సోము వీర్రాజుకు కోపం తెప్పించిన ఆ రెండు పత్రికలు

హస్తినకు వెళ్లిన ఏపీ బీజేపీ నేతలకు ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా క్లాస్ పీకాడని రెండు ప్రధాన పత్రికలు ప్రముఖంగా రాశాయి. ఇక మీదట సోము వీర్రాజు, పురందేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ వంటి వరాు చంద్రబాబు పై విమర్శలు చేయడానికే భయపడాలనేది ఆపత్రికల సారాంశం. ఆ వార్తలను చదివిన బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజుకు కోపం వచ్చింది. అంతే గతంలో ఎన్నడూ లేనంతగా రెచ్చిపోయాడు. ఎంతగా అంటే విపక్ష నేత జగన్ కూడ అంత దారుణంగా చంద్రబాబు పై కామెంట్ చేయలేనంతగా చేశాడు. రెండు ఎకరాల రైతుని అన్న చంద్రబాబు ఇప్పుడు లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ఎలా సంపాదించారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని వీర్రాజు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ నిదులు ఇక్కడ కొందరి అవినీతి సంపాదనకు ఉపయోగపడుతున్నాయని నిప్పులు చెరిగారు. తమకు వ్యక్తిగత ఎజెండా లేదని ఆయన మరోసారి చెప్పారు. కేంద్రం ఇచ్చిన నిదులతోనే ఆంధ్యప్రదేశ్ లో పనులు జరుగుతున్నాయనిఅయినా ప్రధాని మోడీ ఫోటో లేకుండా చంద్రబాబు సొంత పోటోలు పెట్టుకుంటున్నారని తెలుగుదేశం పై ఆయన విరుచుకుపడ్డ సంగతి తెలిసిందే.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉపయోగపడాలన్న ఉద్దేశంతో ఆ మీడియా రాసిన వార్త చివరకు చంద్రబాబుకు చికాకు తెచ్చిపెట్టింది. ఏపీ బిజెపి నేతలు పార్టీ అధ్యక్షుడు అమిత్ షాను కలిసినప్పుడు ఆయన కొందరు నేతలకు వార్నింగ్ ఇచ్చారని ఆ పత్రికలు రాశాయి. అమిత్ షా వద్ద చంద్రబాబు అనుకూల వర్గం వారిదే పై చేయి అయిందనేది సారాంశం. ఈ కథనం సోము వీర్రాజుకు నచ్చలేదట. అంతే ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్రమైన ఆరోపణలు గుప్పించారు. చంద్రబాబు అవినీతికి వారసుడని వేల కోట్లు అవినీతితో సంపాదించారని ప్రస్తావించాడు. కావాలని చంద్రబాబు పై వీర్రాజు వీర లెవల్లో విమర్శలు చేస్తుంటే… టిడిపి నేతలు మింగలేక కక్కలేక పరిస్థితిలో పడ్డారు. ఎక్కడ అవినీతి ఉన్నా పోరాడమని అమిత్ షా చెప్పారని సోము వీర్రాజు చెప్పడం మరింత హాట్ టాపికైంది. 
సోముకు వార్నింగ్….
భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజుకు ఏపీ రోడ్లు, భవనాల శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు వార్నింగ్ ఇచ్చారు. చంద్రబాబు అవినీతికి వారసుడని, రెండు ఎకరాల వ్యక్తి వేల కోట్ల ఆస్తులు ఎలా సంపాదించారని వీర్రాజు అనడంపై మంత్రి తిప్పికొట్టారు. వీర్రాజు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని విమర్శించే స్థాయి వీర్రాజుకు లేదన్నారు. కేంద్రం ఇచ్చిన నిధుల్లో రాష్ట్ర ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని మాట్లాడటం మంచిదికాదన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందన్నది నిజమన్నారు. విభజన హామీలను నేరవేర్చమని అడగడం తప్పు కాదన్నారు. 
చంద్రబాబుపై దారుణమైన కామెంట్లు చేసిన బీజేపీ నేతలను ఏం అనలేని పరిస్థితి. మిత్ర ధర్మం మేరకే తాము టీడీపీ నేతలను అదుపులో పెడుతున్నట్లు గతంలోనే చెప్పారు చంద్రబాబు. కానీ ఆయన మాటను కాదనకుండానే అయ్యన్న స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. బీజేపీపై ఎవరూ ఎలాంటి కామెంట్లు చేయవద్దని పైకి చెబుతున్నా.. లోలోపల చంద్రబాబు రగలిపోతున్నాడు. బీజేపీని దారిలోకి తెచ్చే ఉపాయం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.