బాలయ్యకు ఘోర అవమానం.. షార్ట్ ఫిల్మ్ రిలీజ్ చేసిన నాగబాబు

‘నందమూరి బాలకృష్ణ ఎవరో తెలియదు’ మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు, ప్రముఖ సినీ నటుడు నాగబాబు చేసిన కామెంట్ ఇది. ఈ ఒక్క వ్యాఖ్యం ఇటీవల సంచలనమైంది. కొన్ని వారాలుగా మెగా అభిమానులు, నందమూరి ఫ్యాన్స్ మధ్య యుద్దానికి కారణం కూడా అయింది నాగబాబు చేసిన ఈ కామెంట్. సినీ పరిశ్రమతో పాటు, రాజకీయ రంగంలో కూడా కలకలం రేపిన మెగా బ్రదర్.. ఆ తర్వాత కూడా బాలయ్యను ఉద్దేశించి పలు కామెంట్లు చేశాడు. తర్వాత దీనికి గల కారణాలను వివరించాడు. గతంలో నందమూరి బాలకృష్ణ తమ కుటుంబంపై, తన సోదరులపై పలు కామెంట్స్ చేశాడని, అందుకోసం ఆయనకు కౌంటర్లు ఇస్తానని కొద్దిరోజులుగా వీడియోలు రిలీజ్ చేస్తున్న నాగబాబు.. ఇంకొక కామెంట్‌కు సమాధానం చెప్పి ఈ వివాదానికి ముగింపు పలుకుతానని మంగళవారం విడుదల చేసిన ఐదో వీడియో సమయంలో చెప్పాడు. దానికి తగ్గట్లుగానే ఆయన ఓ వీడియోను వదిలాడు. అయితే, ఇది అంతకుముందు విడుదల చేసినలాంటిది కాదు. బాలయ్యకు కౌంటర్ ఇచ్చేందుకు ఓ షార్ట్ ఫిలింను రూపొందించి, దానిని యూట్యూబ్‌లో విడుదల చేశాడు. ఇందులో బాలయ్యను ఘోరంగా అవమానించాడు నాగబాబు. దీంతో ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

ఈ షార్ట్ ఫిలింలో నాగబాబు తన కారులో ప్రయాణం చేస్తుంటాడు. ఈ సమయంలో కొందరు మహిళలు ఒక వ్యక్తిని చుట్టుముట్టి చితకబాదుతుంటారు. ఇది చూసిన ఆయన.. డ్రైవర్‌ను కారు ఆపమంటాడు. అప్పుడు తనలో తాను ‘ఏంటి.. ఒక్క మగాడిని ఇంత మంది ఆడాళ్లు కలిసి కొడుతున్నారు’ అనుకుంటాడు. తర్వాత మనకెందుకులే అంటూ కారు పోనీమని చెబుతాడు. అదే సమయంలో మరో ప్రాంతంలో కూడా అదే వ్యక్తిని కొడుతుంటారు. అప్పుడూ కారు ఆపడం.. బాధపడడం.. మనకెందుకులే అనుకుని వెళ్లిపోవడం చేస్తాడు. తర్వాత కొద్దిదూరం వెళ్లగానే అదే వ్యక్తి పరిగెత్తుకుంటూ కారుకు అడ్డంగా వస్తాడు. ఆయన వెనకాలే మహిళలు కర్రలు, చీపుర్లు పట్టుకుని వస్తారు. అప్పుడు వాళ్ల నుంచి ఆ వ్యక్తిని విడిపిస్తాడు నాగబాబు. ఎక్కడ చూసినా ఆడవాళ్లు కొడుతున్నారు.. అసలేం చేశావ్ అని ప్రవ్నిస్తాడు. అప్పుడు ఆ వ్యక్తి ‘‘ఏమీ లేదు సార్, పెద్దల మాట చద్ది మూట అన్నారు కదా అని, ఆడవాళ్లు కనిపిస్తే ముద్దైనా పెట్టాలి, కడుపైనా చేయాలి అని ఒక పెద్దాయన చెప్పినట్టు చేయబోయాను, దీనికే ఆడ వాళ్ళంతా నన్ను కొడుతున్నారు” అని అంటాడు. ఈ సమాధానం విని షాకైన నాగబాబు అతడిని మళ్లీ ఆడవాళ్ళకి అప్పగించి కొట్టమని చెబుతాడు. గతంలో బాలయ్య ఓ ఫంక్షన్‌లో చేసిన కామెంట్స్‌ను ఈ సందర్భంగా వాడుకున్నాడు మెగా బ్రదర్. ఇది చూసిన నందమూరి ఫ్యాన్స్.. ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.