సైరా.. స‌మ్మ‌ర్‌కు క‌ష్ట‌మేనా.. చ‌ర‌ణ్ భ‌యం అందుకేనా!

సైరా న‌ర‌సింహారెడ్డి వ‌చ్చే ఏడాది వేస‌వికి రిలీజ్ చేయాల‌నేది నిర్మాత రామ్‌చ‌ర‌ణ్ ప్లాన్‌. దానికి త‌గినట్టుగానే చిరు బ‌ర్త్‌డే 22న టీజ‌ర్ లాంచ్ చేశారు. కోటిన్న‌ర మంది వ‌ర‌కూ టీజ‌ర్ ను చూసి రికార్డు సృష్టించారు. సినిమాపై భారీ అంచ‌నాలే ఉన్నా..ఎక్క‌డో తెలియ‌ని అనుమానం.. ఆందోళ‌న చిత్ర‌యూనిట్‌కు చ‌మ‌ట్లు ప‌ట్టిస్తున్నాయ‌ట‌. చివ‌ర‌కు చ‌ర‌ణ్‌లోనూ అంతే స్థాయిలో టెన్ష‌న్ మొద‌లైంద‌ట‌. చిరంజీవి 151 సినిమా.. సైరా.. కేవ‌లం అంకెల‌కే కాదు.. మెగాస్టార్ ప‌ది, ఇర‌వై ఏళ్ల కింద‌టి డ్రీమ్‌. అందుకే.. ఖ‌ర్చు ఎక్కువైనా.. రేపు అటుఇటైనా.. ఎవ‌రూ కామెంట్ చేయ‌కుండా నిర్మాత‌గా కొణిదెల ప్రొడ‌క్ష‌న్‌కు అవ‌కాశం ఇచ్చారు. బ‌డ్జెట్ కూడా.. అంచ‌నాల‌ను మించుతుంద‌నే స‌మాచారం. ఇటీవ‌ల రామ్‌చ‌ర‌ణ్ కూడా ఇది అంకెల బ‌డ్జెట్‌తో లెక్క‌బెట్టేది కాదంటూ తేల్చిచెప్పారు. జ‌యాప‌జ‌యాల‌కు అతీతంగా తీస్తున్న మెగా సినిమాగానే చూడాల‌ని అభిమానుల‌కు ఉప్పందించారు. చిరు వ‌య‌సు 64కు చేరింది.
ఇంత వ‌య‌సులో గుర్రపుస్వారీ.. ఫైట్లు.. ఫిట్‌నెస్ కాపాడుకోవ‌టం.. పాత్ర‌లో లీన‌మ‌వ‌టం.. ఇవ‌న్నీ కాస్త ఇబ్బందిగానే ఉన్నాయ‌ట‌. క‌మ‌ర్షియ‌ల్ సినిమా అయితే.. ఇంత రిస్క్ ఉండేది కాదు. చారిత్ర‌కం.. అందులోనూ కీల‌క‌మైన స్వాతంత్ర పోరాట యోధుడి పాత్ర‌.. ఏ మాత్రం అటు ఇటైనా.. ఊహించ‌ని అనుభ‌వం ఎదురుచూడాల్సి వస్తుంద‌నే భ‌యం కూడా మెగాఫ్యామిలీలో ఉంది. అందుకే.. ఆచితూచి నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు కొన్ని సీన్ల‌తో మెగాస్టార్ వ‌య‌సు రీత్యా కాస్త ఒత్తిడికి గుర‌వుతున్నార‌ట‌. పైగా అల‌సిపోతున్న‌ట్లు కూడా ప్ర‌చారం సాగుతుంది. ఇన్ని ఇబ్బందులు.. మ‌రెన్నో స‌వాళ్ల‌ను చ‌విచూస్తూ.. 2019 మే నాటికి రిలీజ్ చేయ‌టం క్లిష్ట‌మైన టాస్క్‌గానే చ‌ర‌ణ్ భావిస్తున్నాడ‌ట‌. ఇది గ‌మ‌నించిన చిరంజీవి కూడా.. తాను ప‌డుతున్న ఇబ్బందిని దిగ‌మింగుతూనే కొడుకు కోసం న‌వ్వుతూ క‌నిపిస్తున్నార‌ట‌. మ‌రి.. చ‌ర‌ణ్ వ‌ర్రీ తీరుతుందా.. అనుకున్న స‌మ‌యానికి సినిమా రిలీజ్ చేస్తారా..!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.