అమెరికాలో టాలీవుడ్ హీరోయిన్ల వ్యభిచారం

తెలుగు సినీ ఇండ్రస్ట్రీలో డ్రగ్స్ కేసు రేపిన కలకలం అంతా ఇంత కాదు. దాని తర్వాత శ్రీరెడ్డి వ్యవహారం కూడా టాలీవుడ్‌ను కుదిపేసింది. వాటన్నింటికీ మించిన ఘటన ఒకటి తాజాగా బయటికొచ్చింది. అమెరికా కేంద్రంగా టాలీవుడ్‌కు చెందిన పలువురు నటులు తెరవెనుక సాగిస్తున్న చీకటి బాగోతం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన తెలుగు సినీ పరిశ్రమలో ప్రకంపనలు సృష్టిస్తోంది. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు వర్ధమాన హీరోయిన్లు, యాంకర్లతో.. ఓ వ్యాపారవేత్త, పలు హిట్ సినిమాల కోప్రొడ్యూసర్ వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న వార్త సంచలనం రేకెత్తిస్తోంది. ఈ హైలెవెల్ వ్య‌భిచారం గుట్టును అమెరికాలోని ‘చికాగో ట్రిబున్’ అనే వార్త సంస్థ ర‌ట్టు చేశాయి. ఈ వ్య‌భిచారం నిర్వ‌హిస్తున్న తెలుగు దంప‌తుల‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

కిషన్ మొదుగుమూడి(34) అలియాస్ రాజు అలియాస్ శ్రీరాజ్ చొన్నుపాటి దంపతులు.. తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో పెద్ద‌గా అవ‌కాశాలు సంపాదించుకోలేక‌పోతున్న‌ యంగ్ హీరోయిన్లకు వ‌ల వేస్తారు. వారికి తాత్కాలిక వీసాలు ఇప్పించి ఆమెరికాకు ర‌ప్పిస్తారు. అధిక ధనం ఆశ చూపి వ్య‌భిచారంలోకి దింపుతారు. భార‌తీయ స‌భ‌లకు, స‌మావేశాల‌కు వీరిని తీసుకెళ్లి.. హీరోయిన్ల‌తో శృంగారం అంటూ విటుల‌ను ఆక‌ర్షిస్తారు. వ్యభిచారంతోపాటు సెక్స్ వర్క్‌కు సంబంధించిన ప్రచారం కూడా నిర్వహిస్తున్నారని, అమెరికాలోని పలు ప్రదేశాల్లో ఈ నిర్వాకానికి పాల్పడ్డారని పోలీసుల విచారణలో తేలింది. ఇప్ప‌టివ‌ర‌కు దాదాపు ఐదుగురు టాలీవుడ్ హీరోయిన్లు తాత్కాలిక వీసాల మీద అమెరికా వ‌చ్చి వీరి నేతృత్వంలో వ్య‌భిచారం సాగించిన‌ట్టు సదరు పత్రిక వెల్ల‌డించింది. వ్యభిచారం నిర్వహిస్తున్న జంట.. విటుల వ‌ద్ద నుంచి మూడు వేల డాల‌ర్లు (దాదాపు 2 ల‌క్ష‌ల రూపాయ‌లు) వ‌సూలు చేస్తున్న‌ట్టు ఫెడ‌ర‌ల్ ఏజెన్సీ పేర్కొంది.

క్రిస్‌మ‌స్ సంద్భంగా గతేడాది ఓ యువ హీరోయిన్‌ను అమెరికాకు ర‌ప్పించి వ్య‌భిచారం నిర్వ‌హించ‌డంతో విష‌యం బ‌య‌ట‌ప‌డింది. త‌న‌ను వేధించ‌వ‌ద్ద‌ని, త‌న‌కు ఎలాంటి హానీ చేయ‌వ‌ద్ద‌ని ఆ యువ హీరోయిన్ రాసిన ఈ-మెయిల్ ఆధారంగానే ఈ వ్య‌వ‌హారం వెలుగులోకి వ‌చ్చింది. ఈ కేసుకు సంబంధించినంత‌వ‌ర‌కు ఆ హీరోయిన్‌ను.. ఫెడ‌ర‌ల్ పోలీసులు బాధితురాలిగానే చూస్తున్నారు. ఆమెను `విక్టిమ్‌-ఎ`గా పేర్కొంటున్నారు. ఇక‌, కిష‌న్ భార్య చంద్ర ఈ సెక్స్ రాకెట్‌కు సంబంధించి లెక్క‌లు రాసుకోవ‌డం, విటుల‌తో డ‌బ్బులు గురించి మాట్లాడ‌డం వంటి విష‌యాల‌ను డీల్ చేసేద‌ట‌. ఆమె ఫోన్ ద్వారానే విటుల‌తో బేర‌సారాలు సాగించేద‌ట‌. కాగా, కిష‌న్ ఇంటిపై దాడి చేసిన‌పుడు అక్క‌డున్న ఓ బ్యాగ్‌లో 70 కండోమ్‌లు దొరికాయ‌ని పోలీసులు కోర్టుకు స‌మ‌ర్పించిన నివేదిక‌లో పేర్కొన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.