అది నందమూరి వారి రక్తంలోనే ఉంది

నందమూరి తారక రామారావు.. తెలుగు సినీ రంగంలో అగ్ర స్థానంలో కొనసాగిన నటుడు. సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే ఎన్టీఆర్.. సినిమా సెట్స్‌లో ఎంతో డెడికేషన్ ప్రదర్శించేవారు. అందరికంటే ముందు షూటింగ్ రావడం.. ఆలస్యమైనా మంచి ఔట్‌పుట్ కోసం పరితపించడం.. ఇక గాయాలను లెక్కచేయకపోవడం వంటివి చేస్తుండేవారని గతంలో పలువురు సినీ ప్రముఖులు స్వయంగా చెప్పారు. ఆయన వారసత్వం పంచుకున్న బాలకృష్ణ కూడా ఇదే ఫాలో అయ్యేవారని కూడా మనకు తెలుసు. ఆయన తర్వాతి స్థానం మాత్రం జూనియర్ ఎన్టీఆర్‌కు దక్కుతుంది. రూపంలోనే కాదు.. తాత గుణాన్ని కూడా పునికి పుచ్చుకున్నాడు తారక్. ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలు చూస్తే ఇదే విషయం అందరికీ అర్థమవుతుంది. ఇటీవల నందమూరి హరికృష్ణ మరణం తర్వాత ఆయన కుమారుడైన తారక్.. వృత్తి పట్ల తనకున్న అంకిత భావాన్ని ప్రదర్శించి పలువురి ప్రశంసలు అందుకున్నాడు.

ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అరవింద సమేత.. వీర రాఘవ’’ సినిమా చేస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్. షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. అయితే, ఇటీవల తన తండ్రి హరికృష్ణ మరణించడంతో సర్వత్రా పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. తారక్.. తన తండ్రి హఠాన్మరణం కారణంగా కొద్ది రోజుల పాటు ఎన్టీఆర్ షూటింగ్‌లో పాల్గొనలేకపోవచ్చని, ఈ పరిస్థితి నుంచి బయటపడి షూటింగ్‌లో పాల్గొనేందుకు అతడికి కూడా కొంత సమయం పట్టవచ్చని, దీంతో దసరాకు ఈ సినిమాను రిలీజ్ చేయడం కష్టమనే వార్తలు షికార్లు చేశాయి. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. ఆయన తండ్రి చనిపోయిన వారంలోపే షూటింగ్‌లో పాల్గొన్నాడు. దీంతో తారక్‌పై ప్రశంసల వర్షం కురిసింది.

తాజాగా ఆ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ చేసిన ట్వీట్‌తో మరోసారి తారక్ గొప్పదనం బయటకు వచ్చింది. ‘‘చాలా ఎమోషనల్ రోజుతో తారక్ అన్న ఓ సాంగ్ కోసం షూటింగ్‌ని స్టార్ట్ చేశారు. ఈరోజు తన డ్యాన్స్‌తో ఎనర్జీని వెనక్కి తెచ్చుకున్నట్టుగా చాలా మంచిగా అనిపించింది. నీకు చాలా పవర్ ఉంది అన్న. అరవింద సమేత టీం మొత్తం తరుపున నీకు లాట్స్ ఆఫ్ లవ్. అలాగే ఆడియో అప్‌డేట్స్ ఈ వారంలో స్టార్ట్ అవుతాయి’’ అని థమన్ ట్వీట్‌లో పేర్కొన్నారు. దీంతో తారక్ అభిమానులు తెగ ఖుషీ అయిపోతున్నారు. వృత్తి పట్ల అంకిత భావం నందమూరి వారి రక్తంలోనే ఉందని వారు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 12న విడుదల కాబోతున్న ఈ సినిమాలో తారక్ సరసన పూజా హెగ్డె నటిస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.