కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు

టీడీపీ, కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటున్నాయి. రాబోయే ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. తెలంగాణ వరకు ఇప్పటికైతే పొత్తుకు సరేనన్నారట. టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన రేవంత్ రెడ్డి ఇందులో కీలక పాత్ర పోషించారంటున్నారు. మరోవైపు జైపాల్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు టీడీపీతో పొత్తుకు సిద్దమనే సంకేతాలిచ్చారంటున్నారు. ఏపీలో రఘవీరారెడ్డిలాంటి నేతలు పొత్తుకు మాకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పినట్లు సమాచారం. కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్, ఎన్సీపీ నేత శరద్ పవార్ వంటి వారు సిఎం చంద్రబాబుతో ఇప్పటికే మంతనాలు చేశారు. ఫలితంగా కాంగ్రెస్ తో పొత్తుకు టీడీపీ అధినేత చంద్రబాబు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. అప్పుడే విషయం బయట పెడితే లాభం కన్నా నష్టం జరుగుతుందని ఆలోచిస్తున్నారట. 
ఇటీవల ఢిల్లీకి వెళ్లినప్పుడు చంద్రబాబు పొత్తు చర్చలు జరిపారంటున్నారు. మరోవైపు అమర్ సింగ్ వంటి వారితో చంద్రబాబు రహస్యంగా సమావేశం కావడం హాట్ టాపికైంది. వైకాపా ఈ విషయంలో ఆరోపణలు చేస్తోంది. చంద్రబాబు ఢిల్లీకి వెళ్లిన రోజు ఎవరితో మాట్లాడారో.. ఎక్కడికి వెళ్లారో తెలియదు. అందుకే చంద్రబాబు సమావేశాల సంగతి బయటకు రాలేదు. ఇప్పుడు వైకాపాతో పాటు.. బీజేపీ ఆ లీక్ లను బయట పెట్టింది. 
తెలుగుదేశం పార్టీతో పొత్తుపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తంకుమార్ రెడ్డి స్పందించారు. తాను పొత్తు పెట్టుకోవడం లేదని చెప్పలేదు. ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. టీడీపీతో పొత్తు పెట్టుకోవద్దు అని ఎక్కడా లేదుగా అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో కొన్ని చోట్ల టీడీపీకి ఓటు బ్యాంకు ఉంది. అయితే ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవాలా, వద్దా అనేది అధిష్టానమే నిర్ణయిస్తుందని చెప్పేశారు. 
ఫలితంగా టిడిపితో పొత్తుకు అనుకూలంగా  ఉన్నామనే సంకేతాలు ఇచ్చారాయన. కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లోకి వెళ్లిన చాలా మంది నేతలు మళ్లీ వస్తామని చర్చలు జరుపుతున్నారు. కానీ దీనిపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు ఉత్తమ్. గతంలో బీజేపీ, జనసేనతో పొత్తు పెట్టుకోవడం వల్ల టీడీపీకి మైలేజ్ వచ్చింది. ఈ సారి ఆ పార్టీలు లేకుండా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే ప్రజల్లో వ్యతిరేక భావం వచ్చే వీలుంది. అందుకే చంద్రబాబు ఆచితూచి అడుగేస్తున్నారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ టీడీపీ. అలాంటి పార్టీని కాంగ్రెస్ కాళ్ల దగ్గర పెడతారా లేదా అనే సందేహం చాలా మందిలో వ్యక్తమవుతోంది. 

1 Comment

  1. నిజంగా టీడీపీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే ఇంక టీడీపీ కి పుట్టగతులు ఉండవ్ . జగన్ కి చేజేతులా రాష్ట్రాన్ని యిచ్చేసినట్లే

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.