మ‌రోసారి తెర మీద‌కు కాంగ్రెస్ , టీడీపీల పొత్తు వ్య‌వ‌హారం

ఎన్నిక‌లు స‌మీపిస్తున్నాయి. విజ‌యం కోసం పార్టీలు నిమ‌గ్న‌మ‌య్యాయి. కొత్త‌పొత్తులు పొడుస్తున్నాయి. తెలంగాణ‌లో ముంద‌స్తు టాపిక్ హాట్‌హాట్‌గా ఉండ‌టంతో కాంగ్రెస్‌, టీడీపీమ‌ధ్య పొత్తు మ‌రోసారి తెర మీద‌కు వ‌చ్చింది. ఈ పొత్తు గురించి టీడీపీలో కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.. కొందరు కాంగ్రెస్ ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తా అంటుంది.. రాష్ట్ర ప్రయోజనాల కోసం కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవటం తప్పుకాదనే అభిప్రాయం వ్యక్తం చేసారు.. ఇక యనమల, కేఈ కృష్ణమూర్తి లాంటి వారు కాంగ్రెస్ తో పొత్తు అంటే ఒంటికాలు లేచారు.. ఆ పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశమే లేదని కుండబద్దలు కొట్టేసారు.. అయినా కాంగ్రెస్ – టీడీపీల పొత్తు గురించి అప్పుడప్పుడు వార్తలు వస్తూనే ఉన్నాయి..

ఏపీ కాంగ్రెస్ నేతలు కూడా పొత్తు వార్తలను ఖండించారు.. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్ప మొయిలీ కూడా ఏపీలో ఏ పార్టీతో పొత్తు ఉండదని తేల్చి చెప్పారు.. దీంతో ఏపీలో కాంగ్రెస్- టీడీపీల పొత్తు వార్తకు తెరపడేలాగానే ఉంది.అయితే తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ టీడీపీల మధ్య పొత్తు ఉండే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.. ఏపీలో అంటే టీడీపీ అధికారంలో ఉంది.. పార్టీ బలంగా ఉంది.. అసలు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరంలేదు.. నిజం చెప్పాలంటే పొత్తు కంటే ఒంటరిగా బరిలోకి దిగితేనే ఎక్కువ లాభమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.. కానీ తెలంగాణలో ఆ పరిస్థితి లేదు.. తెలంగాణలో ఒకప్పుడు టీడీపీ బలంగా ఉంది కానీ రాష్ట్ర విభజన అనంతరం పరిస్థితి మారిపోయింది.. మెజారిటీ నాయకులు పార్టీని వీడి తెరాస, కాంగ్రెస్ లలో చేరారు.. కొన్ని చోట్ల కేడర్ అయితే ఉంది కానీ వాటిని ఓట్లుగా మలిచి గెలిపించే నాయకులు కావాలి..

తెలంగాణలో టీడీపీకి పూర్వవైభవం రావాలంటే ముందు పార్టీ నిలదొక్కుకోవాలి.. దానికి బలమైన పార్టీ మద్దతు ఖచ్చితంగా కావాలి.. కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలో లేకపోయినప్పటికీ, ప్రధాన ప్రతిపక్షంగా బలంగా ఉంది.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఎలాగైనా గెలవాలని, అందుకోసం ఇతర పార్టీల మద్దతు కూడగట్టుకోవాలని చూస్తోంది.. ముఖ్యంగా టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని ఆశపడుతోంది.. ఇది టీడీపీకి కలిసొచ్చే అంశమనే చెప్పాలి.. తెలంగాణలో ఈ రెండు పార్టీ పొత్తుపెట్టుకుంటే.. అధికారం పొందాలని చూస్తున్న కాంగ్రెస్ కి టీడీపీ బలం కూడా తోడైతే విజయావకాశాలు ఎక్కువుంటాయి.. అదే విధంగా టీడీపీ కూడా కాంగ్రెస్ మద్దతుతో కొన్ని సీట్లు గెలుచుకొని, తెలంగాణలో పార్టీ బలోపేతానికి బాటలు వేసుకున్నట్టు అవుతోంది.. ఈ విధంగా తెలంగాణలో రెండు పార్టీలకు పొత్తు లాభించే అవకాశాలు ఉన్నాయి.. మొత్తానికి కాంగ్రెస్ – టీడీపీల పొత్తు ‘ఏపీలో వద్దు.. తెలంగాణలో ముద్దు’ అన్నట్టుగా ఉంది.. మరి ఈ పొత్తుపై అసలు ఈ రెండు పార్టీలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.