ఏంటి సుజనా.. ఈ పని

టీడీపీ అధినేత, సిఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, ఏపీ ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. కానీ అంతలా వ్యతిరేకంగా మాట్లాడినా… స్పందించేందుకు నిరాకరించారు కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి. మంత్రి పదవికి రాజీనామా చేశాక ఆయన ఒకింత అసహనంతో ఉన్నారని తెలుస్తోంది. చంద్రబాబు సర్కార్ అంతా అవినీతి మయం అయిపోయిందని, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ లు అవినీతికి పాల్పడుతున్నారని పవన్ అన్నా.. లైట్ తీసుకోవాలని భావించారు సుజనా. పవన్ వ్యాఖ్యలపై తాను మాట్లాడనని ఆయన అన్నారు. వాస్తవంగా టీడీపీ నేతలుగా తమ అధినేతపై ఆరోపణలు వస్తే ఖండిస్తారు. ఇదేంటో విచిత్రంగా అసలు నేను మాట్లాడేదే లేదని చెప్పారు సుజనా చౌదరి. ఫలితంగా పవన్ వ్యాఖ్యలను ఆమోదించినట్లు అర్థమవుతోంది. 
కేంద్ర మంత్రిగా రాజీనామా చేసిన తర్వాత దానిపై వివరణ ఇచ్చేందుకు సుజనా చౌదరి పార్లమెంటులో ప్రయత్నించారు. ఇందుకు స్పీకర్ అనుమతి ఇవ్వడం లేదు. పైగా తన ప్రసంగానికి పలు సవరణలు చేస్తున్నారని ఆయన వాపోయారు. రాజీనామాల ద్వారా కదలిక వస్తుందనుకుంది టీడీపీ. కానీ బీజేపీ అసలు పట్టించుకోవడం లేదు. హోదా ఇచ్చేది లేదని చెప్పింది. రైల్వే జోన్ కాదని ప్రకటించింది. సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం నుంచి పిలుపు రావడం లేదని విమర్శించారు. పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై చంద్రబాబుతో మాట్లాడి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించే దిశగా టీడీపీ వెళుతోంది. గతంలో టీడీపీకి విలువనిచ్చేవాళ్లు. ఇప్పుడు అసలు పట్టించుకోవడం మానేశారు. కేంద్ర మంత్రి పదవుల నుంచి ఇద్దరు తప్పుకోవడంతో సుజనా చౌదరి, అశోక్ గజపతిరాజులను ఎవరూ పట్టించుకోవడం లేదు. నిన్నటి వరకు మందీ మార్భలం, హడావుడి ఉండేది. మంత్రుల ఇళ్ల వద్ద తెలుగు దేశం నేతల హడావుడి ఉండేది. ఇప్పుడు అటు అసలు ఎవరూ రావడం లేదు. ఫలితంగా అనవసరంగా మంత్రి పదవులకు రాజీనామా చేశామనే భావన అంతర్గతంగా సుజనా మాటల్లో వ్యక్తమవుతుందంటున్నారు. 
బీజేపీ పెద్దలతో సుజనాకు బాగానే సంబంధాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు బంధం తెగిపోతోంది. కాబట్టి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిల్లో సుజనా ఉన్నారంటున్నారు. అందుకే చంద్రబాబు, లోకేష్ లపై ఇతర పార్టీల నేతలు విమర్శలు చేసినా ఖండించే ఆలోచన చేయడం లేదంటున్నారు. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.