ధర్మపోరాటం సభ సక్సెస్, జోష్ లో టీడీపీ

తిరుపతి ధర్మ పోరాట సభ సక్సెస్ అయింది. ఎన్నడూ లేనంతగా జనం ఈ సభకు తరలి వచ్చారు. టీడీపీ నేతలు ఎవరికి వారే జనాలను తరలించడం ఒక ఎత్తయితే.. మరోవైపు స్వచ్చంధంగానే ప్రజలు సభకు వచ్చారు. ఫలితంగా టీడీపీ శ్రేణులు ఉత్సాహంలో ఉన్నాయి. ధర్మపోరాట సభలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ గతంలో చెప్పిన మాటలను గుర్తు చేశారు సిఎం చంద్రబాబునాయుడు. తిరుపతిలోనే కాదు.. నెల్లూరు సభలో, అమరావతి రాజధాని శంఖుస్థాపన సభలోను మోడీ ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలను నెరవేరుస్తానని హామీనిచ్చారు. వాటి వీడియో క్లిప్పింగ్ లను చూపించారు బాబు. ఆ హామీలను అమలు చేయాలని ఆకాంక్షించారు చంద్రబాబు. దాదాపు టీడీపీ కీలక నేతలంతా ఈ సభకు వచ్చారు. ప్రధానిని ఆ వెంకటేశుడే మేల్కొలపాలి అన్నారు చంద్రబాబు. “నా సాక్షిగా మాటిచ్చారు. దాన్ని నెరవేర్చండి” అని మోడీ ఆ వెంకన్న గుర్తు చేయాలన్నారు. ఈ ధర్మపోరాట సభ సాక్షిగా ఎవరిది ధర్మమో.. న్యాయమో… వెంకటేశుని సన్నిధిలో తేల్చుకోవాని చంద్రబాబు పిలుపునిచ్చారు. 
చంద్రబాబు ఉపన్యాసం గతంలో లాగానే చాలా సుదీర్ఘంగా సాగింది. చెప్పిందే చెప్పి సాగదీశారు. ప్రసంగం పెద్దగా ఆకట్టుకోలేక పోయినా మోడీని ఫ్రశ్నించి తీరు చంద్రబాబు ఛర్మిష్మాను చాటి చెప్పింది. నమ్మక ద్రోహం చేస్తే ఏం చేయాలో చెప్పండి తమ్ముడూ అంటూ నిలదీశారు. ఒక రాష్ట్ర సిఎం ఇంత పెద్ద స్థాయిలో ప్రధానిని గతంలో ఎవరూ ప్రశ్నించలేదు. ఇప్పుడు బాబు ఏకంగా మోడీ పైనా గురి పెట్టారు. అభివృద్ధికి అడుగడుగునా విపక్షాలు అడ్డుపడుతున్నాయి. పోలవరం నిర్మాణం జరగకుండా అడ్డుకుంటున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏపీకి న్యాయం చేస్తామన్నారు. వైఎఆర్ కాంగ్రెస్ పార్టీ మాటలను నమ్మవద్దన్నారు. 
కేంద్రం సహకరించక పోయినా.. బ్యాంకులు ఇబ్బంది పెట్టినా రైతు రుణమాఫీ చేశామని గుర్తు చేశారు చంద్రబాబు. ఏపీకి అన్యాయం చేసిన మోదీని నిలదీయడం తప్పా? ఢిల్లీ కూడా చిన్నబోయే రాజధాని నిర్మించేందుకు సహకరిస్తామన్నారు. రాజధానికి రూ.1500 కోట్లు ఇచ్చిన ప్రధాని మోడీ గుజరాత్‌లో విగ్రహం ఏర్పాటుకు రూ.2500 కోట్లు ఇచ్చారు. హోదా హామీపై మోదీ ఎందుకు నిలబడలేదో చెప్పాలి. స్కీం ఆంధ్రా కావాలా.. స్కాం ఆంధ్రా కావాలా అన్న మోడీ… వైసీపీతో కలిసి లాలూచీ రాజకీయాలు చేస్తున్నారు. అవినీతిపరులను ప్రోత్సహిస్తే రాష్ట్ర భవిష్యత్‌ ఏమవుతుందని ప్రశ్నించారు. 
తడబడ్డ బాలయ్య
తాను ఏం చేసాను చెప్పారు చంద్రబాబు. ఏం చేస్తానో క్లారిటీగా ఉన్నారు. మరోవైపు నారా లోకేష్ తన పై వచ్చిన ఆరోపణలకు ఆధారాలు చూపించాలన్నారు. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు ఏం మాట్లాడాలో పెద్దగా అర్థం కాలేదు. మాటల్లో తడబడ్డారు. ఆ తర్వాత సరి చేసుకున్నారు.. తొలిగా సభ వేదిక వద్ద సుడిగాలి వచ్చింది. సభకు ఏర్పాటు చేసిన రేకులు ఎగిరిపోయాయి. చిరు జల్లులు పడ్డాయి. ఏమైనా సభ బాగా జరిగింది. టీడీపీ వాణిని బలంగా వినిపించినట్లు అయింది.  
 
 

2 Comments

  1. Meeku Mee TDP ki aa srinivasuni aashisulu vundalani vachhe elections purti majority to gelavalani korukuntunnamu

  2. Now it is a war. It is a no return situation. Chandrababu versus Modi(+Jagan+ Pavan Kalyan). Life and death fight. The people of Andhrapradesh has to judge and decide. Karnataka is crucial for the political survival of Modi and CBN. It will be a no holds bar fight after Karnataka election.

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.