కొత్త ఫ్రంట్ కు  సంకేతాలు…

కర్నాటకలో బీజేపీ అధికారానికి దూరం కావడం ప్రాంతీయ పార్టీల్లో ఆశలు రేపుతోంది. అంతా ఐక్యంగా కదిలితే దేశ రాజకీయాల్లో సరికొత్త మార్పులు వస్తాయనే సంకేతాలు వస్తున్నాయి. అదే సమయంలో కొత్త ఫ్రంట్ పురుడు పోసుకునే అవకాశం ఉంది. బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చేలా ఉన్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల నాటికి ప్రాంతీయ పార్టీలు ఫ్రంట్ దిశగా అడుగులేస్తే బావుంటుందనే అంశం కర్నాటక ఎన్నికల తర్వాత వివిధ పార్టీల నేతల్లో మొదలైంది. ఇందుకు తొలి అడుగు కర్నాటక సిఎం కుమారస్వామి ప్రమాణ స్వీకారోత్సవం. 
తుస్సుమన్న కేసీఆర్
కర్ణాటకలో అధికారానికి దగ్గరగా వెళ్లిన బీజేపీ చివరకు చేతులెత్తేసిన సంగతి తెలిసిందే. కింగ్ మేకర్ నుంచి కింగ్ గా మారిన జేడీఎస్.. ప్రాంతీయ పార్టీల ఏకతా రాగానికి దారి చూపించింది. టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పుడు తన వంతు పాత్ర నిర్వహిస్తున్నారు. అందుబాటులో ఉన్న నేతలతో మాట్లాడుతున్నారు. కుమారస్వామి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన చంద్రబాబు ఇటు మమతా బెనర్జీ, అటు మాయావతి, ఇంకోవైపు కుమారస్వామి, కాంగ్రెస్ నేతలతో విడివిడిగా మాట్లాడారు. ఏపీకి జరిగిన అన్యాయాన్ని వారికి వివరించారు. విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను బీజేపీ ఎలా తుంగలో తొక్కిందో వివరించారు. ఏపీకి హోదా విషయంలో బీజేపీ మాట తప్పిన వైనం పై వివరణ ఇచ్చారు. ఫలితంగా అటు నుంచి నేతల స్పందన బాగా వచ్చింది. కేసీఆర్ ముందుగానే అక్కడకు వచ్చి వెళ్లడంతో ఆయన ఫ్రంట్ గురించి పెద్దగా ఎవరూ మాట్లాడుకోవడం లేదు. ఏదో మాటలు చెబుతారు తప్ప.. కేసీఆర్ వల్ల ఏం కాదనే వాదనసాగుతోంది. 
బాబు బాటలో మిగతా వారు…
కానీ చంద్రబాబు విషయంలో అలా లేదు. ప్రాంతీయ పార్టీలన్నీ ఏకతాటిపైకి తీసుకువచ్చే ప్రయత్నాలు సాగుతున్నాయి. అలా అంతా కలిసి రావాలని పిలుపునిచ్చారు చంద్రబాబు. మమతా బెనర్జీ కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాలు బలంగా ఉంటేనే దేశం బలంగా ఉంటుందని ప్రస్తావించారు. దేశ భవిష్యత్ కోసం మేమంతా ఏం చేయాలన్నా ధైర్యంగా చేస్తామని మమత పిలుపునివ్వడం గమనార్హం. మమత మాటే మాయవతి చెప్పారు. సానుకూలంగా స్పందించారు. టీడీపీ, బీఎస్పీ, తృణముల్ కాంగ్రెస్, కాంగ్రెస్, జేడీఎస్, డిఎంకే, శివసేన, జెఎంఎం తదితరపార్టీలు పార్టీలు బీజేపీపై తిరుగుబాటు జెండా ఎగురేస్తున్నాయి. బీజేపీ చేతగాని తనం మిగతా వారికి వరంగా మారింది. అందుకే ఇప్పుడు బీజేపీ దూకుడుగా వెళ్లలేకపోతుందంటున్నారు. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.