ఏపీలో స‌ర్వేల ర‌చ్చ‌!

2019 ఎన్నిక‌లు.. అదీ జూన్‌లో అంటే.. దాదాపు 9 నెల‌లున్నాయి. మ‌రి ఇంత గ‌డువు వున్నా ఎందుకీ భ‌యం.. పార్టీల్లో ఎందుకీ త‌త్త‌ర‌పాటు.. గెల‌వాల‌నే ఎందుకు ఉబ‌లాటం.. ఇవ‌న్నీ స‌గ‌టు ఓట‌రు మెద‌డులో మెదిలే డౌట్లు. స‌ర్లే.. ఓట‌రు గురించి ఇప్పుడెందుకు అనుకుంటే.. పార్టీలు మాత్రం.. గెలుపు మాట విని పుల‌కించి.. దాన్ని ఓట్లుగా మ‌ల‌చుకునేందుకు స‌ర్వేల‌పైనే భార‌మేశాయి. ల‌క్ష‌లు కుమ్మ‌రించి. వీలైతే.. కోట్లుఇచ్చి మ‌రీ స‌ర్వే పాపారాయుళ్ల‌ను రంగంలోకి దింపాయి. మీరే పార్టీకు ఓటేస్తారు. మీదేకులం.. మీరు ఏ నాయ‌కుడు అంటే ఇష్ట‌ప‌డ‌తారు. ఇవీ.. ప్రశ్న‌ల తీరు. నిజంగా ఇవ‌న్నీ ఏ టీడీపీయో. వైసీపీయో చేయిస్తుంద‌నే ఒక‌రికొక‌రు భావిస్తున్నారు. కృష్ణా, అనంత‌పురం జిల్లాల్లో అయితే.. పాపం స‌ర్వే కోసం వ‌చ్చిన కుర్రాళ్ల‌ను తోలుతీసి మ‌రీ కొట్టార‌ట‌. తామేదో.. బ‌తుకుదెరువు కోసం బ‌య‌టి నుంచి ఎవ‌రో చెబితే స‌ర్వేలు చేస్తున్నామంటూ నెత్తీనోరు మొత్తుకున్నా విన్లేద‌ట‌. అధికారంలో ఉన్న టీడీపీ, టీఆర్ఎస్ ఇరు పార్టీలు.. స‌ర్వేలు చేయిస్తున్న‌ట్లుగా ప‌లుమార్లు ప్ర‌క‌టించాయి.
త‌మ బ‌లం తెలుసుకునేందుకు ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌ను అంచ‌నా వేసేందుకు చేస్తే త‌ప్పేమిటంటూ వాదించిన సంద‌ర్భాలున్నాయి. కేసీఆర్‌, చంద్ర‌బాబు ఇద్ద‌రికీ రెండు రాష్ట్రాల్లో ఎవ‌రు బ‌లంగా ఉన్నార‌నే విష‌యాన్ని అంచ‌నా వేయ‌టం చాలా ముఖ్యం. భ‌విష్య‌త్తులో ఒకరి గెలుపోట‌ములు.. మ‌రొక నేత‌పై ప్ర‌భావం చూపేవే. ఏపీలో వైసీపీ, తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీలు కూడా స‌ర్వేల కోసం చాలామందిని రంగంలోకి దింపాయి. వారిచ్చిన‌ నివేదిక‌ల ఆధారంగానే రేప‌టి ప్రణాళిక‌ను సిద్ధం చేసుకుంటున్నాయి. కానీ.. స‌ర్వేలో ఇంత డైరెక్టుగా ప్ర‌శ్న‌లు అడ‌గ‌ట‌మే అస‌లుకు మోసం తెస్తుంద‌ట‌. ఏదో విధంగా ఓట‌రు నాడి తెలుసుకున్నా.. ఎన్నిక‌ల ముందు రోజు వ‌ర‌కూ ఓట‌రు మ‌నసు ఒకేలా ఉండాల‌ని లేదు. పోల‌య్యే ఓట్ల‌లో కేవ‌లం 20శాతం మాత్ర‌మే.. ఆయా పార్టీల‌కు సంబంధించిన అభిమానుల‌వి. మిగిలిన వాటిలో 40శాతం వ‌ర‌కూ..  ఎన్నిక‌ల ముందురోజు ఓట‌రు ఏ నేత‌కు.. ఏ పార్టీకు వేయాల‌నే ఓట్ల‌ని ఇటీవ‌ల ఓ స‌ర్వేలో తేలిన నిజం. మ‌రి ఈ లెక్క‌న‌.. పార్టీల స‌ర్వేలు.. గోవిందా.. గోవిందా అనాల్సిందేనా.. !!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.