బాబుకు త‌ల‌నొప్పిగా గుంటూరు త‌మ్ముళ్లు!

టీడీపీ బ‌లోపేతానికి.. బ‌ల‌హీన‌త‌కు.. ఆ రెండు జిల్లాలు కీల‌కం. రాజ‌కీయంగా.. సామాజికంగా కూడా అక్క‌డి నేత‌లు పార్టీలు ప‌డ‌గొట్ట‌గ‌ల‌రు. నిల‌బెట్ట‌నూ గ‌ల‌రు. ఇప్ప‌టికే కృష్ణాజిల్లాలో మంత్రి దేవినేని, ఎంపీ కేశినేని, ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేనితో చికాకులు త‌ప్ప‌ట్లేదు. విజ‌య‌వాడ కార్పొరేష‌న్ మేయ‌ర్ కోనేరు శ్రీధ‌ర్ ఏకంగా చంద్ర‌బాబుకు ఇబ్బందిక‌రంగా మారాడు. వీరి మ‌ధ్య‌ స‌యోధ్య కుద‌ర్చ‌ట‌మే అధినేత‌కు పెద్ద ప్ర‌శ్న‌గా త‌యారైంది. ఈ నేప‌థ్యంలోనే గుంటూరు తెలుగు త‌మ్ముళ్లు కూడా చేరారు. పైగా.. పార్టీకు ప‌ట్టున్న ప‌ల్నాడులో ఇటువంటి ప‌రిస్థితులు చోటు చేసుకోవ‌టం.. దానికి కీల‌క‌మైన ఎమ్మెల్యేలు కార‌ణం కావ‌టం.. పార్టీను క‌ల‌వ‌ర‌పాటుకు గురిచేస్తోంది. గుర‌జాల ఎమ్మెల్యే య‌ర‌ప‌తినేని శ్రీనివాస‌రావు శైలి.. పార్టీను ఇర‌కాటంలో నెట్టేసింది. ఇప్ప‌టికే గుర‌జాల‌, మాచ‌ర్ల‌, దాచేప‌ల్లి త‌దిత‌ర ప్రాంతాల్లో అక్ర‌మ‌మైనింగ్‌పై హైకోర్టు చీవాట్లు పెట్టింది. పైగా ఈ వ్య‌వ‌హారంలో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న అదికార పార్టీ ఎమ్మెల్యే య‌ర‌ప‌తినేనిపై విచార‌ణ చేసి నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. దీన్ని అవ‌కాశంగా మ‌ల‌చుకున్న వైసీపీ.. అక్క‌డ ప‌ట్టు సాధించేంద‌కు సిద్ధ‌మైంది. దీన్నుంచి టీడీపీ బ‌య‌ట‌ప‌డేందుకు య‌ర‌ప‌తినేని అమాయ‌కుల‌ను కేసుల్లో ఇరికించారంటూ ఆరోపిస్తున్నారు. వైసీపీ నేత‌లు కూడా ప‌ల్నాడు బ‌య‌ల్దేర‌టంతో.. అక్క‌డ 144 సెక్ష‌న్స్ అమ‌ల్లోకి తెచ్చారు. వాస్త‌వానికి య‌ర‌ప‌తినేని టీడీపీ బ‌లం. ప‌ల్నాడులో నిల‌బ‌డి.. కేడ‌ర్‌ను బ‌తికిస్తున్నాడంటే ఆయ‌నే.
కానీ.. అదేస‌మ‌యంలో అవినీతి ఆరోప‌ణ‌లు, అధికారుల‌పై పెత్త‌నం చెలాయిస్తున్నాడంటూ చెడ్డ‌పేరు కూడా తెచ్చుకున్నారు. మంత్రిగా వున్న రావెల మూడేళ్ల కింద‌టే.. కార్య‌క‌ర్త‌ల‌ను అవ‌హేళ‌న‌కు గురిచేస్తూ గ్రూపు రాజ‌కీయాల‌కు తెర‌లేపారు. రాయ‌పాటి సాంబ‌శివ‌రావు అయితే… వీలు చిక్కిన‌ప్పుడ్లా పార్టీ అధినేత‌పై సైటెర్లు వేస్తూనే ఉన్నారు. పైగా.. టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌తో స‌యోధ్య‌గా మెల‌గ‌ట్లేద‌నే అప‌వాదు మూట‌గ‌ట్ట‌కున్నారు. గుంటూరు ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి తాను పేరుకే ఎమ్మెల్యేనంటూ వాపోతున్నారు. పైగా అభివృద్ధి కూడా చేయ‌లేక‌పో్తున్నానంటూ బ‌హిరంగంగానే చెబుతున్నారు. స‌భాప‌తి కోడేల శివ‌ప్ర‌సాద్ వారసులు.. అన్నింటా వాటా అడుగుతూ.. అటు అధికారుల‌ను.. ఇటు సామాన్యుల‌కు చుక్క‌లు చూపుతున్నారంటూ ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు. అగ్రిగోల్డ్ వ్వ‌వ‌హారంలో మంత్రి ప్ర‌త్తిపాటి పుల్లారావు కుటుంబం కూడా ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్న‌ది తెలిసిందే.  ఇప్ప‌టికే గుంటూరుజిల్లాలో అధికార పార్టీ నేత‌ల్లో డెల్టా, ప‌ల్నాడు నేత‌ల మ‌ధ్య స‌ఖ్య‌త లేద‌నేది తెలుగు త‌మ్ముళ్ల ఆవేద‌న‌. అటువంటిది.. ఇప్పుడు ఏకంగా.. అవినీతి ఆరోప‌ణ‌ల‌తో పార్టీను ఇంకెత ఇబ్బంది పెడ‌తారనేది.. సీనియ‌ర్ల ఆవేద‌న‌. ఎన్నిక‌ల ముందు ఇటువంటి ఇబ్బందులు.. విమ‌ర్శ‌ల‌కు ధీటుగా.. అధికార పార్టీ స్పందించినా.. ప్ర‌జ‌ల్లో నాటుకుపోయిన వ్య‌తిరేక‌తకు స‌మాధానం. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.