టీడీపీ ఆశ‌ల‌న్నీ ఎన్‌టీఆర్ బ‌యోపిక్ పైనే!

దారుల‌న్నీ మూసుకుపోయిన‌పుడు.. కొత్త మార్గం ఆస‌రాతో విజ‌యానికి చేరువ‌వ‌టం.. విప‌త్క‌ర స‌మ‌యంలోనూ త‌డ‌బాడు లేకుండా నెగ్గ‌టం.. రాజ‌కీయ చాణ‌క్యుడుగా పేరున్న చంద్ర‌బాబునాయుడుకు వెన్న‌తోపెట్టిన విద్య‌. దీన్ని విప‌క్షాలు మోస‌కారి అంటూ విమ‌ర్శించినా పార్టీ వ‌ర‌కూ అది స‌రైన‌దే. అయితే.. 2019లో అన్ని పార్టీల‌కూ ప్ర‌చార అస్త్రం లేకుండా పోయింది. గ‌త ఎన్నిక‌ల్లో ఏపీ రాజ‌ధాని కొత్త‌రాష్ట్రం అనే ఎత్తుగ‌డ టీడీపీకు క‌లచివ‌చ్చింది. తెలంగాణ‌లోనూ సెంటిమెంట్ పండింది. మ‌రి ఈ సారి.. ఏమ‌ని జ‌నంలోకి వెళ్లాలి. ఎందుకంటే.. ఎన్నిక‌ల హామీల‌న్నీ అలాగే ఉన్నాయి. కీల‌క‌మైన వ‌ర్గాల‌న్నీ గుర్రుగా ఉన్నాయి. న‌ల‌భైమందికి పైగా ఎమ్మెల్యేలు గెలిచే ప‌రిస్థితుల్లో లేరు. ఇటువంటి వేళ‌.. టీడీపీ ఊపిరి పీల్చుకోవాలంటే ఏదోఒక మిరాకిల్ జ‌ర‌గాలి. అదే.. ఎన్‌టీఆర్ జీవిత‌చ‌రిత్ర‌. స్వయంగా బాల‌య్య‌బాబు ఎన్‌టీఆర్ పాత్ర‌లో మెరిపించ‌నున్నారు.

అయితే.. అది మొద‌ట్లో తేజ ద‌ర్శ‌కుడిగా అనుకున్నా అవాంత‌రాలతో క్రిష్ ద‌ర్శ‌క బాధ్య‌త‌లు చేప‌ట్టారు. తాజాగా షూటింగ్ కూడా మొద‌లుపెట్టారు. దీనిలో ఎన్‌టీఆర్ సీఎం కావ‌టం నుంచి మ‌ర‌ణించేవ‌ర‌కూ సినిమా ఉంటుందా! అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే.. అది టీడీపీకే ఇబ్బంది కావ‌చ్చు. ముఖ్యంగా చంద్ర‌బాబు ఇమేజ్‌ను దెబ్బ‌తీయ‌నూ వ‌చ్చు. కానీ.. ఎన్‌టీఆర్ నిమ్మ‌కూరు నుంచి మ‌ద్రాసు వెళ్లి టీడీపీ పార్టీ వ్య‌వ‌స్థాప‌న వ‌ర‌కూ.. ఆ పై సీఎం.. నాదెండ్ల తిరుగుబాటు.. తిరిగి సీఎం కావ‌టం వ‌ర‌కూ మాత్ర‌మే సినిమాలో చూపుతార‌నే వాద‌న వినిపిస్తుంది. ఎందుకంటే.. బాల‌య్య కూడా ఓ సారి.. ఎంత వ‌ర‌కూ ఉంచాలో అంత‌వ‌ర‌కే నంటూ కామెంట్స్ చేశారు. ఈ లెక్క‌న అన్న‌గారి.. పాజిటివ్ జీవితాన్ని స్పూర్తిగా చూపుతూనే.. నాటి రాజ‌కీయ‌, సామాజిక ప‌రిస్థితుల‌తో ప్ర‌జ‌ల్లో బావోద్వేగాన్ని రేకెత్తిస్తారు. త‌ద్వారా.. మ‌ళ్లీ టీడీపీయే రామ‌రాజ్య స్థాప‌న‌కు కావాల‌నే నిర్ణ‌యానికి వ‌స్తార‌నేది తెలుగుత‌మ్ముళ్ల న‌మ్మ‌కం. మ‌రి.. ఈ లెక్క‌న‌.. యాత్ర పేరుతో వైసీపీ అధినేత జ‌గ‌న్ కూడా త‌న తండ్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి జీవిత‌చ‌రిత్ర‌ను తెర‌కెక్కిస్తున్నారు. ఈ రెండు ఒకేసారి వ‌స్తాయా! వేర్వేరుగా అనేది ఇప్ప‌టికీ సస్పెన్స్‌. ఎందుకంటే.. ఇద్ద‌రికీ జ‌నాల్లో బ‌ల‌మైన మ‌ద్ద‌తు ఉండ‌ట‌మే దీనికి కార‌ణం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.