పాపం శ్రీరెడ్డి, నోరు జారి ఇరుక్కుంది…

శ్రీరెడ్డి ఒంటరైంది. పవన్ కల్యాణ్ ను ఏమన్నా అంటే పెద్దగా పట్టించుకునే వారు కాదు. కానీ ఆయన తల్లిని తిట్టడంతో వివాదం పక్క దారి పట్టింది. ఫలితంగా పరిశ్రమకు చెందిన పెద్దలు ఆమె తీరును తప్పు పట్టారు. తొలిగా జీవిత రాజశేఖర్ రంగంలోకి వచ్చారు. ఆ తర్వాత మాధవీలత ఫిల్మ్ చాంబర్ ఎదుట మౌన దీక్షకు దిగారు. ఇంకోవైపు వరుణ్ తేజ్, నాగబాబులు గట్టిగానే కౌంటర్లిచ్చారు. ఫలితంగా శ్రీరెడ్డికి దిక్కుతోచడం లేదు. తప్పు చేసిన వారి పేర్లు పద్దతిగా బయట పెడుతున్న శ్రీరెడ్డి నోరు జారకపోతే బాగానే ఉండేది. కానీ అనసవరంగా పవన్ కల్యాణ్ తల్లి పై మాట్లాడి చిక్కులు తెచ్చుకుందంటున్నారు. ఫలితంగా ఆమెకు మద్దతుగా నిలిచిన వారు వెనక్కు తగ్గినట్లు అయింది. 
సినీ పరిశ్రమలో నెలకొన్న వివాదాలకు పుల్ స్టాప్ పడాలంటే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం తగ్గాలి. లేకపోతే కష్టమే. అందుకు తనకు తాను ఈ వివాదానికి పుల్ స్టాప్ పెట్టేందుకు సిద్దమైంది శ్రీరెడ్డి. ఒకరిపై ఒకరు కేసులు పెట్టేవరకు వివాదం వెళుతోంది. ప్రముఖ నటి జీవిత ఒక టీవీ చానల్ తో సహా పలువురిపై కేసులు పెట్టారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిమానులు శ్రీరెడ్డి పై ఫిర్యాదు చేశారు. పవన్ కళ్యాణ్ ను శ్రీరెడ్డి కించపరిచేలా మాట్లాడారని, శశాంక్ వంశీ అనే అతను పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫలితంగా ఇప్పుడు రగడ రేగుతోంది. 
ప్రముఖ నటి జీవితపై తన భర్త రాజశేఖర్ కోసం అమీర్ పేట హాస్టల్ పిల్లలను తీసుకువచ్చి పడుకోబెట్టేదని ఆరోపించారు సంధ్య. తన భార్యతో కాకుండా మిగతా వారితోను తాను గడిపానని గతంలోనే రాజశేఖర్ ఒప్పుకున్న సంగతి తెలిసిందే. ఇది బహిరంగ రహస్యమైనా..అది నిజం కాదంటున్నారు జీవిత రాజశేఖర్. తాను ఎవరిని పడుకోబెట్టానో ఆధారాలు చూపించాలన్నారు. ఫలితంగా శ్రీరెడ్డి వివాదం కొత్త దారిలోకి వెళ్లింది. మరోవైపు జీవిత రాజశేఖర్ పైనా నటి మాధవిలత కౌంటరిచ్చారు. వెతికి పట్టుకుని అవకాశాలు ఇవ్వలేదు. అందుకే తాము బయటకు వచ్చినట్లు తెలిపారు. ఇంతవరకు బయటికి రాని జీవితగారు ఇప్పుడు ఎందుకు బయటికి వచ్చారు? ఆవిడ మీద ఆరోపణ వచ్చిందని వచ్చారా?? టాలెంట్ ఉంటే వెతికి పట్టుకుని అవకాశాలు ఇస్తారా అని ప్రశ్నించారు. 
దీక్ష డ్రామా…
నిన్నటి వరకు శ్రీరెడ్డితో కలిసి క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడిన మాధవీలతపై ఒత్తిడి వచ్చింది. ఫలితంగా పవన్ కు అనుకూలంగా శ్రీరెడ్డికి వ్యతిరేకంగా ఆమె ధర్నాకు దిగారు. అదేంటి తెల్లారే పాటికి ఇలా చేసిందని అంతా అనుకున్నారు. అది శ్రీరెడ్డికి నచ్చలేదు. పవన్ కల్యాణ్ తల్లి పై శ్రీరెడ్డి వ్యాఖ్యలు చేసింది. దాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు మాధవీలత. కరాటే కళ్యాణి లాంటి వారు అదే మాట చెప్పారు. ఫలితంగా ఇప్పుడు ఆడోళ్ల మధ్యనే రచ్చ సాగుతోంది. అసలు పవన్ కల్యాణ్ దీనిపై ఒక్క మాట మాట్లాడలేదు. ఫిల్మ్ ఛాంబర్ ఎదుట నటి మాధవీలత మౌనదీక్షకు దిగడం మరింతగా కలకలం రేపుతోంది. మాధవీలత దీక్షను భగ్నం చేసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు పోలీసులు. మరోవైపు పవన్ కల్యాణ్ అన్న నాగబాబు దీనిపై మాట్లాడారు. ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే కోర్టుకు వెళ్లవచ్చు. పవన్ అదే విషయం చెప్పారు. ఇందులో తప్పేం లేదన్నారు. కొంతమంది వెధవల వల్ల పరిశ్రమకు చెడ్డపేరు వస్తోందని మండిపడ్డారు. ఇలాంటివి తన దృష్టికి వస్తే ఒకరిద్దరిని చెప్పుతో కొట్టానని ప్రస్తావించారు. తప్పు చేసిన వాళ్లను చెప్పుతో కొట్టి.. పోలీసులకు పట్టించండి అంటూ వేధింపులకు గురైన వారికి నాగబాబు పిలుపునిచ్చారు. శ్రీరెడ్డి పోరాటం పక్కదారి పట్టిందని ఆయన అన్నారు. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.