ఒంట‌రి పోరు అన్నారు గానీ… సందేహాలు తీర్చ‌రేమీ?

రాబోయే ఎన్నిక‌ల్లో 175 స్థానాల్లో జ‌న‌సేన పోటీచేస్తుంద‌ని ఆ పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ దీని చుట్టూ అనేక‌ సందేహాలు నెల‌కొన్నాయి. ప‌వ‌న్‌ ఒంట‌రిగానే పోటీచేస్తాడా లేక ఇత‌ర పార్టీల‌తో పొత్తు పెట్టుకుంటాడా అనేది ఇందులోని ప్ర‌ధాన అంశం. మ‌రోవైపు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌వ‌న్‌-వైసీపీ అధినేత జ‌గ‌న్ క‌లిసిపోవ‌డం ఖాయ‌మ‌ని టీడీపీ నేత‌లు విమ‌ర్శ‌లు చేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో.. దీనిపై క్లారిటీ ఇచ్చేందుకు జ‌గ‌న్‌ ప్ర‌య‌త్నించ‌క పోవ‌డం విడ్డూరం. మ‌రోవైపు  వైసీపీ అధినేత జ‌గ‌న్ కూడా ఒక విష‌యంపై క్లారిటీ ఇచ్చారు. ఒంట‌రిగానే పోటీచేస్తామ‌ని తేల్చిచెప్పేశారు. అయితే జన‌సేన.. వైసీపీతో పొత్తు ప్ర‌య‌త్నాల్లో ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆ పార్టీకి  30 సీట్లు ఇచ్చినా.. స‌గం కూడా గెలిచే ప‌రిస్థితి లేద‌నే వార్త‌లు కూడా వినిపిస్తున్నాయి.  175 నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీచేస్తే జ‌న‌సేన ఎన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో గెలుస్తుందనే ప్ర‌శ్న‌కు బ‌దులు దొర‌క‌డం చాలా క‌ష్ట‌మేన‌ని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ చ‌రిష్మా, సామాజిక‌బ‌లం, ఇత‌ర అంశాల‌న్నీ ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటే 30 నుంచి 35 నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌భావితం చూపే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. అది కూడా గోదావ‌రి జిల్లాల‌తో పాటు విశాఖ‌లోని కొన్ని ప్రాంతాల్లో మాత్ర‌మేననేది విశ్లేష‌కులు  చెబుతున్నారు. మ‌రి ఈ స‌మ‌యంలో ఆ పార్టీతో పొత్తు అంటే ఏ పార్టీ అయినా వెన‌క‌డుగు వేయాల్సిందేన‌ని వారు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా రాజ‌కీయాల‌ను ప‌వ‌న్ ఇంకా సీరియ‌స్‌గా తీసుకోలేదేమోన‌నే సందేహాలు కూడా వ్య‌క్త‌మ‌వుతున్నాయి.  రాష్ట్ర వ్యాప్తంగా 45 రోజుల పాటు తిరిగి స‌మ‌స్య‌లు తెలుసుకుం టా న‌ని చెప్పిన ప‌వ‌న్ యాత్ర ఎటుపోతోందో, ఎలాపోతోందో ఎవ‌రికీ అర్థం కావ‌డం లేదు. ప‌వ‌న్  ప్ర‌త్యామ్నాయ రాజ‌కీయాల‌కు వేదిక‌గా మార‌తాడ‌ని అంతా భావిం చినా.. ఇప్పుడు  ఆ అభిప్రాయాన్ని పోగొట్టేసుకున్నాడ‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. దీంతో ఆ పార్టీలోకి వెళ్లాల‌ని ఉవ్విళ్లూరిన నేత‌లు ఇప్పుడు  వెన‌క‌డుగు వేస్తున్నార‌ని తెలుస్తోంది. జ‌నసేన ఆవిర్భవించి ఇప్పటికే నాలుగేళ్లు గడిచాయి. ఇక ఎన్నికలకు మరెంతో సమయం లేదు. ఇప్ప‌టికైనా జ‌న‌సేన వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హరిస్తే మంచిద‌ని పలువ‌రు సూచిస్తున్నారు. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.