స‌ర్వేతో దిగి వ‌చ్చాడు… పార్టీల‌ను హీటెక్కిస్తున్నాడు

కృష్ణా జిల్లా రాజ‌కీయాలు రోజురోజుకూ మారిపోతున్నాయి. ముఖ్యంగా మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ చుట్టూ రాజ‌కీయాల‌న్నీ తిరుగుతున్నాయి. ల‌గ‌డ‌పాటి టీడీపీ అధినేత, సీఎం చంద్ర‌బాబుతో భేటీ అయిన ప్ర‌తిసారీ.. ప‌లు ఊహాగానాలు వినిపిస్తుంటాయి. మ‌రోవైపు రాజ‌గోపాల్‌ టీడీపీలో చేరిపోవ‌డం ఖాయ‌మ‌నే వార్త‌లు వ‌స్తున్నా ఆ రోజు ఎప్పుడా అని అంతా ఎదురుచూస్తున్నారు. తాజాగా ల‌గ‌డ‌పాటి పొలిటిక‌ల్ రీ ఎంట్రీపై ఒక స్ప‌ష్ట‌త వ‌చ్చిన‌ట్టేన‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఆయన చేరిక‌కు చంద్ర‌బాబుకు కూడా సుముఖ‌త వ్య‌క్తంచేసిన‌ట్లు స‌మాచారం. ల‌గ‌డ‌పాటి ఇన్నాళ్లూ ఎంపీ సీటు కోసం వేచిచూస్తున్నార‌నే చ‌ర్చ న‌డిచింది. అయితే ఇప్పుడు ఆ నిర్ణ‌యాన్ని  మార్చుకున్నార‌ని ఆయ‌న వైఖ‌రిని గ‌మ‌నించిన‌వారు అంటున్నారు. ఎంపీగా పోటీ తీవ్రంగా ఉండ‌టంతో.. ఇక ఎమ్మెల్యేగానే పోటీచేసేందుకు నిశ్చ‌యించుకున్నార‌ట‌! త‌న స‌ర్వేల‌తో రాజ‌కీయ పార్టీల‌ను హీటెక్కించ‌డ‌తో పాటు ఎమ్మెల్యేల గుండెల్లో రైళ్లు పరిగెత్తించ‌డం ఆయ‌న‌కు అల‌వాటైన ప‌ని. ఆయన సర్వే అంటే.. అంత ఆస‌క్తి నెల‌కొటుంది. రాష్ట్ర విభజ‌న‌తో తీవ్ర మ‌నస్తాపానికి గురైన ఆయ‌న‌ రాజ‌కీయ స‌న్యాసం తీసుకున్నారు. అయితే ఇప్పుడు ఆయ‌న త‌న నిర్ణ‌యం మార్చుకున్నార‌ని తెలుస్తోంది. మ‌ళ్లీ రీ ఎంట్రీ ఇచ్చేందుకు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. టీడీపీలో చేరేందుకు ఆయ‌న సుముఖంగా ఉన్నారని స‌న్నిహితులు చెబుతున్నారు.
విజ‌య‌వాడ‌లో మంచిప‌ట్టున్న ఆయ‌న టీడీపిలో  చేరితే మ‌రింత బ‌లప‌డ‌వ‌చ్చ‌ని సీఎం చంద్ర‌బాబు కూడా భావిస్తున్నార‌ని తెలుస్తోంది. అయితే రాజ‌గోపాల్‌.. విజ‌య‌వాడ ఎంపీ సీటు కోరుతున్నార‌ని, అయితే ఆ సీటు ఙ‌చ్చే ప‌రిస్థితిలో చంద్ర‌బాబు లేర‌నే ప్ర‌చారం  జ‌రుగుతోంది.  అయినా ఈ సీటు కోస‌మే ల‌గ‌డ‌పాటి  చంద్ర‌బాబును ప‌దేప‌దే క‌లుస్తున్నార‌నే గుస‌గుస‌లు వినిపిస్తున్నారు. ఈ మధ్యే ల‌గ‌డ‌పాటి త‌న టీమ్‌తో ఒక సర్వే చేయించి ఫ‌లితాల  స‌మాచారాన్ని చంద్రబాబుకు అందించారు. ఈ స‌ర్వేలో చాలా చోట్ల సిట్టింగులకు వ్యతిరేకత ఉందనే విషయం స్పష్టం అయిన‌ట్లు తెలుస్తోంది. లగడపాటి సర్వే తెలుగుదేశం పార్టీలో క‌ల‌కం రేపింది. అయితే సిట్టింగుల‌ను, ఆ సీటును ఆశిస్తున్న ఇతర టీడీపీ నేతలను కాదని లగడపాటికి అవ‌కాశం ఇచ్చేదేలేద‌ని చంద్ర‌బాబు ఆయ‌న స‌న్నిహితుల వ‌ద్ద స్ప‌ష్టం చేశార‌ని భోగ‌ట్టా! దీంతో ల‌గ‌డ‌పాటి మ‌న‌సుమార్చుకుని ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ద‌మ‌వుతున్నార‌నే టాక్ వినిపిస్తోంది. ఏలూరు లేదా నూజివీడు స్థానాన్ని ఇస్తే అక్కడ నుంచి పోటీ చేస్తానని చంద్రబాబుకు చెప్పిర‌ని వినికిడి. దీనికి చంద్రబాబు కూడా ఓకే అన్నార‌ని, త్వరలోనే ల‌గ‌డ‌పాటి టీడీపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమని విశ్లేష‌కులు అంటున్నారు. కానీ రాజ‌కీయాల్లో ఏక్ష‌ణానికి ఏమి జ‌రుగుతుందో ఎవ‌రూ ఊహించ‌లేర‌న్న‌ది జ‌గ‌మెరిగిన స‌త్యం!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.