హరికృష్ణ మరణంతో టీడీపీలో కొత్త భయం

తెలుగుదేశం పార్టీకి రోడ్డు ప్రమాదాల భయం పట్టుకుందట. ఆ పార్టీ నేతలు మాట్లాడుతున్న దాన్ని బట్టి ఈ విషయం స్పష్టమవుతోందనే ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం ఆ పార్టీ ముఖ్య నేతలను కోల్పోతుండడమే. తాజాగా నందమూరి హరికృష్ణ కూడా రోడ్డు ప్రమాదంలోనే మృతి చెందడంతో ఈ విషయం తెరపైకి వచ్చింది. రోడ్డు ప్రమాదాల కారణంగా ఎంతో మంది నేతలను కోల్పోయింది ఆ పార్టీ. ఇందులో లాల్‌జాన్ భాషా, ఎర్రన్నాయుడు, హరికృష్ణ వంటి ముగ్గురు కీలక నేతలు కూడా ఉన్నారు. వీరంతా రోడ్డు ప్రమాదాల్లోనే మరణించడం ఆ పార్టీ శ్రేణులను భయాందోళనలకు గురి చేస్తోంది. పార్టీ కోసం పని చేస్తున్న నేతలకు ఈ విషయం జీర్ణించుకోడానికి కష్టంగా మారింది.

తాజాగా ఈరోజు ఉదయం నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ మరణించిన విషయం తెలిసిందే. నెల్లూరు నుంచి హైదరాబాద్‌ వస్తుండగా అన్నేపర్తి దగ్గర డివైడర్‌ను ఢికొట్టిన కారు పల్టీలు కొడుతూ రోడ్డు పక్కకు పడిపోయింది. దీంతో కారులోంచి బయటకు పడిపోయిన హరికృష్ణకు తలకు, శరీరానికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదం జరిగిన కొద్దిసేపటికి హరికృష్ణను స్థానికులు నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మరణించారు.

2014 ఎన్నికలకు ముందు విశాఖపట్టణం నుండి శ్రీకాకుళం జిల్లాకు కారులో టీడీపీ నేతలతో కలిసి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మాజీ ఎంపీ టీడీపీ సీనియర్ నేత ఎర్రన్నాయుడు మృతి చెందాడు. రోడ్డు ప్రమాదానికి గురైన తర్వాత ఎర్రన్నాయుడు ఆసుపత్రికి తరలించినప్పటికీ ఆసుపత్రిలోనే ఆయన మృత్యువాతపడ్డారు. అలాగే మరో సీనియర్ నేత విజయవాడలో టీడీపీ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైద్రాబాద్ నుండి వెళ్తున్న సమయంలో రోడ్డు ప్రమాదానికి గురై మరణించాడు. లాల్‌జాన్ భాషా కారు కూడ నార్కట్ పల్లిలోని కామినేని ఆసుపత్రి సమీపంలోనే రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదాలు టీడీపీలో కొత్త భయాన్ని క్రియేట్ చేస్తున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.