ఉక్కు గెలిచింది.. ర‌మేష్ దీక్ష ఓడిందా!

క‌డ‌ప‌లో ఉక్కు ఫ్యాక్ట‌రీ కోసం సీఎం ర‌మేష్ అదేనండీ.. మ‌న ఎంపీ ర‌మేష్ గారి దీక్ష‌పై ఎన్నో విశ్లేష‌ణ‌లు. మ‌రెన్నో ఆస‌క్తిక‌ర‌మైన అంశాలు సోష‌ల్ మీడియాలో జ‌నం మ‌ధ్య చ‌క్క ర్లు కొడుతున్నాయి. రిత్విక్ అనే క‌న్‌స్ట్ర‌క్ష‌న్ సంస్థ‌కు ర‌మేష్ య‌జ‌మాని. దాదాపు నాలుగైదేళ్ల క్రితం వ‌ర‌కూ అంతంత‌మాత్రంగా న‌డిచిన సంస్థ‌. పైగా ర‌మేష్ అంటే.. పెద‌వి విరిచే వారే అధికం. ఒకానొక స‌మయంలో సీఎం చంద్ర‌బాబునాయుడు కూడా అప్ప‌ట్లో త‌న వ‌ద్ద‌కు రావ‌ద్దంటూ దూరంగా ఉంచార‌నే ప్ర‌చార‌మూ జ‌రుగుతుంది. అయితే అదంతా గ‌తం.. ఇప్పుడు ఉక్కుదీక్ష చేప‌ట్టి ఏకంగా 11 రోజుల‌పాదు అన్న‌పానీయాలు ముట్ట‌కుండా ఉండి రికార్డు సాధించారు. పైగా.. ఇదే రికార్డును 2009లో అప్ప‌టి టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కూడా చేశారు. యాదృచ్ఛికం ఏమిటంటే.. ఇద్ద‌రూ 11 వ రోజే దీక్ష విర‌మించారు. ఇద్ద‌రు నేత‌లు.. దీక్ష చేప‌ట్టినా.. కేసీఆర్ దీక్ష ఎలాంటిది అనేది.. నాటి ఎంపీ ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ స్వ‌యంగా చేసిచూపి ఝ‌ల‌క్ ఇచ్చారు.

ఇప్పుడు ఆ సాహ‌సం ఎవ‌రూ చేయ‌క‌పోయినా సీఎం ర‌మేష్ ఉక్కుదీక్ష‌పై బోలెడ‌న్ని అనుమానాలు. ఇదే స‌మ‌యంలో టీడీపీ ఎంపీలంతా.. ఒకేచోట కూర్చుని వేసుకున్న చ‌లోక్తులు కూడా దీక్ష‌ను నీరుగార్చాయి. పైకి.. గంబీరంగా దీక్ష స‌క్సెస్ అని చెబుతున్న టీడీపీలోనూ.. ఇదంతా తూచ్ అనే అభిప్రాయం కూడా ఉంద‌నేది బ‌హిరంగ ర‌హ‌స్యం. ఇక్క‌డ మ‌రో మెలిక ఏమిటంటే ర‌మేష్ దీక్ష‌పై సెటైర్లు వేసేవారిలో టీడీపీ నేత‌లే అధికంగా ఉంటున్నారు. పైగా దీక్ష చాలా గొప్ప‌ది.. కానీ.. చేసిన వ్య‌క్తిపై న‌మ్మ‌కం లేక‌పోవ‌ట‌మే దీక్ష‌పై ప్ర‌జ‌ల్లో న‌మ్మ‌కం లోపించ‌టానికి కార‌ణ‌మంటూ బ‌హిరంగంగానే చెబుతున్నారు. పైగా గ‌తంలో క‌ర్నూలులో స్టీలు ఫ్యాక్ట‌రీ అంటూ.. చైనా కంపెనీ రెడీ అయిందంటూ టీడీపీ హ‌డావుడి చేసిన విష‌యాన్ని కూడా ఇప్పుడు విప‌క్షాలు సొమ్ముచేసుకుంటున్నాయి. పైగా.. ఏపీ సొంత‌గా ఫ్యాక్ట‌రీ క‌డుతుందంటూ.. చెబుతున్న సీఎం.. చంద్ర‌బాబు ఎందుకీ దీక్ష‌ను చేయించార‌నే ప్ర‌శ్న కూడా త‌లెత్తుతోంది. క‌డ‌ప ప్ర‌జ‌లు.. ఏపీ జ‌నం.. దీక్ష‌లో న్యాయం చూస్తూనే.. ర‌మేష్ విలువ‌ల‌ను అనుమానిస్తున్నారు. అందుకే.. టీడీపీ దీక్ష‌ల‌తో బీజేపీ దిగిరాద‌నే భావ‌న‌లో ఉన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.