సిబ్బంది వచ్చాక స్పీకర్ కొత్త ఆలోచన 

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తాత్కాలిక భవనం ప్రజా ప్రతినిధులకే కాదు… సిబ్బందికి సరిపోవడం లేదు. పనిచేసే సిబ్బంది తక్కువగా ఉండటంతో పని భారం పెరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని అసెంబ్లీలో దాదాపు 8 వందల మంది వరకు సిబ్బంది ఉండేవాళ్లు. కానీ ఇప్పుడు వంద మందికి మించి లేరు. నాలుగేళ్లుగా వారి సంఖ్యను పెంచాలని చెబుతున్నా చర్యలు లేవు. ఫలితంగా స్పీకర్ కోడెలకు ఇబ్బంది వచ్చింది. మూకుమ్మడిగా సిబ్బంది అంతా స్పీకర్ కోడెల శివ ప్రసాద్ ను కలిసారు. తమ సంఖ్యను పెంచాలని కోరారు. అంతే కాదు… తమకు గదులు కేటాయించాలని కోరడంతో కొత్త భవనం నిర్మించాలనే ఆలోచన చేశారాయన. త్వరలోనే కొత్త భవనం నిర్మించే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడాలని నిర్ణయించారు. 
మార్చిలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపధ్యంలో ఉన్న అసెంబ్లీ భవనం సరిపోదంటున్నారు. ఎన్నికలు ముగిసే వరకు వైకాపా ఎమ్మెల్యేలు ఎవరూ సభలకు రారు కాబట్టి అటు ఇటు సర్దుబాటు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఏపీ అసెంబ్లీలో నూతన భవనాల నిర్మాణానికి సంబంధించి అసెంబ్లీ, సీఆర్డీఏ, ఎల్‌ అండ్‌ టి అధికారులతో స్పీకర్‌ సమావేశమై తగు సలహాలు సూచనలు తీసుకున్నారు. మొత్తం 4,600 చదరపు అడుగులతో, అత్యాధునిక హంగులతో నిర్మించే నూతన భవనంలో ఫస్టు ఫ్లోర్‌లో అసెంబ్లీ సిబ్బంది, గ్రౌండ్‌ ఫ్లోర్‌లో మీడియా పాయింట్‌, లైబ్రరీ, క్యాంటీన్‌, సెక్యూరిటీ ఆఫీసులు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. 
మరోవైపు మంత్రులు, విప్ లకు గదులు సరిపోవడం లేదు. విప్ చింతమనేని ప్రభాకర్ కు గది లేక స్పీకర్ కు మొర పెట్టుకున్న సంగతి తెలిిసిందే. అసెంబ్లీ కమిటీ సమావేశాలకు ఆ గదులు సరిపోవడం లేదు. పూర్తి స్థాయి రాజధాని నిర్మాణం మరింత ఆలస్యమవుతోంది. అందుకే తాత్కాలిక నిర్మాణం వైపు మొగ్గు చూపాలనేది స్పీకర్ ఆలోచన. ఇందుకు సిఎం చంద్రబాబునాయుడు ఏమంటారనేది ఆసక్తికరంగా మారింది.  

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.