పరిటాల రవి పేరు చెప్పి.. సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి

కాస్టింగ్ కౌచ్ అంటూ టాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టించి, సినీ ఇండస్ట్రీపై పోరాటం చేసింది నటి శ్రీరెడ్డి. అప్పటి నుంచి ఆమె బాగా పాపులర్ అయిపోయింది. అయితే, వర్మ-పవన్ వివాదంతో ఒక్కసారిగా కనిపించకుండా పోయిన ఆమెను మీడియా పట్టించుకోవడం మానేసింది. ఇక అప్పటి నుంచి సోషల్ మీడియానే ఆమె ఆయుధంగా మార్చుకుంది. దీంతో ఆమె ఏం చెప్పాలన్నా.. ఎవరిపైనైనా విమర్శలు చేయాలన్నా సోషల్ మీడియానే వాడుకుంటోంది. ముఖ్యంగా పవన్‌, మెగా ఫ్యామిలీపై అడపాదడపా దారుణమైన కామెంట్లు చేస్తున్న శ్రీరెడ్డి.. తెలుగు, తమిళ ఇండస్ట్రీలలోని పలువురు హీరోలు, డైరెక్టర్లపై సంచలన ఆరోపణలు చేసింది. అలాగే ఏపీ, తెలంగాణలోని ముఖ్యమైన రాజకీయ నాయకులను పొగుడుతూ పోస్టులు పెడుతోంది. తెలంగాణ ముఖ్యమత్రి కేసీఆర్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి నారా లోకేష్, ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే బాలకృష్ణలకు సపోర్టుగా మాట్లాడుతూ వారి అభిమానుల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేసింది.

తాజాగా ఆమె దివంగత నేత పరిటాల రవి పేరును ప్రస్తావిస్తూ ఓ పోస్టు చేసింది. దీంతో అది కాస్తా కొద్ది సమయంలోనే వైరల్ అయిపోయింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను, ఆయన అభిమానులను కించ పరుస్తూ ఆమె పోస్టు చేసింది. ‘‘బొమ్మ హీరో కాదురా గొర్రెల్లారా.. నిజమైన హీరోరా పరిటాల రవిగారు. ఆయనే ఉండుంటేనా.. గడ్డంకు, జుట్టుకు పెయింటింగ్‌లు వేసుకునే వాళ్లు సీఎం అవకుండా కాపాడేవారు. గడ్డం పెంచుకుంటే, ప్రసంగాల్లో అరుస్తూ మాట్లాడితే చెగువేరా అయిపోతారా..? నిద్ర లేవండి గొర్రెల్లారా.. అసలే వర్షాకాలంరా నాయన.. వానలోకి వెళ్లొద్దని చెప్పండి రంగు పోతుంది. మీ పులి వేషం వేసుకున్న నక్కకి’’ అని అందులో రాసుకొచ్చింది. అయితే, ఆమె చేసిన ఈ పోస్టుకు విపరీతమైన కామెంట్లు చేస్తున్నారు పవన్ అభిమానులు. అంతేకాదు, పరిటాల రవి టాపిక్ తీసుకురావడంపైనా కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.