శ్రీరెడ్డి ఈ సారి చిరు మీద పడింది…

శ్రీరెడ్డి. ఆ పేరు ఈ మధ్య కాలంలో మీడియాలో బాగా నానింది. ఇప్పుడు పెద్దగా ఆమెను పట్టించుకోవడం లేదు. అందుకే మరోసారి సంచలన మాటలు మాట్లాడుతోంది. ప్రజారాజ్యం పార్టీకి చెందిన గుట్టు మట్లు తనకు బాగా తెలుసునంటోంది. అవసరమైన సందర్భంలో వాటిని రివీల్ చేస్తానంటోంది. అసలు శ్రీరెడ్డి అంతిమ లక్ష్యం ఏంటో అర్థం కావడం లేదు. పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేసి తర్వాత వెనక్కు తగ్గింది. రాం గోపాల్ వర్మ చెబితేనే అలా చేశానని చెప్పింది. మరోవైపు తన సొంత అజెండా లేకుండా పోయిందామెకు. మహిళా సంఘాలు ఆమెకు మద్దతు తగ్గించాయి. ఒక దశలో శ్రీరెడ్డికి బాగా మద్దతు పలికిన వారంతా ఇప్పుడు ఆమెకు దూరమయ్యారు. తన వద్దకు వచ్చే వారిలో కోవర్టులు ఉండటం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని చెబుతున్నారామె.

మెగా కుటుంబానికి చెందిన వ్యక్తి గురించి తనకు బాగా తెలుసునంటోంది. అతను చాలా చెప్పాడు. ప్రజారాజ్యంలో ఎలాంటి అవకతవకలు జరిగాయో.. వాటి ఆధారాలు తన వద్ద ఉన్నాయని చెబుతుంది. మొన్నటి దాకా పవన్ గురించి చెప్పిన ఆ అమ్మడు ఇప్పుడు చిరు గుట్టు విప్పుతానని చెప్పడం హాట్ టాపికైంది. దగ్గుబాటి కుమారుడు అభిరామ్ తో ఉన్న ఫోటోలను బయట పెట్టి సంచనలం రేపిందామె. ఆ దెబ్బకు అభిరామ్ నే కాదు..నిర్మాత సురేష్ బాబు తలెత్తుకోలేక పోతున్నాడు. ఇక నేచురల్ స్టార్ నాని గురించి అలానే మాట్లాడింది. అయినా సరే నాని బిగ్ బాస్-2 ఎంపిక చేసింది స్టార్ మాటీవీ యాజమాన్యం. ఇప్పుడు మరో సంగతి చెబుతానంటోంది శ్రీరెడ్డి. అసలు శ్రీరెడ్డి ఎప్పుడు ఏం చేస్తుందో అర్థం కావడం లేదంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.