అమ్మ నా సోము వీర్రాజు…

టీడీపీ పేరు చెబితేనే ఒంటికాలి మీద లేస్తారు సోము వీర్రాజు. కేంద్రం నుంచి వచ్చిన నిధులకు సిఎం చంద్రబాబు లెక్కలు చెప్పడం లేదని ఆరోపిస్తారు. ఆయన మాటలు చూస్తే ఏపీ బీజేపీ అధ్యక్షుడేమో అనుకుంటారు. సిఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ తో పాటు..టీడీపీ సర్కార్ పైనా అవినీతి ఆరోపణలు ఎక్కువగా ఆయన మాటల్లో కనపడతాయి. ఉంది లేనిది..అన్నీ కలగలపి మీడియా ముందు చెప్పడం ఆయనకు బాగా అలవాటైన వ్యవహారంగా మారింది. ఏపీకి హోదా ఇవ్వక పోయినా..ప్యాకేజి రాకపోయినా..విశాఖకు రైల్వే జోన్ రాకపోయినా..మెట్రో నిధులు ఏపీకి ఇవ్వక పోయినా ఆయన మాట్లాడరు. ఇది నాణెనికి ఒకవైపు మాత్రమే. మరోవైపు ఆయన గురించి చాలా  భయంకర నిజాలు చాలా మందికి తెలియదు. అందుకే ఆయన గురించి ఓ బాధితుడు చాలా విషయాలను వెల్లడించారు. సోషల్ మీడియాలో ఇప్పుడది వైరల్ గా మారింది. అందులో నిజమెంత, అబద్దమెంతో మాకు తెలియదు. వారు రాసిన పత్రంలో ఏముందో మీరే చూడండి…
1. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ మండలం కాతేరు గ్రామంలో ఉప్పు చేపలు, కూరగాయలు అమ్ముకునే చిన్న దుకాణం నుంచి సోము వీర్రాజు ప్రస్తానం మొదలైంది.
2. 18 ఏళ్ల కిందట రాజమండ్రి వలస వెళ్లారు సోము వీర్రాజు. అక్కడ బీజేపీ కార్యాలయంలో  నెలకు రూ.1500 వేతనంతో పని చేశారు. బీజేపీ కార్యక్రమాలు ఏవైనా ఉంటే వాటిలో పాల్గొనేవాళ్లు.
3. బీజేపీకి అభ్యర్థులు కూడ దొరకని సమయంలో ఆ పార్టీ పక్షాన పోటీ చేశారు. ఆ పరంగా వచ్చిన విరాళాలను జేబులో వేసుకున్నారు.
4. ఎటువంటి వ్యాపారం, అధికార పదవులు అనుభవించకుండా ఆఫీసులో బాయ్ గా పని చేస్తూ చాలా ఆస్తులే కూడబెట్టారట. 
ఏ.  రాజానగరంలో 536/2  సర్వే నెంబర్ లో సోము వీర్రాజు పేరుతో, రాజానగరంలో 680/1, అక్కడే 681/1, 537 సర్వే నెంబర్లల్లో సోము వీర్రాజు సతీమణి పేరుతో రూ.5 కోట్ల విలువైన భూములున్నాయి.
 
బి. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో సర్వే నెంబర్ 316/ 8 లో 1.05 ఎకరాలు, రూ.50 లక్షల విలువ.
సి. రాజమండ్రిలో తారకరామా నగర్ లో  సర్వే  నెంబర్ 194 / 1 లో 260 గజాల స్థలం. విలువ కోటి రూపాయలు.
డి. రాజమండ్రి ఓపెన్ ప్లాట్ రూ. 5 కోట్లు విలువ. 
ఇ. రాజమండ్రిలో ఖరీదైన విల్లా, విలువ రూ. 8 కోట్లు
ఎఫ్… హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో ఆస్తులు రూ.10 కోట్లు
మొత్తం ఆస్తుల విలువ రూ. 29. 50 కోట్లు.
ఇంత ఆస్తి సోము వీర్రాజుకు ఎక్కడ నుంచి వచ్చింది. ఎవరిచ్చారు. ఏంటనేది ఆసక్తికరమే. 
5. సైకిల్ కూడ లేని పరిస్థితి నుంచి అధికార బలంతో ఏపీ 35కే 3337 కారు, ఆయన భార్య కుటుంబ సభ్యుల పేరు మీద నాలుగు కార్లు కొనుగోలు చేశారు. వీటికి డబ్బులు ఎక్కడ నుంచి వచ్చాయో తెలియదు.
 
6. ఆకుల సత్యనారాయణకు రాజమండ్రి బీజేపీ టిక్కెట్ ఇప్పించినందుకు రూ. 5 కోట్లు తీసుకున్నారని బీజేపీ నేతలే చెబుతున్నారు. 
ఓ బాధితుడు పేరుతో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది వార్త.   

2 Comments

  1. Manishi maata teeru ni batti atani vyaktitwam, sthaayi telustayi.veerraju sthaayi yemito janam munde telsukunnaru. emileni chinna vyapari ga vundi ela kotlaku padagalettado mundu atani avineeti meeda prabhutwam enquiry veyinchali.rayalaseema ku anyam jarugutondani BJP itani dwara malli AP ni cheelche kutra chestondi.veeriki AP prajalandaru tagina buddhi cheppali.

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.