తమిళతంబీలతో కేసీఆర్ మంతనాలు

తెలంగాణ సీఎం కేసీఆర్ చెన్నైకి వెళ్లారు. తమిళ తంబీలతో రాజకీయాలు మాట్లాడారు. ముందుగా డీఎంకే నేతలు, డీఎంకే వర్కింగ్ ప్రసిడెంట్ స్టాలిన్ లు విమానాశ్రయానికి వచ్చి కేసీఆర్ కు ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత నేరుగా కరుణానిధి నివాసానికి చేరుకున్నారు కేసీఆర్. కొడుకు స్టాలిన్ ఆయనకు కేసీఆర్ ను పరిచయం చేసి తెలంగాణ రాష్ట్ర సారధిగా పరిచయం చేశారు. వయసు మీద పడటంతో పెద్దగా మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నారు కరుణానిధి. అయినా సరే కరుణానిధిని కేసీఆర్ పరామర్శించారు. ఆయన ఆరోగ్యం పై ఆరా తీశారు.  
కరుణానిధితో మాట్లాడిన తర్వాత స్టాలిన్ తో కలిసి కూర్చున్నారు కేసీఆర్. ఆయనతో  ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై చర్చలు జరిపారు. 70 ఏళ్లుగా దేశ రాజకీయాల్లో కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు మాత్రమే అధికారంలోకి వస్తున్నాయి. ఇక మిగతా పార్టీలు లేవా అన్నారు కేసీఆర్. అందుకే ప్రాంతీయ పార్టీలను ఏకం చేసే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. పలు ప్రాంతీయ పార్టీల నేతలను కేసీఆర్ కలిసే ఆలోచన చేస్తున్నారు. ఇంకొన్ని రాష్ట్రాలకు పర్యటించనున్నారు. అదే విషయాన్ని కేసీఆర్ ప్రస్తావించారు. 
తొలిగా పశ్చిమ బెంగాల్ వెళ్లిన కేసీఆర్…మమత బెనర్జీతో మాట్లాడారు. ఆ తర్వాత కర్నాటకకు వెళ్లి జేడీఎస్ తో చర్చలు జరిపారు. దేవెగౌడ, కుమారస్వామితో మాట్లాడారు. ఎన్నికల్లో వారికి మద్దతు పలికారు. ఆ తర్వాత జార్ఘండ్ ముక్తి మోర్చా నేత సోరెన్ తో మాట్లాడారు. ఒడిస్సా సిఎం నవీన్ పట్నాయక్ తో మాట్లాడారు. పంజాబ్, ఢిల్లీ, కశ్మీర్ ప్రాంతాలకు త్వరలో వెళ్లనున్నట్లు చెబుతున్నారు కేసీఆర్. వీలున్నంత వరకు జాతీయ స్థాయిలో ఉన్న ప్రాంతీయ పార్టీలను ఏకం చేసే ప్రయత్నం చేస్తున్నట్లు ప్రస్తావిస్తున్నారు. కానీ కేసీఆర్ మాటలను వారు అంతగా నమ్ముతున్నట్లు లేదు. మేము మీ వద్దకు వస్తాం. రమ్మంటారా అని అడుగుతున్నారు కేసీఆర్. ఒక రాష్ట్ర సిఎం ఫోన్ చేసి మరీ వస్తానంటే ఎవరైనా కాదంటారా చెప్పండి. వచ్చేయమని కోరుతున్నాం అంటున్నారు నేతలు. వారు రమ్మంటేనే వెళుతున్నామని కేసీఆర్ అండ్ కో చెబుతున్నా అది వాస్తవం కాదని తేలింది. మమత బెనర్జీ, నవీన్ పట్నాయక్ విషయంలో అదే జరిగింది. ఆ రాష్ట్ర సిఎంలు కేసీఆర్ ను ఆహ్వానించారు. అందుకే వెళుతున్నట్లు చెప్పారు. తీరా అసలు విషయం ఏంటంటే కేసీఆర్ నే తమకు ఫోన్ చేసి వస్తానని కోరారు. కాదనలేదని వారిద్దరు చెప్పే వరకు కేసీఆర్ చెప్పిందే నిజమనుకున్నారు అంతా. తీరా అసలు సంగతి తెలిశాక కేసీఆర్ డ్రామాలు బయట పడ్డాయి. 
కరుణానిధినే కాదు..తమిళనాడులోని చిన్న చిన్న పార్టీల నేతలను కలిశారు కేసీఆర్. సీఎం కేసీఆర్ వెంట ఎంపీలు కేశవరావు, వినోద్, మంత్రి ఈటెల రాజేందర్, ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డిలను తీసుకు వెళ్లారు. తొలి భేటీకి తన కూతురు కవితను తీసుకెళ్లిన కేసీఆర్ ఆ తర్వాత వారిని పక్కన పెట్టారు. కేకే తొలి భేటీకి బెంగాల్ వెళ్లిన మిగతా రెండు సార్లు ఆయన వెంట లేరు. ఈ సారి కేసీఆర్ తో పాటు..సీనియర్ నేత కేకే ఉన్నారు. స్టాలిన్‌తో జరిగిన సుదీర్ఘ సమావేశంలో పలు అంశాలు చర్చకు వచ్చాయి. రానున్న కాలంలో తమకు సహకరించాలని కేసీఆర్ ను స్టాలిన్ కోరగా…తెలంగాణ నేత సమ్మతించారు. కర్నాటక ఎన్నికల్లో జేడీఎస్ కు మద్దతు ప్రకటించినట్లుగానే రానున్న కాలంలో స్టాలిన్ కు కేసీఆర్ సహకరించే పరిస్థితి ఉందంటున్నారు. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.