సోము వీర్రాజును పక్కన పెట్టారట

బీజేపీ పైర్ బ్రాండ్ సోము వీర్రాజు. అదే అతనికి ప్లస్, మైనస్ అయ్యాయి. ఏపీ పార్టీ పగ్గాలు అప్పగిస్తారని భావించినా అది దక్కడం లేదు. ఆయన స్థానంలో కన్నా లక్ష్మీనారాయణ లేక మాణిక్యాలరావుల పేర్లను పరిశీలిస్తోంది హైకమాండ్. అతని పేరును తప్పించడంలో ఏపీకి చెందిన పార్టీ నేత కీలకభూమిక పోషించారంటున్నారు. అంతేకాదు.. వెంకయ్యనాయుడు లాంటి వారు సైతం సోముకు వద్దని చెప్పారంటున్నారు. బీజేపీకి, వెంకయ్యనాయుడుకు అసలు సంబంధం లేదు. రాజ్యంగబద్దమైన పదవిలో ఉన్నారు వెంకయ్య. అయినా సరే పార్టీ విషయాల్లో ఇప్పటికీ ఆయన సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు మోడీ. అందుకే వెంకయ్య మాటను కాదనలేకపోతున్నారట మోడీ ద్వయం. సోము వీర్రాజు విషయంలో సానుకూలంగా లేకపోవడానికి సిఎం చంద్రబాబుపై ఆయన చేస్తున్న విమర్శలే ఇందుకు కారణమంటున్నారు. అసలు బీజేపీతో బంధం తెగిపోయేందుకు సోము వీర్రాజు వంటి వారు ఒక కారణమనే భావన ఉంది. 
అందుకే టీడీపీ నేతలే కాదు.. రాం మాధవ్, కంభంపాటి వంటి వారు సోము వీర్రాజు వంటి వారికి పదవి ఇవ్వొద్దని చెబుతున్నారట. పురందేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణలది అదే తీరు. సోము వీర్రాజుకు పార్టీ హై కమాండ్, సంఘ్ పరివార్ తో విస్తృతంగా సంబంధాలు ఉన్నాయి. అది ఇబ్బంది తెచ్చిపెడుతుందని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. ఇప్పటికే సంఘ పరివార్ తో మోడీకి తిప్పలు వస్తున్నాయి. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పూర్తి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. మోడీ పేరు ఎత్తితేనే ఆయన నిప్పులు చెరుగుతున్నారు. అందుకే సంఘ్ పరివార్ ఊసు లేని నాయకుల కోసం బీజేపీ చూస్తోంది. అందుకే సోము బదులు మాణిక్యాలరావు అయితే మంచిదని ఆలోచిస్తోంది. 
రాష్ట్రనేతలు కొందరు చంద్రబాబును ఎదిరించాలంటే సోము వీర్రాజునే కరెక్టు అంటున్నారు. హైకమాండ్ ఏం చేస్తుందో మరి. వీర్రాజును తప్పించి తనకు అనుకూలంగా ఉండే మాణిక్యాల రావు పేరుని అధ్యక్ష పదవికి సిఫార్సు చేస్తున్నట్లు తెలుస్తుంది. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.