సీఎం ర‌మేష్‌.. వైసీపీ కోవ‌ర్టా!

అదేంటీ.. ఇంత‌మాట‌న్నారు.. ఒక్క‌సారి ఇంత విమ‌ర్శా.. నిజ‌మే.. సీఎం చంద్ర‌బాబునాయుడుకి అత్యంత ఆప్తుడు..రెండోసారి రాజ్య‌స‌భ‌కు ఎంపికైన సీఎం ర‌మేష్‌పై పెల్లుబుకిన ఆరోప‌ణ‌లు. అవ‌న్నీ విప‌క్షాలు చేసుంటే.. ఇప్ప‌టికే  టీడీపీ  శ్రేణులు దుమ్మెత్తిపోసేవి. కానీ.. ఎంపీ ర‌మేష్‌పై సంచ‌ల‌న కామెంట్స్ చేసింది. స్వ‌యంగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే  పొద్దుటూరు నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌ఛార్జి వ‌ర‌ద‌రాజుల రెడ్డి. నిజ‌మే.. సీఎం ర‌మేష్‌పై 2014 ఎన్నిక‌ల ముందు నుంచి పార్టీ శ్రేణుల్లో అనుమానాలుండేవి. పైగా.. బాబును త‌ప్పుదారి ప‌ట్టిస్తున్నాడ‌నే ప్ర‌చారం జ‌రిగింది. అనంత‌రం ఆదినారాయ‌ణ‌రెడ్డి వ‌ర్గంతో గొడ‌వ‌లు షురూ చేశారు. దీంతో స్వ‌యంగా ఆది కూడా తొడ గొట్టాడు. ఒకానొక సంద‌ర్భంలో ఆది వ‌ర్సెస్ సీఎం ర‌మేష్ వ‌ర్గాలు బాహాబాహీ త‌ల‌ప‌డ్డాయి. ఇప్పుడిక వ‌ర‌ద‌రాజులు కూడా బ‌య‌ట‌ప‌డ్డారు. సీఎం ర‌మేష్ బ‌హిరంగ వ‌సూళ్ల‌కు  దిగుతున్నారంటూ ఆరోపించారు. బాహాటంగా వైసీపీకు స‌హ‌క‌రిస్తున్నారంటూ సంచ‌ల‌న కామెంట్స్ చేశాడు.  ఏయే కాంట్రాక్టర్ల నుంచి ఎంత తీసుకున్నార‌నే చిట్టా త‌న వ‌ద్ద ఉందంటూ తేల్చారు. పైగా.. వార్డు మెంబ‌రుగా కూడా గెల‌వ‌లేని ర‌మేష్‌.. చంద్ర‌బాబుకు మాయ‌మాట‌లు చెప్పి రెండో సారి ఎంపీ ప‌ద‌వి పొందాడంటూ ఎద్దేవాచేశారు. 

ఇప్ప‌టికే క‌డ‌ప జిల్లాలో రాజకీయాలు అధికార పార్టీకు త‌ల‌నొప్పిగా మారాయి. పాగా వేద్దామ‌నుకున్న జిల్లాలో సొంత‌పార్టీ అంత‌ర్గ‌త క‌ల‌హాలు కుమ్ములాట‌లు బాబుకు చికాకు తెప్పిస్తున్న‌న్న‌ట్లు సమాచారం. ఇప్ప‌టికే సీఎం ర‌మేష్ త‌ర‌చూ వివాదాల్లో చిక్కుకోవ‌టంపై అదిష్ఠానానికి చాలామంది నేత‌లు ఫిర్యాదు చేస్తూ వచ్చారు. ఇప్పుడు ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థి జ‌గ‌న్‌కు వెన్నుదన్నుగా ఉంటున్నాడంట వ‌ర‌ద‌రాజులు చేసిన కామెంట్స్ అంత తేలిక‌గా తీసుకునేవి కాదు. పైగా.. సాక్క్ష్యాల‌తో స‌హా నిరూపిస్తానంటూ చెప్ప‌టంతో టీడీపీను ఇరుకున పెట్టిన‌ట్టుగానే పార్టీ భావిస్తుంది. అదే జ‌రిగితే.. ఇది వైసీపీకు అనుకూలంగా.. టీడీపీ వైపు ప్ర‌తికూలంగా మారే ప్ర‌మాదం ఉంది. దీనికి ఇప్పుడే పుల్‌స్టాప్ పెట్ట‌క‌పోతే.. ప‌రిస్థితి తీవ్రంగా మారి.. జిల్లాలో పార్టీ ప్ర‌తిష్ఠ దెబ్బ‌త‌నే ప్ర‌మాద‌మూ లేక‌పోలేదు. అయితే.. ఇదంతా.. వ‌ర‌ద‌రాజులు కావాల‌నే చేస్తున్నారా.. నిజంగా సీఎం ర‌మేష్ అవినీతికి దిగ‌జారారా అనేది తేలాల్సి ఉంది. దీనిపై తాడోపేడో తేలేంత వ‌ర‌కూ తాను మాట‌ల‌దాడి కొన‌సాగిస్తూనే ఉంటానంటూ వ‌ర‌ద‌రాజులు బీష్మించుకోవ‌టం మాత్రం కొస‌మెరుపు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.