టీ.కాంగ్రెస్ లో ప్రక్షాళన

తెలంగాణ కాంగ్రెస్ లో భారీ మార్పులు జరగనున్నాయి. కర్నాటక ఎన్నికల తర్వాత ఈ మార్పులు ఉంటాయంటున్నారు. రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఈ మార్పులు, చేర్పులు చేసేందుకు కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గాంధీ కసరత్తులు చేస్తున్నారు. ములుగు మాజీ ఎమ్మెల్యే, మాజీ నక్సలైట్ సీతక్కకు జాతీయ మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వడం మాములు విషయం కాదు. బలహీన వర్గాలకు పెద్దపీట వేయడం వారి ఆలోచనలో భాగమే. పార్టీలో చేరిన కొద్ది కాలానికే ఆమెకు మంచి పదవి వరించడం మిగతా వారిని ఆశ్చర్యపరిచింది. ఇంకోవైపు రేవంత్ రెడ్డి వంటి వారికి కీలక పదవి ఇస్తారని తెలుస్తోంది. అతనే కాదు.. నాగం జనార్దన రెడ్డి, ఇంకొంతమందికి పదవుల పందేరం చేస్తారట. 
టీపీసీసీ చీఫ్ ఉత్తం కుమార్ రెడ్డి పీసీసీ అద్యక్షుడుగా కొనసాగుతారని తెలుస్తోంది. కాకపోతే డికె. అరుణ, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు గట్టిగానే ఆ పోస్టు కోసం తమ వంతుగా పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఇంకోవైపు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కోసం దానం నాగేందర్, పొన్నం ప్రభావకర్, డాక్టర్ వినయ్ తదితరులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. కేంద్ర స్థాయి నేతలు జైపాల్ రెడ్డి, రేణుకా చౌదరి, నంది ఎల్లయ్యలు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యత్వ పదవులను ఆశిస్తున్నారు. ఫలితంగా కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా కాంగ్రెస్ అధిష్టానం చర్యలు తీసుకుంటోంది. ఇక మీదట కాంగ్రెస్ దృష్టి పూర్తిగా తెలంగాణ మీద పెట్టనుంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా తమకు ప్రజల నుంచి మార్కులు పడలేదు. లోపాలు ఉన్నాయి. వాటిని సరిజేసుకుంటే మంచిదని ఆలోచిస్తోంది. అందుకే రాహుల్ గాంధీ పలు సభలు, సమావేశాల్లో పాల్గొనేలా చర్యలు తీసుకోనుంది. ఇప్పటికే రాహుల్ పర్యటన నాలుగు సార్లు వాయిదా పడింది. మరోసారి అలా కాకుండా చూడనుంది. అదే సమయంలో క్యాడర్ లో ఆత్మవిశ్వాసం పెంచే దిశగా కార్యాచరణ ఉండనుంది. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.