌స్తుంద‌నే ఆందోళ‌న‌కూడా నేత‌ల్లో మొద‌లైంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.