ముష్టి ఎమ్మెల్సీ అంటున్నాడు…

ప్రచారంలో రాంగోపాల్ వర్మలా మారిపోతున్నాడు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు. రోజు ఏదో ఒక విషయంపై మీడియాలో నానడం ఆయనకు అలవాటుగా మారింది. గతంలో నోరు కుట్టేసుకుని పద్దతిగా ఉండేవాడు. కానీ ఈ మధ్య ఆయన మీడియా ముందుకు రాకుండా ఉండలేకపోతున్నాడు. అదో వ్యసనంలా మారింది. మరోవైపు ఆయన మాట్లాడక పోయినా ఏదో విధంగా వీర్రాజును మాట్లాడించే ప్రయత్నం చేస్తోంది మీడియా. అందుకే ఆయన రెచ్చిపోతున్నాడంటున్నారు. ఒకసారి టీడీపీ మీద, మరోసారి చంద్రబాబుపై మరోసారి రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ప్రచారం వస్తోంది. వ్యక్తిగతంగా ఇమేజ్ పెరుగుతోంది. అందుకే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఒక్కోసారి అది శృతి మించుతోంది. ఆ దెబ్బతో ఏపీలో అధ్యక్షుడు కంభంపాటి హరిబాబునా… సోము వీర్రాజునా అనే చర్చ సాగుతోంది. ఎలాగు కంభంపాటి చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడలేడు కాబట్టి వైరి వర్గం సోమును ప్రొత్సహిస్తుంది.    
టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల బీజేపీకే నష్టం వచ్చిందని తాజాగా ఆ పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్న మాట. ఎందుకూ ఉపయోగపడని ఎమ్మెల్సీ పదవిని ఇచ్చి.. టీడీపీ నాయకులు భిక్ష అంటున్నారని మండిపడ్డారు. లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తుంటే ఏడాదికి .3 వేలకోట్లు వచ్చే హోదా ఏపీకి ఎందుకని ప్రశ్నించారు. మూడుసార్లు నిర్వహించిన భాగస్వామ్య సదస్సులతో ఇప్పటికే 30లక్షల ఉద్యోగాలు రాష్ట్రానికి వచ్చాయని చెప్పారు. ఏపీ సాధిస్తున్న జీడీపీ రేటు ఆధారంగా మోదీ ప్రభుత్వం చంద్రబాబు సర్కారు వద్ద అప్పు తీసుకోవచ్చని ఎద్దేవా చేశారు.
లాజిక్ తీశారు…
విశాఖ భాగస్వామ్య సదస్సుకు వచ్చిన వారు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఉందా లేదా అని అడగలేదు. రూ4 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయంటున్నారు. అందుకే హోదా అవసరం లేదన్నట్లుగా మాట్లాడారు. ఏపీకి పరిశ్రమలు రావడానికి మోదీ ప్రభుత్వ విధానాలే కారణమన్నారు. చంద్రబాబు ఎదుట నిలబడి వాస్తవాలు చెబుతానన్నారు. వీర్రాజు ఇప్పుడే కాదు.. గతంలోను చాలా సార్లు సవాళ్లు విసిరాడు. కానీ ఆయన్ను పట్టించుకోవద్దని చంద్రబాబు చెప్పడంతో కీలక నేతలు మౌనం దాల్చారు. కాకపోతే బొండా ఉమా, బుద్దా వెంకన్నలాంటి వారితో మాట్లాడించడంతో పెద్దగా విలువ లేకుండా పోయింది. టీడీపీ గట్టి కౌంటర్ ఇస్తే మరోసారి మాటల దాడి జరిగే వీలు లేదంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.