జేజేమ్మ కాదన్నా చేర్చుకున్న కాంగ్రెస్

డికే అరుణ కాదని చెప్పింది. అయినా సరే నాగంను ఆహ్వానించింది కాంగ్రెస్. ఫలితంగా పాలమూరు జిల్లా కాంగ్రెస్ లో రాజకీయం రసవత్తరంగా మారింది. మాజీ మంత్రి, బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు డాక్టర్ నాగం జనార్దనరెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఆయన కాంగ్రెస్ లో చేరనున్నారు. బిజెపిలో ఆయన అసంతృఫ్తిగా ఉన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిపై తాను పోరాడుతుంటే బిజెపి నాయకత్వం తనకు సహకరించడం లేదని ఆయన అంటున్నారు. బిజెపి అద్యక్షుడు అమిత్ షా కు ఆయన తన రాజీనామా లేఖను పంపారు. నాగర్ కర్నూలులో తన అనుచరులతో సమావేశం అయి ఈ నిర్ణయం ప్రకటించారు. త్వరలో నాగం కాంగ్రెస్ లో చేరవచ్చని..రాహుల్ గాంధీ ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. 
కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ డికే అరుణ. ఇప్పుడామెకు నాగం జనార్దన్ రెడ్డి రూపంలో ఇబ్బంది ఎదురవుతోంది. అందుకే ఆయన రాకను గట్టిగా వ్యతిరేకిస్తోంది. నాగంను పార్టీలోకి తీసుకోవద్దని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకే ఫిర్యాదు చేసింది. నాగంను ఎట్టి పరిస్థితుల్లోను తీసుకునేది లేదని రాహుల్ వారికి హామీనిచ్చారు. కాలం గడిచింది. కానీ మరోవైపు ఆమె వైరి వర్గం వేగంగా పావులు కదిపింది. నాగం పార్టీలోకి వస్తే జరిగే ప్రయోజనం సంగతి ప్రస్తావించింది. ఫలితంగా రాహుల్ మెత్తబడ్డారు. అంతే సమాచారం నాగంకు చేరవేశారు. ఫలితంగా ఆయన పార్టీకి రాజీనామా చేశారు. కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి, రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు నాగం కోసం ప్రయత్నించారు. నాగం పార్టీలోకి వస్తే తమ ఉనికికే ప్రమాదముందని డికే అరుణ నమ్ముతోంది. 
అందుకే డికే అరుణ అంత కోపంగా ఉన్నారు. తెలంగాణ కాంగ్రేస్ లో డికే అరుణ సీనియర్ నేత. పాలమూరు జిల్లా రాజకీయాల్లో ఆమె హావా మాములుది కాదు. అలాంటి జేజేమ్మకు చెక్ పెట్టేందుకే జైపాల్ రెడ్డి తన అనుచరుడు నాగంను తీసుకువస్తున్నారనే చర్చ సాగుతోంది. ఆలంపూర్ ఎమ్మెల్యే సంపత్ కుమార్, కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచందర్ రెడ్డిలు నాగం రాకను స్వాగతిస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ, నాగర్ కర్నూల్ నేత దామోదర్ రెడ్డి సిఎల్పీకి వచ్చి మరీ నాగంను పార్టీలోకి తీసుకురావద్దని గట్టిగానే మాట్లాడారు. నాగంను పార్టీలో చేర్చుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. అయినా సరే అతన్ని తీసుకురానున్నారు కీలక నేతలు.   
టీఆర్ఎస్ ను ఎదుర్కోవాలంటే నోరు కల వారు కావాలి. నాగం గట్టిగానే మాట్లాడతారు. అందుకే అతని అవసరం హస్తం పార్టీకి ఉందంటున్నారు. 
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని కాదని..నాగం కాంగ్రెస్ లో చేరనుండటం ఆశ్చర్యమే. తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు పావులు కదుపుతున్న కాంగ్రెస్ కు నాగంలాంటి నేతల అవసరముంది. అందుకే నాగం జనార్దన్ రెడ్డిని ఆహ్వానించింది. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.