చంద్రబాబు పై అసత్య ప్రచారం..

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయంలో సిఎం చంద్రబాబునాయుడు ఎందుకు అలా అన్నారు. ఏ సందర్భంగా అలా అన్నాడో, ఎందుకు ఒప్పుకోవాల్సి వచ్చిందో నిజానిజాలు చెప్పాల్సిన బాధ్యత తెలుగుదేశం శ్రేణులకు ఉంది. అందుకే వాస్తవాలను చర్చించే ప్రయత్నం చేద్దామంటూ ఓ టీడీపీ అభిమాని సోషల్ మీడియాలో చేసిన పోస్టింగ్ ఇది. 

చంద్రబాబు బాబు చేసిన కామెంట్ తో సహా చర్చిద్దాం…

1. ప్రత్యేక హోదా 10 ఏళ్ళు కాదు 15 ఏళ్ళు కావాలి..!!

విభజన సమయంలో కాంగ్రెస్ హోదా 5 ఏళ్ళు అన్నప్పుడు బీజేపీలో ఉన్న వెంకయ్య గారు ఆంధ్రాకి 10 ఏళ్ళు అన్నారు, చంద్రబాబు 10 కాదు 15 ఏళ్ళు ఇస్తే వ్యాపార సంస్థలు, రాయితీలు,పధకాల ద్వారా లబ్ది చేకూరే అవకాశం ఉన్నది కాబట్టి అడిగాడు…

2.హోదాను 14 వ ఆర్ధిక సంఘం ఒప్పుకోవడం లేదు.

హోదా అంశం పై అనేకసార్లు ఢిల్లీ పెద్దలను కలిసి అడిగినప్పుడు వారి చెప్పిన సమాధానం, త్వరలో GST అమలుచేయబోతున్నారు కాబట్టి, హోదా అనే అంశం పరిపాలనాపరంగా ఇవ్వడం కుదరదు. 14వ ఆర్ధిక సంగం తేల్చిచెప్పింది. దేశ ప్రయోజనాల కోసం అందునా అడ్మినిస్ట్రేషన్ తెలిసిన వ్యక్తిగా దాన్ని కాదనలేక అర్ధం చేసుకున్నాడు…

3. ప్రత్యేక హోదా కన్నా ప్యాకేజీ లాభం..!

దేశ ఆర్ధిక మంత్రి జైట్లీ ,ఆర్ధిక శాఖ అధికారుల చర్చల అనంతరం వారికున్న GST అమలులో ఉన్న ఇబ్బందులను ప్రస్తావించారు. ప్రత్యేక హోదాలో కల్పిస్తున్న అన్ని అంశాలను ప్యాకేజీ లో ఇస్తాం అనే పూచీకత్తు మీద ప్యాకేజీ కి ఒప్పుకున్నాడు. 2016 నాటి పరిస్థితులలో దేశంలో తరువాత ప్రభుత్వం కుడా భాజపా వచ్చే సంకేతాలు బలంగా ఉండటంతో కేంద్రానికి వ్యతిరేకంగా ఉండి లాభం లేదనుకున్నాడు చంద్రబాబు. అందుకే రాష్ట్రానికి అన్యాయం జరగకూడదు అని నాడు తప్పక ఒప్పుకన్న పరిస్థితి..

4.హోదాతో ఏమి వస్తుంది..!

అప్పటికే కేంద్రం హోదా ఇవ్వబోము. ప్యాకేజీ తో మీకున్న ఇబ్బందులన్నింటిని తీరుస్తాం అని హామీతో ప్రజలను సిద్ధం చేయటానికి ఉపయోగించిన మాటలు అవి..

5.హోదా వద్దు ప్యాకేజీ ముద్దు..!

గతంలో చెప్పుకున్నట్లే హోదా రాదని, ఇవ్వబోరని తెలిసింది. అందుకే హోదా వస్తుందని ప్రజలను మభ్యపెట్టడం ఇష్టం లేక , హోదా కి సమానమైన ప్యాకేజీని సాదించుకోవడం కోసం మిత్రపక్షం భాజపా కి ఇబ్బంది రాకుండా చూడాలని ఆలోచించారు. మిత్రధర్మంతో చేసిన వ్యాఖ్యలు, వాస్తవాలు కూడా…

6.హోదా అంటే జైలుకే…!

ఆ రోజున విశాఖపట్నంలో రాష్ట్ర పరిశ్రమల సమావేశం. దేశ, విదేశాల నుంచి పారిశ్రామికవేత్తలు వస్తారు, వారి ముందు ఉద్యమం చేస్తే,అది శాంతియుతమైన ఉద్యమమే కావొచ్చు. కానీ దానిలోకి అసాంఘిక శక్తులు చొరబడి ఒకప్పటి తుని రైలు ఘటన జరిగే అవకాశం ఉద్దేశంతో ఆ రోజున జరిగిన నిరసన కార్యక్రమాన్ని ప్రభుత్వం భగ్నపరిచింది. తెలంగాణ ఉద్యమ సమయంలో హైదరాబాద్ కోల్పోయిన , తరలిపోయిన పెట్టుబడులే దీనికి ఉత్తమ ఉదాహరణ…

7.హోదా ఇవ్వాల్సిందే..!!

ఇన్నాళ్లు భరించారు. ఆఖరికి నాలుగో బడ్జెట్ లో కూడ ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజి నుంచి రూపాయి విదిలించని పరిస్థితి. పోలవరం నిధుల మీద ముందుకు కదలని పరిస్థితి. ఆర్ధిక లోటు పై నాలుగు సంవత్సరాల తరువాత కూడా అదే అస్పష్టత. విభజన చట్టంలోని 19 అంశాలకు నిధులు కేటాయించకుండా నిలువునా రాష్ట్రాన్ని మోసం చేసిన బీజీపీని దేశ స్థాయిలో ఎండగట్టటమే లక్ష్యంగా తెలుగుదేశం తీసుకున్న నిర్ణయం ఇది…

ఆఖరి బడ్జెట్ లో అయినా రాష్ట్ర ప్రభుత్వం ఆశించిన ఈ క్రింది అంశాలు, వారు మొండిచేయి చూపడంతో వారి మోసం చేశారని  కపట ప్రేమని ప్రజలకు తెలియచేయడం కోసం ఎన్డీఏ నుంచి బయటకు వచ్చింది తెలుగుదేశం..

ఈ నాలుగేళ్లలో కేంద్రం ఇస్తాను అని చెప్పిన ప్రాజెక్టులు

ఈ క్రింది వాటి కోసం ఎన్నో అవమానాలను భరించాడు చంద్రబాబు 

★ప్రత్యేక ప్యాకేజి-హోదాకి తగ్గకుండా నిధులు

★పోలవరం 2019 కి పూర్తి చేస్తాం

★ఆర్ధిక లోటు

★కేంద్ర విద్యాసంస్థలకు నిధుల కేటాయింపు

★రైల్వే జోన్-విశాఖ/అమరావతి

★హుదుద్ 1000 కోట్ల సాయం

★ITIR ప్రాజెక్ట్-తిరుపతి/విశాఖపట్నం

★Nimz-ప్రకాశం జిల్లా

★పెట్రోకెమికల్ కాంప్లెక్స్-కాకినాడ

★గ్యాస్ టెర్మినల్-కాకినాడ

★బెంగళూరు-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్

★విశాఖపట్నం-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్

★సాగరమాల ప్రాజెక్టు

★కడప స్టీల్ ప్లాంట్

★డ్రెడ్గింగ్ కార్పొరేషన్

★జాతీయ విపత్తుల సంస్థ

★దుగ్గరాజు పట్నం నౌకాశ్రయం

★National water way-4 (కాకినాడ-పుదుచ్చేరి)

★14.5 లక్షల ఇల్లు కేటాయింపు

ఇలా ఒకటేంటి ఎన్నో రకాల ప్రయోజనాలు ఉంటాయి. కేంద్రంలో భాగస్వామ్యం ఉన్నట్లయితే అని ఆశతో అసహాయ పరిస్థితులలో కలిసి సాగాడు తప్పితే భాజపా చేస్తున్న అన్యాయాలను ఎదుర్కోలేక కాదు…!

1 Comment

  1. Yes, edi correct. Babu ap prayojanalakosam kosam package ki oppukunadu. Adi kuda egoti babuni Doshi Laga chupalani bjp ethu vesindi. Babu bjp ni chithi chesadu.edi jagamerigina sathyam

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.