టీడీపీ అక్కడ క్లీన్‌స్వీప్ చేస్తుందట

తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకే చిరకాల ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీతో జతకట్టింది. ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న ఆ పార్టీ తెలంగాణలో మాత్రం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. విభజన వల్ల ఏర్పడిన ఈ పరిస్థితిని అధిగమించేందుకు ఈ ఎన్నికలను ఉపయోగించుకోవాలని భావిస్తోంది. దీనితో పాటు, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సారథ్యంలోని తెలంగాణ రాష్ట్ర సమితిని మరోసారి అధికారంలోకి రానీయకుండా ఉండేందుకు మరో మూడు పార్టీలతో కలిసి మహాకూటమిని కూడా ఏర్పాటు చేసింది. టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ఏర్పాటైన ఈ కూటమిలో పెద్దన్న పాత్ర పోషించింది కాంగ్రెస్ పార్టీనే అయినా.. టీడీపీ భాగస్వామ్యం కూడా చాలా ఉంది. కూటమిలోని మిగిలిన పార్టీలతో పోలిస్తే టీడీపీ మాత్రం ముందు నుంచీ మెతక వైఖరి అవలంభిస్తూ వస్తోంది. మొదటి నుంచీ కూటమి ధర్మాన్ని పాటిస్తూ వస్తున్న తెలుగుదేశం పార్టీ.. అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సీట్ల కేటాయింపు సమయంలోనూ కాంగ్రెస్ పార్టీపై ఒత్తిడి తీసుకురాలేదు. అలాగే కచ్చితంగా పలానా స్థానామే కేటాయించాలని కూడా ఇబ్బంది పెట్టలేదు. అంతేకాదు, తమకు ఇస్తామన్న 14 స్థానాల్లో ఒకదానిని కాంగ్రెస్ పార్టీకే వదిలేసింది.

టీడీపీ పోటీ చేస్తున్న మొత్తం స్థానాల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మూడు స్థానాల్లో బరిలోకి దిగుతోంది. ఖమ్మం అసెంబ్లీ స్థానానికి ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, సత్తుపల్లిలో తాజా మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, అశ్వారావుపేట నుంచి మెచ్చా నాగేశ్వర్రావు పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఇదే జిల్లాలోని పది స్థానాలకు గానూ ఒక్కటే సీటు దక్కించుకున్న టీడీపీ.. ఈ ఎన్నికల్లో మాత్రం మూడుకు మూడు గెలుచుకుని క్లీన్‌స్వీప్ చేయబోతుందని వార్తలు వస్తున్నాయి. ఇటీవల పలు టీవీ చానెళ్లు, వార్తా పత్రికలు సహా కొన్ని యూట్యూబ్ చానెళ్లలో వెలువడిన ఫలితాల్లో ఈ మూడు స్థానాల్లో టీడీపీ విజయం సాధించబోతుందని తేలింది. అయితే, వీటిలో రాష్ట్రంలోనే భారీ మెజారిటీ సాధించే ఎమ్మెల్యేలలో ఒకరిగా అశ్వారావుపేట టీడీపీ అభ్యర్థి మెచ్చా నాగేశ్వర్రావు నిలబోతున్నారని, మిగిలిన రెండింటిలో సత్తుపల్లిలో సులభంగా, ఖమ్మంలో కొంచెం కష్టంగా ఆ పార్టీ విజయం సాధించే అవకాశాలు ఉన్నాయట. దీంతో ఆ పార్టీలో కొత్త జోష్ వచ్చేసింది. అంతేకాదు, ఖమ్మం జిల్లాలో ప్రజాకూటమిదే పైచేయి ఉంటుందని ఇటీవల మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కూడా వెల్లడించిన విషయం తెలిసిందే.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.