వైకాపాలోకి వెళ్లనంటున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే

కృష్ణా జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి టీడీపీ నేతల తీరుతో అసంతృప్తిగా ఉన్నారు. ఈ సంగతి తెలిసిన వైకాపా నేతలు ఆయనకు గాలం వేశారు. కృష్ణా జిల్లాలో జగన్ పాదయాత్ర చేసేటప్పుడు ఆయన పార్టీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నారు. చర్చలు పూర్తయ్యాయి. ఇక చేరడమే ఆలస్యం. అనుచరులతోను చాలా దఫాలు చర్చలు జరిపారు రవి. కమ్మ సామాజిక వర్గానికి చెందిన రవి పార్టీ మారే ఆలోచన చేయడాన్ని సీరియస్ గా తీసుకుంది టీడీపీ. అందుకే పలువురు నేతలను రంగంలోకి దింపింది. కేశినేని నాని ఇందులో ప్రధాన భూమిక పోషించారు. యలమంచిలి రవి అసమ్మతికి కారణం తెలుసుకున్నాడు. ఆయనకు ఏం కావాలో తెలుసుకుని అధినేతకు చేరవేశాడు. 
మరోవైపు అనేక హామీలు ఆయనకు లభించాయి. ఫలితంగా రవి మెత్తబడ్డారు. టీడీపీకి కావాల్సింది అదే. యలమంచిలి రవితో చర్చలు జరిపిన ఎంపీ కేశినేని ఆ తర్వాత రవిని నేరుగా సీఎం చంద్రబాబు దగ్గరకు తీసుకెళ్లారు. రెండు గంటలు పాటు బాబు సమక్షంలోనే ఆయనను బుజ్జగించారు. చంద్రబాబు తన ఇబ్బందులు తెలుసుకుని వాటిని తీరుస్తానని హామీ ఇచ్చారు. ఫలితంగా వైసీపీలోకి వెళ్లే ఆలోచనను విరమించుకున్నారు యలమంచిలి రవి. దీంతో వైసీపీ వర్గాలకు ఊహించని షాక్ తగిలింది. యలమంచిలి రవి వైసీపీలో చేరితే తాము ప్రచారం చేసుకునేందుకు బాగా ఉపయోగపడుతుందని నమ్మింది. కమ్మ సామాజికవర్గంలోని మరికొందరు నాయకులు వైసీపీ వైపు వస్తారని భావించారు. కానీ రవిని టీడీపీ బుజ్జగించి సైలెంట్ చేయడంలో సక్సెస్ అయింది. వాస్తవంగా టీడీపీకి వ్యతిరేకంగా ఉన్నారు రవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎన్నికల నాటికి ఎలా మారుతుందో చెప్పలేం. అయినా సరే వైకాపా నేతలు తమ ప్రయత్నాలను వదిలిపెట్టలేదు. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.