ఈ దెబ్బతో బీజేపీ, వైసీపీ పనైపోయినట్లే

ఏపీలో రాజకీయం రంజుగా సాగుతోంది. రోజుకో రంగు పులుముకుంటూ సంచలననానికి తెర తీస్తోంది. ఏడాదిలో జరగబోయే ఎన్నికల కోసం పార్టీలు ఎత్తుకు పైఎత్తు వేస్తున్నాయి. ఓ వైపు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు వైసీపీ-బీజేపీ తెర వెనుక రాజకీయం చేస్తుంటే.. మరోవైపు టీడీపీ వాటికి చెక్ పెట్టే ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా చంద్రబాబును ఇరుకున పెట్టేందుకు వైసీపీ-బీజేపీ నేతలు ఢిల్లీలో ప్లాన్లు వేసినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. పట్టిసీమ, పోలవరం తదితర వాటిలో అక్రమాలు జరిగాయంటూ ఆరోపిస్తున్న రెండు పార్టీలు అందులో ఏమైనా లొసుగులు దొరికితే చంద్రబాబును ఇరికించి, రాష్ట్రంలో అధికారంలోకి రావచ్చని వైసీపీ ప్లాన్ చేసిందని, దానికి బీజేపీ నేతలు సహకరిస్తోందని ఆ వార్తల సారాంశం.

ఈ వార్తల నేపథ్యంలో ఏపీలో రాజకీయం మరోసారి వేడెక్కింది. దీంతో అలెర్ట్ అయిన చంద్రబాబు.. గతంలో సిద్ధం చేసిన ప్లాన్‌ను వెంటనే అమలు పరచాలంటూ ఎంపీ సీఎం రమేష్‌కు సందేశం పంపారు. ఇందులో భాగంగా కడప ఉక్కు పరిశ్రమ సాధన కోసం రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌ ఈనెల 20వ తేదీ నుంచి ఆమరణ దీక్ష చేపట్టనున్నట్లు తెలుస్తోంది. దీని కోసం కడప జిల్లా పరిషత్‌ ఆవరణంలో వేదికను సిద్ధం చేస్తున్నారు. ఆమరణ దీక్షా శిబిరం ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నారు. ప్రత్యేక విద్యుత్‌ మీటర్లు ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వ నిబంధనల మేర ఫీజు చెల్లిస్తున్నారు. ఎక్కడా ట్రాఫిక్‌కు అంతరాయం కలుగకుండా ఉండేదుంకు జిల్లా పరిషత్‌ ఆవరణను ఆమరణ దీక్షా శిబిరానికి ఎంచుకున్నట్లు సమాచారం. కాగా తొలిరోజు పెద్ద సంఖ్యలో టీడీపీతో సహా వివిధ పార్టీలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర మంత్రులు, హాజరయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

ఎంపీ ఆమరణ దీక్షతో అటు కేంద్రంపైనా.. ఇటు వైసీపీ పైనా వ్యతిరేకత తీసుకురావాలని టీడీపీ భావిస్తోంది. అంతేకాదు కడపలో పాగా వేయాలని అనుకుంటున్న టీడీపీకి ఈ కార్యక్రమం చాలా ఉపయోగపడనుంది. దీనితో పాటు కడప ఉక్కు పరిశ్రమ రాకుండా వైసీపీ అడ్డుకుంటుందన్న ఆరోపణలకు బలం చేకూర్చి రాయలసీమలో ఆ పార్టీని దెబ్బతీయాలని టీడీపీ అనుకుంటోంది. చట్టంలో లేని హోదా మెమెలా ఇస్తామంటూ మెలిక పెట్టిన బీజేపీ ప్రభుత్వం.. చట్టంలో ఉన్న కడప ఉక్కుకు కూడా ఎగనామం పెట్టడంతో రాష్ట్ర ప్రజలు రగిలిపోతున్నారు. సీమకు బీజేపీ చేస్తున్న ద్రోహంపై అక్కడి ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ఒకవైపు ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర ప్రభుత్వం నేతృత్వంలోనే అలుపెరుగని పోరాటం నడుస్తుంటే… ఇప్పుడు కడప ఉక్కు కోసం అదే ప్రభుత్వానికి చెందిన టీడీపీ ఎంపీ నేతృత్వంలో సీమ ప్రజలు మరోసారి రోడ్డెక్కబోతున్నారు.

ఈ కార్యక్రమంతో వల్ల ఏపీలో టీడీపీ అవసరం ప్రజలు తెలుసుకోగలుగుతారని, అదే సమయంలో వైసీపీ, బీజేపీ మోసపూరిత రాజకీయాలను కూడా ప్రజలు గ్రహిస్తారని పలువురు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే బీజేపీ చేసిన మోసాన్ని రాష్ట్ర ప్రజలకు వివరించి, సక్సెస్ అయిన టీడీపీ.. కొద్దిరోజుల్లో చేయబోయే కార్యక్రమంతో తిరుగులేని శక్తిగా ఎదుగుతుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఏపీ ప్రజలను మోసం చేసిన బీజేపీతో వైసీపీ కలిస్తే.. అది ఆ పార్టీకే నష్టం అవుతుంది. దీని వల్ల బీజేపీ వ్యతిరేకులు వైసీపీకి మద్దతు పలకలేరు. కాబట్టి టీడీపీ వేసిన ఈ ప్లాన్‌తో వైసీపీ-బీజేపీ పని అయిపోయినట్లే..!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.