కోడెల వార‌సుడు శ్రుతిమించాడా!!

గుంటూరు అంటేనే రాజ‌కీయం.. రాజ‌కీయాల‌కు రాజ‌ధాని అంటేనే గుంటూరు జిల్లా. అక్క‌డ సామాజిక‌, రాజ‌కీయ‌ చైత‌న్యం చాలా ఎక్కువ‌. తెలుగు రాష్ట్రాల్లో ఏ ఒక్క జిల్లాలోలేని ప్ర‌త్యేక‌తలున్నాయి. ఏ పార్టీ ప‌వ‌ర్‌లోకి వ‌చ్చినా.. కేబినెట్‌లో ముగ్గురు, న‌లుగురు మంత్రులు ఆ జిల్లా నుంచే వ‌స్తారు. అవ‌స‌ర‌మైతే.. ఢిల్లీ స్థాయిలో కాలు క‌ద‌ప‌కుండా పైర‌వీలు చేయ‌గ‌ల స‌మ‌ర్థులు అనే పేరుంది. మ‌రి అటువంటి చోట‌.. అధికార పార్టీకు.. పల్నాడు నుంచి బాప‌ట్ల వ‌ర‌కూ సెగ త‌గులుతుంది. ఇవ‌న్నీ ప‌క్క‌న‌బెడితే.. న‌ర్స‌రావుపేట‌లో టీడీపీ అంత‌ర్గ‌త పోరు బ‌జారున ప‌డింది. వీధికెక్కి ధ‌ర్నాలు చేసేంత వ‌ర‌కూ చేరింది. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌పున పోటీ చేసిన డాక్ట‌ర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యేగా విజ‌యం సాధించారు. స‌త్తెన‌ప‌ల్లి నుంచి పోటీచేసిన కోడెల శివ‌ప్ర‌సాద్ అతిక‌ష్టం మీద గెలుపొందారు. కేబినెట్‌లో చంద్ర‌బాబు సీటు ఇస్తార‌నుకుంటే.. కుద‌ర్లేదు. పెద్దాయ‌న గ‌తంలో ఎన్‌టీఆర్ వ‌ద్ద కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన నేత కావ‌టంతో చివ‌రి అవ‌కాశ‌మ‌ని భావించిన టీడీపీ పెద్ద‌లు చివ‌ర‌కు స‌భాప‌తిగా కూర్చొబెట్టారు. అయినా మంత్రిగానే పెత్త‌నం సాగుతుంది.
ప‌ల్నాడులో కొంద‌రు టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రం కోడెల‌కు వ్య‌తిరేకంగా ఉంటార‌నే ప్ర‌చారం ఉంది. కోడెల శివ‌ప్ర‌సాద్ వ‌ర‌కూ మంచి నేత‌గానే గుర్తింపు ఉన్నా.. ఆయ‌న వార‌సుడు డాక్ట‌ర్ శివ‌రామ‌కృష్ణ సెటిల్‌మెంట్లు, పంచాయ‌తీలు, బ‌దిలీలు, పాల‌న‌లో త‌ల‌దూర్చ‌టం.. ప్ర‌తి దానికీ క‌మీష‌న్లు కావాల‌ని డిమాండ్ చేస్తూ.. అన్నీ తానై చ‌క్రం తిప్పుతున్నారంటూ ప్ర‌తిప‌క్షాలు ఆరోపిస్తూ వ‌చ్చాయి. ఇప్పుడు సొంత‌పార్టీ నుంచి వ్య‌తిరేక‌త మొద‌లైంది. పుత్ర‌ర‌త్నం ఇన్ని చేస్తున్నా తండ్రి మౌనంగా ఉండ‌టంపై పార్టీ శ్రేణుల ఆందోళ‌న చెందుతున్నాయి. గుంటూరు నుంచి వెళ్లిన రాయ‌పాటి సాంబ‌శివ‌రావు ఎంపీగా న‌ర్స‌రావుపేట నుంచి గెల‌చినా.. స్థానిక‌త స‌మ‌స్య‌.. హ‌స్తం నుంచి రావ‌టం వ‌ల్ల లోక‌ల్ లీడ‌ర్స్ ఆయ‌న ద‌గ్గ‌ర‌కు వెళ్ల‌లేక‌పోతున్నారు. పైగా.. ఆయ‌న కూడా చంద్ర‌బాబుపై కాస్త గుర్రుగా ఉన్నారు.. క‌నిపించ‌ని ఇన్ని ఇబ్బందుల‌పై లోక‌ల్ నేత‌ల‌.. ప్ర‌జాప్ర‌తినిధులు గ‌ళ‌మెత్త‌టం.. అధికార పార్టీను ఇరుకున పెట్టేదే. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.