హ‌స్తం- సైకిల్‌.. పొత్తు ఎవ‌రికి లాభం!

కాంగ్రెస్‌.. సైకిల్ పార్టీల పొత్తుతో ప్ర‌యోజ‌నం ఎవ‌రికి? హ‌స్తం పార్టీ వ్య‌తిరేకంగా తెలుగువారి ఆత్మ‌గౌర‌వంగా వ‌చ్చిందే కాంగ్రెస్‌. అటువంటిది ఇప్పుడు ఏకంగా అదే పార్టీను భుజాన మోసేందుకు టీడీపీ అదిష్ఠానం సిద్ధ‌మైతే ఓట‌రు  ఎలా స్వీక‌రిస్తారు. అన్ని పార్టీల్లోనూ ఇదే సందేహం. ఆ రెండు పార్టీల్లోనూ ఇటువంటి అనుమాన‌మే. అయినా.. పొత్తు పొడ‌వాల్సిందే. ప్ర‌త్య‌ర్థిని ఎదురించేందుకు తాము ఇద్ద‌రం ఒక్క‌టి కావాల్సిందే.  క‌ర్ణాట‌కలో బీజేపీను ఓడించేందుకు ఏక‌మైన ప్రాంతీయ పార్టీలు, హ‌స్తంతో స‌హా ఇదే స్టాట‌జీను తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ల్లోనూ అమ‌లు చేసేందుకు సిద్ధ‌మయ్యాయి. అయితే.. అక్క‌డ కేవ‌లం బీజేపీ మాత్ర‌మే ప్ర‌త్య‌ర్థి. కానీ.. తెలంగాణ‌లో బీజేపీతో పాటు టీఆర్ ఎస్‌. ఏపీలో వైసీపీ, జ‌న‌సేన. వెర‌సి.. ఇద్ద‌రికీ కామ‌న్ ప్ర‌త్య‌ర్థులైన వారిని ఎదిరించేందుకు పొత్తు పొడ‌వాల‌నేది టీపీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ అంత‌రంగం. ఈ మేర‌కు ఇప్ప‌టికే టీ టీడీపీ నేత‌ల‌తో మంత‌నాలు జ‌రిపారు. దీనిపై అధినేత చంద్ర‌బాబునాయుడు నిర్ణ‌యమే పైన‌ల్ కానుంది. ఈ లోపుగా.. లోక‌ల్ లీడ‌ర్ల‌లో మాత్రం ఒక విధ‌మైన చ‌ర్చ సాగుతుంది. అదేమిటంటే.. టీడీపీతో కాంగ్రెస్ స్నేహం చేస్తే.. తెలంగాణ‌లో అధికారం హ‌స్తం. ఏపీలో ప‌వ‌ర్ టీడీపీ చేప‌ట్టేలా ఒప్పంద‌మే కీల‌కం. ఎందుకంటే. ఏపీతో పోల్సితే. హ‌స్తం తెలంగాణ‌లోనే బ‌లంగా ఉంది. ఈ బ‌లానికి టీడీపీ కేడ‌ర్ తోడైతే చాల‌నేది ఉత్త‌మ్ ఆలోచ‌న‌.
అదే స‌మ‌యంలో చంద్ర‌బాబు కూడా వైసీపీ, జ‌న‌సేన‌ల‌ను  ఎదుర్కొనేందుకు ఏపీలోని హ‌స్తం ఓట‌ర్లు స‌రిపోతార‌నేది వ్యూహం. వెర‌సి.. నీకిది.. నాక‌ది అన్న‌ట్లుగానే పొత్తులు పొడుస్తాయి. అయితే.. సీట్ల కేటాయింపు విష‌యం వ‌చ్చేస‌రికే.. ఇప్ప‌టి వ‌ర‌కూ నియోజ‌క‌వ‌ర్గంపై దృష్టిపెట్టిన నేత‌లు ఎవ‌రు పార్టీ కోసం త్యాగం చేస్తారు. సీట్ల పంప‌కాల్లో త‌మ వ‌ర‌కూ వ‌చ్చేస‌రికే.. ఎవ‌రు అదిష్ఠానం ఆలోచ‌న‌కు జై కొడ‌తార‌నేది పార్టీల ఆందోళ‌న‌. ఇప్ప‌టికే కేసీఆర్ 105 చోట్ల అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించారు. దీంతో గంపెడాశ‌లు పెట్టుకుని గులాబీజెండా మోసిన నేత‌లు.. అదే కేసీఆర్ దిష్టిబొమ్మ‌ను త‌గుల‌బెట్టేంత వ‌ర‌కూచేరారు. ఎన్నిక‌ల రోజున పార్టీ ను దెబ్బ‌తీయాల‌నే క‌సితో ఇంకెంత‌మంది అండ‌ర్‌వ‌ర్క్ చేస్తున్నార‌నేది చెప్ప‌లేం. ఇటువంటి దుస్థితి. పొత్తు త‌రువాత తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు  ఎదురైతే.. ఊహించ‌ని న‌ష్టం ఓట‌మి రూపంలో చ‌విచూడాల్సి ఉంటుంది. పైగా.. మ‌హాకూట‌మిలా గంపగుత్తుగా పార్టీల‌న్నీ ఏక‌మైనా.. ప్ర‌జాభిప్రాయాన్ని మార్చ‌లేక‌పోవ‌టం 2009లో చూశాం. అటువంటిది.. ఇప్పుడు ఎంద‌రు క‌ల‌సినా.. ఓట‌రు మ‌న‌సు మార్చ‌గ‌లరా! నాయ‌కులు మారినంత తేలిక‌గా.. పార్టీ కార్య‌క‌ర్త‌లు, అభిమానులు. స‌గ‌టు ఓట‌రు మారిపోతారంటారా! ఇవ‌న్నీ విశ్లేషకుల వాద‌న‌. శ‌త్రువు బ‌లంగా ఉన్న‌పుడు దెబ్బ‌తీసేందుకు ప్ర‌త్య‌ర్థులంతా ఒక్క‌చోట‌కు రావాల్సిందే. ఇది రాజ‌కీయ‌మే కాదు.. రాజ‌నీతి కూడా.!!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.