స్కాలర్ షిప్ లకు తానా ఆహ్వానం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా). తెలుగు సంస్కృతి సంప్రదాయాలను కాపాడేందుకు తన వంతుగా సేవలందిస్తోంది. అమెరికాలో చదివే తెలుగు విద్యార్థుల కోసం స్కాలర్ షిప్పులు అందిస్తోంది. అన్ని రకాలుగా ఆదుకుంటోంది. తెలుగు సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడానికి  తెలుగు ప్రజలు, వారి సంతతి గుర్తింపుని కాపాడేందుకు అహర్నిశలు కృషి చేస్తోంది.

తెలుగు సాహిత్య, సాంస్కృతిక, విద్యా, సాంఘిక, సేవా చర్చలకు ఓ వేదికగా నిలుస్తోంది తానా. 1977 లో ఏర్పాటైన తానా ఇప్పటికీ లాభాపేక్షలేని సంస్థగా తెలుగు వారికి విశేషంగా సాయపడుతోంది. ఇప్పుడు ఆ సంస్థ స్కాలర్ షిప్ లను అందిస్తోంది.

2018-19 ఏడాది గాను..డిగ్రీ చదువుకునే విద్యార్థుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. చదువుకునే సామర్థ్యం ఉన్నా..ఆర్థిక స్థోమత లేని వారికి అందులోను అమెరికాలో విద్యాభాస్యం చేసేందుకు దరఖాస్తులను పిలిచింది. మొత్తం ఏడు రకాలైన గ్రాడ్యుయేట్ స్కాలర్ షిప్పులను అందించనుంది తానా.

తానా ఫౌండేషన్ గ్రాడ్యుయేట్ స్కాలర్ షిప్పుల పేరుతో ప్రతి ఒక్క విద్యార్థికి 2000 డాలర్లను అందించనుంది.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో ఉంటున్న తెలుగువారు ఎవరైనా ఈ స్కాలర్ షిప్పులను పొందవచ్చు. ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లే విద్యార్థులు ఎవరైనా ఈ అవకాశాన్ని ఉపయోగించుకునే వెసులుబాటు ఉంది.

సెమిస్టర్ ప్రకారం ఒక్కో సెమిస్టర్ కు 500 డాలర్ల చొప్పున నాలుగు సెమిస్టర్లకు వీటిని అందించనున్నారు. గతంలో విద్యార్థులు చదువుకున్న విద్యను విజయవంతంగా పూర్తి చేసిన వారు మాత్రమే తానా స్కాలర్ షిప్ అందుకునేందుకు అర్హులు.

అంతే కాదు..నాలుగు యూత్ స్కాలర్ షిప్ లను అందించనుంది తానా. ఉత్తర అమెరికాలో హైస్కూలు విద్యను పూర్తి చేసుకుని కాలేజి చదువులకు వెళ్లే విద్యార్థులకు నాలుగు రకాల యూత్ స్కాలర్ షిప్ లను అందించనుంది తానా. ఒక్కోక్కరికి 1000 డాలర్లను వారికి స్కాలర్ షిప్ గా ఇవ్వనుంది. తానా ఫౌండేషన్ కు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది.

మరిన్ని వివరాలకు:
Niranjan Srungavarapu,
Chairman- TANA Foundation

248-342-6872
Chairman@tanafoundation.org

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.