అలా జ‌రిగితే.. టీడీపీ గ‌ట్టెక్కిన‌ట్టే!

ఇలా జ‌రిగితే.. తెలుగుదేశం పార్టీకు ల‌క్ చిక్కిన‌ట్టే.  2019లో టీడీపీ నాయ‌కుల‌ను ఎవ‌ర్ని పోటీలో నిలిచినా సునాయాసంగా గెలుస్తారు. ఎన్నిక‌ల‌కు మ‌రో ఏడాది వ‌ర‌కూ స‌మ‌యం వున్నా.. కేంద్రంలో ఎన్‌డీఏ అంత‌వ‌ర‌కూ ఆగేలా లేదు. పైగా ఇప్పుడున్న వేడిలోనే ఎన్నిక‌లు జ‌రిపితే  ప‌రువు నిలుస్తుంద‌నే ఆశ‌గా చూస్తుంది. బీజేపీ నేత సుబ్ర‌మ‌ణ్యం అన్న‌ట్టుగానే బీజేపీ ఎమోష‌న‌ల్ రాజ‌కీయాన్ని అవ‌కాశంగా మ‌లచుకుని మ‌రోసారి పీఎం పీఠంపై మోదీను ఉంచాల‌ని తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తోంది.

అవ‌న్నీ ప‌క్క‌న‌బెడితే ఏపీలో రాజ‌కీయం వేడెక్కుతుంది. చంద్ర‌బాబునాయుడు త‌న‌ను తాను ప్రొటెక్టు  చేసుకునేందుకు ప్ర‌తిసారీ బీజేపీను నిందించాల్సిన దుస్థితికి వచ్చార‌నేందుకు నిద‌ర్శ‌నం. రాజకీయాల్లో ఇవ‌న్నీ సాధార‌ణ‌మ‌ని తెలిసినా విప‌క్షాలు త‌మ అస్త్రంగా ఆ బ‌ల‌హీన‌త‌నే వాడుకుంటున్నాయి. ప‌దేళ్ల‌పాటు విప‌క్షంలో ఉన్న చంద్ర‌బాబుకు ఆ ప‌రిస్థితులు ఎలా ఉంటాయ‌నేది తెలుసు. అందుకే.. 2014లో ఎన్ని భ‌రించారు.. ఇంకెన్ని స‌హించార‌నేది.. కొద్దిమందికే తెలిసిన స‌త్యం. అందుకే 2019లో మ‌రోసారి అటువంటి ప‌రిస్థితి రాకూడ‌ద‌నే ఈ తాప‌త్ర‌యం. కానీ త‌మ్ముళ్ల‌కు మాత్రం ఇది అర్ధంకాద‌నేది.. నియోజ‌క‌వ‌ర్గాల్లో సాగిస్తున్న చ‌ర్య‌లు నిద‌ర్శ‌నం. కానీ.. ఇన్ని ప‌రిస్థితుల్లో ఒకే ఒక్క ఆశ టీడీపీ అధికార పీఠానికి ఆశ‌లు రేకెత్తిస్తోంది. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ 175 నియోజ‌కవ‌ర్గాల్లో పోటీకు సై అన్నారు. ఇప్ప‌టికే ఉత్త‌రాంధ్ర‌, గోదావ‌రిల్లో కేడ‌ర్ ను బ‌లోపేతం  చేస్తున్నారు. కోస్తాలో పాగా వేసేందుకు ఉన్న అవ‌కాశాలు క‌లిసి వ‌స్తాయ‌నే భావిస్తున్నారు.

ఇక అధికార పార్టీ, ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త ఎలాగూ ఉండ‌నే ఉంటుంది. ఇక‌పోతే.. బీజేపీ అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మినారాయ‌ణ త‌న‌కు క‌మ‌లం పంచిన అవ‌కాశం స‌ద్వినియోగం  చేసుకోవాల‌నే భావిస్తున్నారు. ఆల్రెడీ జిల్లా ప‌ర్య‌ట‌న‌ల‌తో హ‌ల్‌చ‌ల్  చేస్తున్నారు. ఒక‌వేళ బీజేపీ చివ‌రి నిమిషంలో సీబీఐ మాజీ అధికారి ల‌క్ష్మినారాయ‌ణ‌ను సీఎం అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించి ఓట్లు దండుకునే ప్ర‌య‌త్నాలు  చేయ‌నూ వచ్చు. మ‌రోవైపు కాంగ్రెస్ కూడా సినీగ్లామ‌ర్‌తో మెగాస్టార్‌ను హ‌స్తం త‌ర‌పు సీఎం కేండిడేట్‌గా ఫిక్స్ చేయ‌వ‌చ్చ‌నే ఊహాగానాలున్నాయి. యాదృచ్ఛికంగా కావచ్చు.. పార్టీల ఎత్తుగ‌డ కావచ్చు. ప‌వ‌న్‌, చిరు, క‌న్నా, సీబీఐ మాజీ అధికారి ల‌క్ష్మినారాయ‌ణ న‌లుగురూ కాపు సామాజిక‌వ‌ర్గానికి చెందిన వారే. ఈ లెక్క‌న వారి మ‌ధ్య ర‌స‌వ‌త్త‌ర‌మైన పోటీ.. ఓట్ల‌ను చీల్చితే. ఆల్రెడీ త‌మ ఓటుబ్యాంకు ద్వారా టీడీపీ గెలుపు సునాయాసం. అయితే… ఇవ‌న్నీ జ‌రిగిన‌పుడు.. చంద్ర‌బాబు వెంట‌.. తెలుగు త‌మ్ముళ్లు బుద్దిగా న‌డచి వచ్చిన‌పుడే సుమా!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.