కడప నాయకుడి దెబ్బతో… నైరాశ్యంలోకి జగన్

వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడిగా రాజకీయ ఆరంగేట్రం చేసిన జగన్.. ఆయన మరణానంతరం కాంగ్రెస్ పార్టీతో విభేదించి 2011లో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్(వైసీపీ) పార్టీని స్థాపించాడు. అయితే ఆలోపే రాష్ట్ర విభజన.. ఎన్నికలు రావడం జరిగిపోయాయి. అధికారమే లక్ష్యంగా, ఎన్నో అంచనాలతో ఎన్నికల బరిలో దిగిన వైసీపీ.. టీడీపీ హవా ముందు నిలవలేకపోయింది. ఫలితంగా ప్రతిపక్ష పార్టీగా మిగిలిపోయింది. 2014 ఎన్నికల్లో చేసిన పొరపాట్లను సరిదిద్దుకుని ఈసారి విజయం సాధించాలని భావిస్తున్న వైసీపీ.. అందుకు అనుగుణంగా అడుగులు వేస్తోంది. కేంద్రంలో బీజేపీ గెలవడంలో కీలక పాత్ర పోషించిన వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌ను తమ పార్టీ వ్యూహకర్తగా నియమించుకున్న వైసీపీ.. ఆయన సలహాలు, సూచనలతో ఎన్నికలకు సిద్ధమవుతోంది. వచ్చే ఎన్నికల్లో గెలిచి ఎలాగైనా అధికారం చేపట్టాలనుకుంటున్న జగన్.. అందుకోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు.

ఇందులో భాగంగా ప్రజా సమస్యలు తెలుసుకోవడంతో పాటు, ప్రభుత్వ వ్యతిరేకతను తనకు అనుకూలంగా మలచుకోవాలని భావించిన జగన్.. ప్రజాసంకల్ప యాత్ర పేరుతో పాదయాత్రను ప్రారంభించాడు. గత సంవత్సరం నవంబర్ ఆరో తేదిన 2004 ఎన్నికలకు ముందు తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వేసిన ప్లాన్‌ను ఇప్పుడు అమలు చేస్తున్నాడు జగన్. ఆయన మాదిరిగానే గత సంవత్సరం చివరి నుంచి జగన్ ప్రజాసంకల్ప యాత్ర పేరుతో పాదయాత్రను ప్రారంభించాడు. రాష్ట్రంలోని 13 జిల్లాలు.. ప్రతీ జిల్లాలోని 5 నియోజకవర్గాలు.. ఇలా మొత్తం 3000 కి.మీటర్లు పాదయాత్ర చేయాలని జగన్ టార్గెట్ పెట్టుకున్నాడు. గతేడాది నవంబర్‌లో కడప జిల్లా ఇడుపులపాయ వద్ద వైఎస్‌ సమాధి నుంచి ప్రారంభమైన జగన్ పాదయాత్ర.. కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో పూర్తి చేసి, ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో కొనసాగుతోంది.

జగన్ పాదయాత్ర ప్రారంభించి ఇప్పటికి 200 రోజులు దాటిపోయింది. ఆయన పాదయాత్ర చేస్తున్న చోట మిశ్రమ స్పందన వస్తోంది కానీ, ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కడా కనిపించడంలేదట. గత శుక్రవారం సీబీఐ కోర్టుకు హాజరైన జగన్.. హైదరాబాద్‌లో పార్టీలోని కొందరు నేతలతో సమావేశం ఏర్పాటు చేశాడట. ఈ సమావేశంలో జగన్ తొలిసారి మనసు విప్పి మాట్లాడాడట. ‘‘నేను 200 రోజుల నుంచి పాదయాత్ర చేస్తున్నా. నాకు రాని క్రెడిట్ పట్టుమని పది రోజులు కూడా దీక్ష చేయని సీఎం రమేష్.. ఏపీ ప్రజల దృష్టిలో హీరో అయిపోతున్నాడు’’ అని ఆవేదన వ్యక్తం చేశాడట. ప్రత్యేక హోదా కోసం ఎంపీలతో రాజీనామా చేయించినా ఆ క్రెడిట్ కూడా తమకు దక్కలేదని జగన్ నైరాశ్యంతో మాట్లాడాడట. జగన్ మాటలను విన్న ఆ పార్టీ నేతలు బాధపడడం తప్ప ఏమీ చేయలేకపోయారట. సీఎం కావాలని కలలు కంటోన్న జగన్.. వీటన్నింటినీ తట్టుకుని ఎలా ముందగుడు వేస్తాడో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.