కృష్ణా టీడీపీలో ముస‌లం?

ఎన్టీఆర్ పుట్టిన కృష్ణాజిల్లా గ‌డ్డ‌పై టీడీపీలో అయోమ‌యం నెల‌కొంది. సొంత‌గూటిలో ఇమ‌డ‌లేక బ‌య‌ట‌కు వెళ్లేందుకు సీనియ‌ర్ నేత‌లు మార్గాలు వెతుక్కుంటున్నారు. మ‌రికొద్ది రోజుల్లో కృష్ణా ప్ర‌జాసంక‌ల్ప యాత్ర‌కు వ‌చ్చే జ‌గన్ స‌మ‌క్షంలో వైసీపీ కండువా క‌ప్పుకునేందుకు చాలామంది నేత‌లు సిద్ధంగా ఉన్న‌ట్లు పుకార్లు వ‌స్తున్నాయి. ఇదంతా రాజ‌కీయ ఎత్తుగ‌డ‌లో భాగం అనుకునేందుకు అవ‌కాశం లేదు. ఎందుకంటే దేశం పార్టీ అనుకూల మీడియాలోనే ఈ లీకులన్నీ బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. విజ‌య‌వాడ‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే య‌ల‌మంచ‌లి ర‌వి గ‌తంలో ప్ర‌జారాజ్యం పార్టీలో గెలిచి.. కాంగ్రెస్ లోకి చేరారు. అనంత‌రం ఓడాక‌. ప‌సుపు కండువా క‌ప్పుకున్నారు. ఇప్పుడేమో.. వైసీపీలోకి చేరాల‌నే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. ఆ త‌రువాత టీడీపీ పెద్ద‌ల జోక్యంతో అదంతా స‌ద్దుమణిగిన‌ట్లు స‌మాచారం. అయితే లోలోప‌ల మాత్రం.. త‌న‌కు జ‌రిగిన అవ‌మానాన్ని జీర్ణించుకోలేక‌పోతున్నారంటూ ఆయన అనుచ‌రులు చెబుతున్నార‌ట‌.  మాజీ హోంమంత్రి వ‌సంత నాగేశ్వ‌ర‌రావు కూడా పార్టీల‌న్నీ మారి చివ‌ర‌కు టీడీపీ పంచ‌న చేరారు. ఆయ‌న కుమారుడు వ‌సంత కృష్ణ‌ప్ర‌సాద్‌.. ముద్దుగా అభిమానులు పిలుచుకునే కేపీ కూడా వైసీపీ కండువా క‌ప్పుకోవాల‌ని ఆశ‌ప‌డుతున్న‌ట్లు స‌మాచారం. గ‌తంలో వైసీపీ నుంచి బయ‌ట‌కు వ‌చ్చారు. గ‌తంలో నందిగామ నియోజ‌క‌వ‌ర్గంలో రెండుసార్లు కాంగ్రెస్ త‌ర‌పున పోటీచేసి దేవినేని ఉమా చేతిలో ఓడారు. అప్ప‌టి నుంచి కేపీలో దేవినేనిపై గెల‌వాల‌నే ఆశ  మిగిలింది. అందుకే ఈ సారి మైల‌వ‌రం నుంచి బ‌రిలోకి దిగి దేవినేనిపై గెలిచితీరాలనే ప్లాన్‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. రెండుసార్లు గెలిచినా.. శ్రీరాం తాత‌య్య కు మంత్రి ప‌ద‌వి ద‌క్క‌క‌పోవ‌టం పై వైశ్య‌వ‌ర్గం కూడా ఆవేద‌న చెందుతున్న‌ట్లు స‌మాచారం. పైగా.. తాత‌య్య గెలిచిన జ‌గ్గ‌య్య‌పేట నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ధి ప‌నుల‌కు నిధుల ఇవ్వ‌ట్లేద‌నే ఆందోళ‌న కూడా ఉంది. కంకిపాడులో దేవినేని నెహ్రు త‌న‌యుడు అవినాష్‌కు అవ‌కాశం క‌ల్పించ‌టం ద్వారా త‌మ‌ను ప‌క్కన పెడ‌తార‌నే మ‌రో వ‌ర్గం ఆవేద‌న‌. బోండా ఉమా పై వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌తో అక్క‌డ ఆయ‌న‌కు సీటు కేటాయించ‌వ‌ద్దంటూ అక్క‌డి మ‌రో వ‌ర్గం అధిష్ఠానంతో మంత‌నాలు సాగిస్తుందట‌. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌వాడ ఎంపీగా కేశినేని నాని స్థానంలో నారా బ్రాహ్మ‌ణి లేదా బాల‌కృష్ణ పోటీ ప‌డితే ఎలా అనేది కూడా మ‌రో చ‌ర్చ‌. దీనంత‌టికీ మంత్రి దేవినేన ఉమా కార‌ణ‌మ‌నే విమ‌ర్శ‌లు కూడా అంత‌ర్గ‌తంగా పెల్లుబుకుతున్నాయి. త‌న‌కు పోటీగా మ‌రో నేత ఎద‌గ‌కూడ‌ద‌నే ఉద్దేశంతోనే పావులు క‌దుపుతున్నార‌నేది తెలుగు త‌మ్ముళ్ల‌లో ఓ వ‌ర్గం ఆరోప‌ణ‌. ఈ విష‌యాలన్నీ దాదాపు.. చంద్ర‌బాబు వ‌ర‌కూ వెళ్ల‌టంతో అయోమ‌యానికి చెక్ పెట్టేందుకు ఆయ‌న స్వ‌యంగా రంగంలోకి దిగార‌ట‌. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.