శివాజీ ఊహిస్తున్నాడా! ఆశిస్తున్నాడా!

ఆప‌రేష్ గ‌రుడ‌.. రాజ‌శేఖ‌ర్ సినిమా గ‌రుడ‌వేగ వ‌చ్చిన టైంలో పాలిటిక్స్‌లో వినిపించిన మాట‌. కేంద్రం ఏపీపై క‌క్ష‌సాధించేందుకు.. ముఖ్యంగా సీఎం చంద్రబాబును కేసుల్లో ఇరికించేందుకు న‌రేంద్ర‌మోదీ ఆడిస్తున్న నాట‌క‌మంటూ అప్ప‌ట్లో బాంబు పేల్చాడు. ఇదంతా.. శివాజీకు తెలుసు అనేందుకు ప‌క్కా ఆధారాల్లేవు. ఎందుకంటే శివాజీ పెద్ద‌న‌టుడు కూడా కాదు. పైగా ఢిల్లీ స్థాయిలో ప‌రిచ‌యాలున్నంత‌టి గొప్ప‌వాడు కానేకాదు. న‌ర్స‌రావుపేట‌లో ఉండే మామూలూ కుర్రాడు. సిని ఇండ‌స్ట్రీలో స్వ‌యంగా ఎదిగాడు. పేరు.. డ‌బ్బు సంపాదించాడు. దాంతోపాటే కాస్త చెడ్డ‌పేరు కూడ‌గ‌ట్టుకున్నాడు. ఆ త‌రువాత వ‌రుస సినిమాలు ప్లాప్‌తో రాజ‌కీయం వైపు మ‌ళ్లాడు. ఏపీ హోదా విష‌యంలో మేధావుల సంఘం నేతతో క‌ల‌సి.. నాలుగైదు దీక్ష‌లు.. ఏడెనిమిది ప్రెస్‌మీట్లు పెట్టాడు. ఓకే.. కానీ.. బీజేపీ స‌ర్కారు ఏదో చేయ‌బోతుంద‌ని.. సీబీఐ, ఈడీల‌ను రంగంలోకి దింపి.. బాబును అరెస్ట్ చేయ‌టం ఖాయ‌మంటూ బాంబుపేల్చాడు. మ‌ళ్లీ మూడు నెల‌ల త‌రువాత‌.. మీడియా ముందుకు వ‌చ్చి.. తూచ్‌.. ఇప్పుడు గ‌రుడ‌వేగ రూపం మార్చుకుంది.. కొత్త పేరుతో రేపో.. ఎల్లుండో.. చంద్ర‌బాబును అరెస్ట్ చేస్తారంటూ ఓ సారి.. త‌న‌కు రాజ‌కీయ పార్టీలతో ప్రాణాపాయం ఉంద‌ని మ‌రోసారి ఏదో చెప్పాల‌నుకుని.. తాను చెప్పాల‌నుకున్నది క‌క్కేశాడు.
అంత‌టితో ఆగితే స‌రిపోయేది. కానీ.. బీజేపీ పెద్ద‌ల‌ను దీనిలోకి లాగాడు. ప‌నిలో ప‌నిగా.. మోదీ హ‌త్య‌కు కుట్ర‌ప‌న్నారంటూ కేసుల్లో చిక్కిన వ‌ర‌వ‌ర‌రావు త‌ర‌పున వ‌కాల్తా పుచ్చుకున్న‌ట్టుగా స్పందించాడు. ఇన్నాళ్లు అజ్ఞాతంలో ఉన్న శివాజీ.. ఇప్పుడు బ‌య‌ట‌కు వ‌చ్చి.. అదీ.. తెలంగాణ స‌ర్కారు ర‌ద్ద‌యి.. ఎన్నిక‌ల‌కు సిద్ధ‌మవుతున్న వేళ‌.. చంద్ర‌బాబు హైద‌రాబాద్‌లో హ‌స్తంతో పొత్తుల‌పై చ‌ర్చిస్తున్న స‌మ‌యంలో.. శివాజీ మాట‌ల‌ను ఎలా అర్ధం చేసుకోవాల‌నేది అర్ధంకాని ప్ర‌శ్న‌గానే మారింది. నిజంగా శివాజీ చెప్పేవిష‌యంలో నిజ‌మైతే.. గ‌తంలో గ‌రుడ ఏమైంది. ఇప్పుడు.. అరెస్టు చేయాల‌ని బాబుపై క‌క్ష‌సాధించ‌టం వ‌ల్ల లాభం ఎవ‌రికి. అదే జ‌రిగితే.. బాబుపై సానుభూతి పెరుగుతుంది. ఎటువంటి క‌ష్టం లేకుండానే ఓట్లు ప‌డ‌తాయి. ఈ మాత్రం అర్ధంచేసుకోని మేధావిగా అదిరిందయ్యా చంద్రం అనుకుంటూ.. మీడియా ముందు శివాజీ ఎందుకింత ఎమోష‌న్ అవుతున్నాడ‌నేది తేలాలి. ఒక‌వేళ రాజ‌కీయంగా ఏమైనా ఆశిస్తున్నాడా! చంద్ర‌బాబుకు ఏదో జ‌ర‌గ‌బోతుంద‌ని ఊహిస్తున్నాడా! 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.