జ‌గ‌న్‌కు ఉక్కు దెబ్బ‌!

కాలం క‌ల‌సిరాక‌పోతే.. తాడే పామై క‌రుస్తుంద‌నే సామెత‌. వైసీపీ అధినేత విష‌యంలో రుజువైంది. సాక్షాత్తూ.. జ‌గ‌న్ పుట్టిన క‌డ‌ప గ‌డ్డ‌పై ఉక్కు ఫ్యాక్ట‌రీ నిర్మాణానికి బీజేపీ మోకాల‌డ్డితే.. సైలెంట్‌గా ఉండ‌టం.. జ‌గ‌న్ మెడ‌కు గుదిబండ‌గా చుట్టుకుంది. వాస్త‌వానికి జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ఉద్దేశం కూడా ఇప్పుడే బ‌య‌ట‌ప‌డుతుంది. అదే.. ఇప్పుడు వైసీపీను గుబులు పుట్టిస్తోంద‌ట‌.

 

అస‌లు విష‌యానికి వ‌స్తే.. వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి వార‌సుడిగా రాజ‌కీయాల్లో జెండా ఎగ‌ర‌వేయాల‌ని ఆశ‌ప‌డిన‌.. జ‌గ‌న్ ఏడెనిమిదేళ్లుగా.. పార్టీ అధినేత‌గా చురుకైన పాత్ర పోషిస్తున్నారు. అధికార పార్టీకు ధీటుగా వైసీపీ ఎదిగింది. గ‌త  ఎన్నిక‌ల్లో ఓటింగ్‌లో కేవ‌లం ఒక్కశాతం ఓట్లు.. టీడీపీన గ‌ట్టెక్కిస్తే.. అవే వ్య‌తిరేక ఓట్లు జ‌గ‌న్‌ను సీఎం కుర్చీకు దూరం చేశాయి.  దీంతో 2019లో ఎలాగైనా సీఎం కావాల‌నే టార్గెట్‌తో ఊరూవాడా తిరుగుతున్న జ‌గ‌న్‌.. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను గాలికి వ‌దిలేశార‌నే విమ‌ర్శ‌ల‌కు కార‌ణ‌మ‌వుతున్నాడు. విప‌క్షంలో ఉండీ ఎంతో చేయ‌వ‌చ్చ‌ని.. అధికార పార్టీను ఇరుకున పెట్ట‌వ‌చ్చంటూ.. ఆ నాడు విప‌క్షంలో ఉన్న జ‌గ‌న్ తండ్రి వైఎస్‌రాజ‌శేఖ‌ర్‌రెడ్డి, టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడు నిరూపించారు. క‌నీసం. వారి స్థాయిలో గాక‌పోయినా ఎంతో కొంత ఉద్య‌మాలు.. ప్ర‌జాసంక్షేమ‌ప‌థ‌కాల అమలుపై క‌స‌ర‌త్తు చేసిన‌ట్ల‌యితే విప‌క్ష నేత‌గా జ‌గ‌న్ గుర్తింపు తెచ్చుకునేవాడు . క‌నీసం.. ఆయ‌న ప్రాతినిధ్యం వ‌హించే పుల‌వెందుల‌లో అయినా.. ఏమైనా చేశారా! అనే సందేహం కూడా వ్య‌క్త‌మ‌వుతుంది. క‌డ‌ప‌కు తాగు, సాగ‌నీరు అందించ‌టంలో టీడీపీ చేసిన ప్ర‌య‌త్నం బాగానే ఫ‌లించింది. అదే స‌మ‌యంలో క‌డ ప‌లో ఉక్కుఫ్యాక్ట‌రీ నిర్మాణంపై టీడీపీ ఎంపీ సీఎం ర‌మేష్ దీక్ష‌కు మ‌ద్ద‌తు దొరుకుతుంది. వైసీపీ కూడా దీక్ష‌లు చేప‌ట్టినా.. వారికే ప‌రిమిత‌మైంది. నాలుగేళ్ల వ్య‌వ‌ధిలో ఎన్నోసార్లు.. ఎంపీలు పీఎంను క‌ల‌వ‌టం.. పీఎంవో ఆఫీసులు చుట్టూ తిర‌గ‌టం చేశారు. ఆ స‌మ‌యంలో అయినా.. క‌నీసం మాట‌వ‌రుస‌కు క‌డ‌ప గురించి… ఉక్కుప‌రిశ్ర‌మ గురించి చిన్న‌పాటి విన‌ప‌తిప‌త్రం ఇచ్చినా.. క‌నీసం చిన్న ఆందోళ‌న చేప‌ట్టినా.. వైఎస్‌జ‌గ‌న్ పేరు మారుమోగేదంటున్నారు వైసీపీ నేత‌లు.

 

కానీ.. ఇప్పుడా క్రెడిట్ టీడీపీ ఖాతాలోకి చేర‌టం.. జ‌గ‌న్‌ను ఇబ్బందిపెట్టేదంటున్నారు సొంత‌పార్టీ సీనియ‌ర్లు. ఈ లెక్క‌న‌.. వ‌చ్చిన ప్ర‌తి అవ‌కాశం జార‌విడుచుకున్న జ‌గ‌న్‌.. నెగ్గ‌టం.. ప్ర‌జాతీర్పుపైనే ఆధార‌ప‌డి ఉంద‌న్న‌మాటే. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.