స్పీకర్ ను తప్పు పట్టిన టీడీపీ

తెలుగుదేశం పార్టీ స్పీకర్ పాత్ర గురించి ప్రస్తావించింది. ఆశ్చర్యమే. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకపోతే ఒక్క మాట మాట్లాడలేదు ఏపీ టీడీపీ నేతలు. కానీ నేడు పార్లమెంటులో స్పీకర్ నిర్వహించే పాత్రపై అనుమానం వ్యక్తం చేశారు వాళ్లు. తెలంగాణలో టీడీపీ నేతలను సంతలో పశువుల్లా కొనుగోలు చేశారని టీడీపీ చెబుతోంది. అదే ఏపీకి వచ్చేసరికి ఇందుకు విరుద్దంగా మాట్లాడుతోంది. ఇక్కడేం కొనుగోలు. అక్కడేమో అభివృద్ధికి అనుకూలంగా వచ్చారంటోంది. నేను అమ్ముడుపోయాను. తప్పుచేశాను అని ఏకంగా కర్నూలు జిల్లా కోడుమారు ఎమ్మెల్యే మణిగాంధీ స్వయంగా చెప్పారు. బద్వేలు ఎమ్మెల్యే జయరాముడు అదే అంశాన్ని ప్రస్తావించారు. ఇందుకు తగిన ఆడియో, వీడియోలు తమ వద్ద ఉన్నాయని వైకాపా ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. 
ఇన్నాళ్లు ఆ సంగతిపై బుకాయిస్తున్న టీడీపీ పార్లమెంటులో ఇరకాటంలోపడింది. టిడిపి ఎంపీ అవంతి శ్రీనివాస్ స్పీకర్ పార్లమెంటు మొత్తానికి నాయకత్వం వహించాలని కోరారు. ఒక పార్టీకో, ప్రభుత్వానికో స్పీకర్ పరిమితం కారాదని సూచించారు. లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఆర్థిక బిల్లుకు ప్రతిపాదించిన సవరణపై ఓటింగ్‌ పెట్టాలని తాము అడిగినా స్పీకర్‌ పట్టించుకోలేదని ఆయన అన్నారు. తమ మాటలు వినకుండానే బిల్లును ఆమోదించారని ఆందోళన వ్యక్తం చేశారు. సభలో మెజారిటీ ఉండి కూడా అధికార పార్టీ ఓటింగ్‌కు ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. ఏపీలో, తెలంగాణలో ఇదే తీరులో జరుగుతున్న సంగతి కనీసం అవంతి శ్రీనివాస్ కు తెలియదా? వైకాపా విప్ జారీ చేసి, అవిశ్వాస తీర్మానంపై ఓటు పెట్టమంటే స్పీకర్ కోడెల శిప్రసాదరావు పక్కన పెట్టారు. పార్టీ ఫిరాయించిన నేతలను మంత్రులుగా చేసిన నోరు మెదపలేని పరిస్థితి. అలాంటి సంగతి అవంతికి తెలియలేదనే వాదనుంది. పార్లమెంటు అయినా, అసెంబ్లీలు అయినా స్పీకర్ లు స్వతంత్రంగా ఉండకపోవడం వల్ల వ్యవస్థకే చెడ్డపేరు వస్తోంది. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.