శ్రీరెడ్డి లీక్స్ తో కలకలం

శ్రీరెడ్డి పేరు చెబితేనే కొందరు ప్రముఖుల ప్యాంట్లు తడుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు… విదేశాల్లో ఉన్న వారికి సైతం ముచ్చెమటలు పడుతున్నాయి. అమెరికాలో ఉంటున్న ఎన్నారైలు సైతం ఆమె ఎక్కడ తమ పేర్లు బయట పెడుతుందోనని హడలెత్తిపోతున్నారు. ఆమెతో ఏకాంతంగా గడపడమే ఇందుకు కారణం. ప్రముఖులతో తాను కలిసి ఉన్న చాలా ఆధారాలను సేకరించింది శ్రీరెడ్డి. రోజుకో బాంబు పేలుస్తోంది. ఆ దెబ్బతో ఎవరికీ అర్థం కాని పరిస్థితి తయారైంది. ఇలా చేస్తుందని ఎవరూ ఊహించలేదు. అందుకే ఇప్పుడు అనవసరంగా తమ పేర్లు బయట పెడుతుందని భయపడుతున్నారు. సినీ ప్రముఖుల పిల్లలకు గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ప్రముఖ నిర్మాతలు, దర్శకులు, వారి పిల్లలు, రాజకీయ ప్రముఖులు శ్రీరెడ్డి ఖాతాలో ఉండటమే ఇందుకు కారణం. 
దగ్గుబాటి పరువు పోయే…
టాలీవుడ్‌ కాస్టింగ్ కౌచ్‌పై నెల రోజులుగా పోరాటం చేస్తోంది నటి శ్రీరెడ్డి. మా అసోసియేషన్ లో తమకు సభ్యత్వం ఇవ్వాలని ఆమె కోరినా పట్టించుకోలేదు. ఫలితంగా తనపై జరిగిన లైంగిక దాడిని ఆమె ప్రశ్నిస్తోంది. డబ్బులు ఇచ్చి తనను ఎలా వాడుకున్నారో అర్థనగ్న నిరసన రూపంలో తెలిపింది. అందుకే ప్రభుత్వం దీనిపై స్పందించే పరిస్థితి వచ్చింది. గతంలో కొందరు తనతో ఎలా ప్రవర్తించారో తెలుపుతూ కొన్ని ఫొటోలను బయటపెడుతోంది. ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు తనయుడు అభినయ్ ఇందులో ఉండటం విశేషం. శ్రీరెడ్డి తన ఫేస్‌బుక్‌ ఖాతాలో పెట్టిన పోస్ట్ ఇప్పుడు సంచలనంగా మారింది. అనూహ్యంగా నిర్మాత దిల్ రాజును టార్గెట్ చేసింది. శేఖర్ కమ్ముల, నేచురల్ స్టార్ నాని పేర్లను తెరపైకి తెచ్చింది. ఆమె పెట్టిన పోస్టులు ప్రకంపనలు రేపుతోంది. 
దిల్ రాజును వదల్లేదు..
టాలీవుడ్ నుంచి దిల్ రాజు పోతే శని వదిలిపోతుందని చెబుతోంది. ఆయన కుల రాజకీయాలు చేస్తున్నాడని విమర్శించింది. ఆయన చేతుల్లో ఎంతో మంది నలిగిపోతున్నారని ఆరోపించింది. ‘కుల రాజకీయాలు వద్దన్నా. ఆడ పిల్లలన్నా. బతకనిద్దామన్నా పాపం. దిల్ రాజు (రెడ్డి)… ప్లీజ్ సంకెళ్లు వేసిన కళామతల్లిని బంధ విముక్తురాలిని చేయండి. మీరు పోతే శని వదిలిపోయింది అనుకుంటారు. బతికుండగానే దయచేసి మారండి. వట్టి చేతులతో పోతాం. మంచిపేరుతో పోదామన్నా మనమందరం. త్యాగం అన్నా… టాలెంట్ ను చంపొద్దు అన్నా. మీరంతా మంచివారు. దయచేసి నా విజ్ఞప్తిని పరిశీలించండి’ అని శ్రీరెడ్డి రాయడం సంచలమైంది. అసలే తోడు కోల్పోయి ఉన్న దిల్ రాజును ఇలా ఇరికించింది శ్రీరెడ్డి అంటూ చాలా మంది పెద్దలు తల బాదుకుంటున్నారు. అక్కడితో వదల్లేదు. ఇంకా పెద్ద తలకాయల సంగతి బయట పెడతానని చెప్పింది. 
ఐడల్ శ్రీరామ్.. నానిలు అదే టైపట…
తాము అమ్మాయిలమని, అంగట్లో సరుకులం కాదని మరో పోస్టు పెట్టింది. ఇండియన్ ఐడల్ శ్రీరామ్, అభిరామ్ గురించి కూడా ఓ పోస్ట్ పెట్టిన శ్రీరెడ్డి.. ‘ఇండియన్ ఐడల్ శ్రీరామ్, అభిరామ్ మీరిద్దరూ రాముడు పేరు పెట్టుకుని.. ఛీ.. ఛీ’ అని వ్యాఖ్యానించింది. సినీ పరిశ్రమలో తెలుగు మహిళల పట్ల జరుగుతున్నా అన్యాయం, అవమానాలు, వ్యభిచారం చాలా బాధాకరం, తెలుగు సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం మన తెలుగు రాష్ట్రాలు. అలాంటిది. ఈ సినిమా పెద్దలు ఆధిపత్యంతో ఇండస్ట్రీని నాశనం చేస్తున్నారు. సభ్య సమాజంలో తెలుగు మహిళలకు ఉన్న గౌరవాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. కేవలం ఈ సినిమా ఇండస్ట్రీ పెద్దలకు వారి పిల్లలకు డబ్బు కావాలి. సుఖం కావాలి స్త్రీలతో ఆడుకుంటున్నారు. సినిమా ఇండస్ట్రీ అంటేనే రెండో డేరా బాబాలా ఉన్నాయ్’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 
శ్రీరెడ్డి అందరి జాతకాలను బయటపెడతానంటూ ఓ మీడియా సంస్థ లైవ్ ఇంటర్వ్యూలో చెప్పేసింది. ఆమె.. తన వద్ద ఉన్న ఫోటోలను ఆ మీడియా సంస్థకు ఇచ్చింది. ఈ లీక్స్ బయట పెట్టకుండా ఉండేందుకు ఓ ప్రముఖ స్టూడియోలోకి తీసుకువెళ్లి చాలా మంది ప్రలోభాలకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. ఆ విషయాన్ని ఆధారాలతో సహా బయటపెడుతున్నా అంటూ సంచలన ప్రకటన చేసింది. అయితే ఆ బడా వ్యక్తి తరపున మా అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీరాజా రంగంలోకి దిగి తనకు డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేశారని చెప్పింది. శ్రీరెడ్డి లీక్ చేసిన తాజా ఫొటోల్లోని ప్రముఖ వ్యక్తి పై కలకలం రేగింది. 
ఎన్నారైలు ఉన్నారు…
శ్రీరెడ్డి లీక్స్.. మొన్నటివరకు వాదోపవాదాలు, చర్చలకే పరిమితమయ్యాయి. ఇప్పుడు అసలైన సీన్ లోకి ఎంటరైంది. తొలి విడతలో భాగంగా ఏకంగా నిర్మాత సురేష్ బాబు కొడుకు, హీరో రానా సోదరుడు దగ్గుబాటి అభిరామ్ స్టిల్స్ విడుదల చేసిన ఆమె ఎన్నారైల సంగతి బయట పెట్టేందుకు సిద్దమైంది. అవకాశాలు ఇస్తానని చెప్పి తనను బాగా వాడుకున్నాడని దగ్గుబాటి కుటుంబంపై ఆరోపణలు చేసింది. అభిరామ్ ను ఏకంగా కామాంధుడు అని సంభోదించింది శ్రీరెడ్డి. ట్రాన్స్ జెండర్ ను కూడా వదలడని ఆరోపణలు చేసింది. శ్రీరెడ్డి లీక్స్ టాలీవుడ్ లో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. తెరవెనక ఇప్పటికే మంతనాలు పెరిగాయి. శ్రీరెడ్డితో కనెక్షన్ ఉన్న ప్రముఖులంతా ఒక్కటయ్యారు. సమస్యకు పరిష్కారం కోసం ఆలోచిస్తున్నారు. అయినా సరే శ్రీరెడ్డి మాత్రం ఇప్పట్లో ఈ లీకుల పర్వాన్ని ఆపేలా లేదు. మా అసోసియేషన్ వ్యవహారంతో బాగా హర్ట్ అయింది శ్రీరెడ్డి. ఆ బెదిరిస్తే వెనక్కు తగ్గుతుందిలే అనుకున్నారు. కానీ ఆ పని చేయలేదు. త్వరలోనే మరిన్ని ఫొటోలు/వీడియోలు వదిలేలా ఉంది. 
శ్రీరెడ్డి వ్యవహారం ఇటీవల కాలం వరకు టాలీవుడ్ కే పరిమితం. రామ్ గోపాల్ వర్మ చెప్పినట్టు ఇప్పుడామే జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ అయింది. నేషనల్ మీడియా కూడా ఆమెను కవర్ చేస్తోంది. ఆమెతో చర్చలు చేయడం ప్రారంభించింది. ఇలాంటి టైమ్ లో సదరు బడా నిర్మాత కొడుకు స్టిల్స్ లీక్ అయితే అది ఆ కాంపౌండ్ కు అతిపెద్ద మరకనే. దేశంలోనే ఇలా మొదటిసారి ఒక మహిళ తనకు జరిగిన అన్యాయంపై బాహాటంగా చెబుతోంది. గతంలో మళయాలంలో ఇలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు రిటైర్డ్ జస్టిస్ హేమ నేతృత్వంలో సీనియర్ నటి శారద, మాజీ ఉన్నతాధికారి కేబీ వల్సన కుమారి సభ్యులుగా కమిటీ ఏర్పడింది. వారి భద్రత దగ్గర్నుంచి, వేధింపులు, వేతనాల వివక్ష దాకా ఈ కమిటీ అధ్యయనం చేసి ఓ నివేదిక ఇవ్వాలి. ఇంకా అది ఇవ్వలేదు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అలాంటి కమిటీని ఏర్పాటు చేసే ఆలోచన చేస్తోంది.
తనవద్ద ఉన్న అన్ని ఆధారాలను ఓ టీవీ చానల్ ప్రతినిధికి ఇచ్చింది శ్రీరెడ్డి. ఫలితంగా అవి ఎప్పుడు బయట పెడతారోననే ఉత్కంఠ నెలకుంది. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.