టీడీపీకి షాక్, వైకాపాలోకి మాజీ ఎమ్మెల్యే

టీడీపీకి షాక్ ఇవ్వనున్నారు ఆ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి. విజయవాడలో తన అనుచరులతో భేటీ అయిన రవి… చివరకు వైకాపాలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు గుంటూరు జిల్లా పాదయాత్రలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహనరెడ్డిని కలిసి తమ రాక సంగతి చెప్పారు. వైకాపా ఊహించని రీతిలో అతను రావడంతో ఆశ్చర్యపోవడం జగన్ వంతు అయింది. తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు రవి పార్టీ మారకుండా కట్టడి చేసినా అది కొద్ది రోజులే అయింది. విజయవాడ తూర్పు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవికి నియోజకవర్గంలో గట్టి పట్టు ఉంది. విజయవాడ ఎంపీ కేశినేని నాని ఈ మధ్య రవిని ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు తీసుకువెళ్లి మాట్లాడించారు. అప్పుడు తాత్కాలికంగా ఒప్పుకున్నట్లు కనిపించారు రవి. చివరకు రవి వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరడానికి నిర్ణయం తీసుకున్నారు.
ఈ నెల 14న ఇందుకు ముహుర్తం. ‘మీరు పార్టీలోకి వస్తారనుకోలేదని, వచ్చినందుకు కృతజ్ఞతలని’ జగన్‌ అన్నారని తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీలో సరైన గుర్తింపు ఇవ్వకపోవడంతో కార్యకర్తల కోరిక మేరకు వైకాపాలో చేరుతున్నట్లు రవి తెలిపారు. మరోవైపు రవి పార్టీ మారకుండా ఉండేందుకు టీడీపీ నేతలు పావులు కదుపుతున్నారు. హోదా ఉద్యమం తీవ్రంగా సాగుతోంది. టీడీపీ ఎంపీలు ఆందోళనలు ఉధృతం చేశారు. ఇక జిల్లాల్లో పోరు తీవ్రమైంది. ఇలాంటి సమయంలో రవి పార్టీ మారే ఆలోచన చేయడం ముందస్తు వ్యూహంలో భాగంగానే ఉంది. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.